Good news for EPF account Holdars.
ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.
అకౌంట్ ట్రాన్స్ఫర్ మరింత సులభం..
న్యూఢిల్లీ: ఈపీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఈపీఎస్ అకౌంట్ ను ఎంతో సులభంగా ట్రాన్స్ఫర్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. సాధారణంగా ఉద్యోగి ఓ సంస్థ నుంచి మరో సంస్థకు మారినప్పుడు ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ ను మార్చుకోవాలి. ఈ పద్ధతి ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. అకౌంట్ ను ట్రాన్స్ఫర్ చేయించుకోవడంతో పాటు డబ్బులను విత్ డ్రా చేసుకోవడం మరింత కష్టతరంగా మారింది. ఇప్పుడు ఆ సమస్యను కేంద్రం ఈపీఎఫ్ కొత్త మార్గదర్శకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిని అమలు చేస్తే సులభంగా ఉద్యోగులు ఈవీఎస్ అకౌంట్లు మార్చుకోవచ్చు. ఈ మార్గదర్శకాలు విడుదలకు ముందు ఈపీఎఫ్ఓ అకౌంట్ ను ఓ సంస్థ నుంచి మరో సంస్థకు బదలీ చేసేందుకు ముందు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. రిజిస్టర్ మొబైల్ నెంబర్ యాక్టివ్ గా ఉండాలి. అకౌంట్ హోల్డర్ మునుపటి లేదా ప్రస్తుతసంస్థ ఈపీఎఫ్ లో డిజిటల్ రిజిస్టర్ సంతకాలు కలిగి ఉండాలి. దీంతో పాటు బ్యాంకు కేవైసీ పూర్తి చేసి ఉండాలి.
0 Response to "Good news for EPF account Holdars."
Post a Comment