Good news .. Retirement fund to grow up to Rs 7 lakh.
గుడ్ న్యూస్ .. రూ .7 లక్షల వరకు పెరగనున్న రిటైర్మెంట్ ఫండ్ .
డియర్‌నెస్ అలవెన్స్ ని ఉద్యోగులకి కేంద్రం పెంచింది. అలానే గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ వంటి వాటి లెక్కింపునకు పరిగణలోకి తీసుకునే డీఏ శాతాన్ని కూడా సవరించింది.
2020 జనవరి 1 నుంచి 2021 జూలై 30 మధ్య లో రిటైర్ అయిన ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. ఇది ఇలా ఉంటే కొత్త నిబంధనల ప్రకారం చూస్తే.. 2020 జనవరి 1 నుంచి 2020 జూన్ 30 మధ్య కాలంలో రిటైర్ అయిన వారికి డీఏ రేటు 21 శాతంగా వర్తిస్తుంది. అదే 2020 జూలై 1 నుంచి 2020 డిసెంబర్ 31లోపు రిటైర్ అయిన వారికి డీఏ రేటు 24 శాతంగా ఉంటుంది. అలానే 2021 జనవరి 1 నుంచి 2021 జూన్ 30లోపు రిటైర్ అయిన వారికి అయితే 28 శాతంగా వర్తిస్తుంది.
ఇక ఇది ఇలా ఉంటే రిటైర్మెంట్ సమయంలో రూ.40 వేల బేసిక్ శాలరీ కలిగిన వారికి 11 శాతం డీఏ పెరుగుదల వల్ల ఎక్కువ ప్రయోజనం పొందొచ్చు అని నివేదిక చెబుతోంది. అయితే గ్రాట్యూటీ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ దాదాపు రూ.1,17,000 పెరుగుతుంది. అదే కనుక నెలకు రూ.2.5 లక్షల బేసిక్ పే కలిగి ఉంటే రిటైర్మెంట్ ఫండ్ ఏకంగా రూ.7 లక్షలకు పైగా పెరుగుతుంది. మనం రూల్స్ ని చూస్తే..
గ్రాట్యూటీ పేమెంట్ అనేది ఐదేళ్ల సర్వీస్ పూర్తయిన తర్వాత లభిస్తుంది. ఒకవేళ కనుక కొత్త లేబర్ కోడ్ అమలులోకి వచ్చింది అంటే అప్పుడు ఏడాది సర్వీస్ అయ్యాక తర్వాత గ్రాట్యూటీ పొందే ఛాన్స్ ఉంటుంది. అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త కోడ్ అమలులోకి రావాల్సి ఉంది. అయితే ఇది వాయిదా అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
0 Response to "Good news .. Retirement fund to grow up to Rs 7 lakh."
Post a Comment