Indians go to 18 countries ..
18 దేశాలకు భారతీయులు వెళెచ్చు .
భారత ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణికుల విమానాలపై సెప్టెంబర్ 30 వరకు నిషేధం పొడిగించింది. అయితే, 18 దేశాలలో 'ఎయిర్ బబుల్' ఏర్పాటు ద్వారా 49 నగరాలకు విమాన సర్వీసులు ప్రారంభించారు.
సెప్టెంబర్ 3న, భారతదేశం బంగ్లాదేశ్‌తో ఎయిర్ బబుల్ ఒప్పందంతో విమానాలను ప్రారంభించింది. దీంతో ఇండిగో, ఎయిర్ ఇండియా, ఇతర దేశీయ విమానయాన సంస్థలు ఢాకాకు విమానాలు నడుపుతున్నాయి.'ఎయిర్ బబుల్' ఒప్పందం కింద భారతదేశం ఆఫ్ఘనిస్తాన్, యూఏఈ,కువైట్,ఒమన్, బహ్రెయిన్, ఖతార్, బంగ్లాదేశ్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, కెన్యా, మాల్దీవులు,నేపాల్,రష్యా,శ్రీలంక,యూకె,యూ.ఎస్.ఏ దేశాలకు విమాన సర్వీసులు నడుపుతోంది.
మరికొన్ని దేశాలు కూడా భారతదేశానికి ప్రయాణ ఆంక్షలను సడలించాయి.శనివారం ఫిలిప్పీన్స్ దేశం భారతదేశంపై ప్రయాణ ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది.అదే సమయంలో కరోనా వ్యాక్సిన్ రెండు మోతాదులను తీసుకున్న భారతీయులకు టర్కీలో 14 రోజుల క్వారంటైన్ లేదు. అయితే టర్కీకి చేరుకున్న తర్వాత భారతీయ ప్రయాణికులు తప్పనిసరిగా RT-PCR పరీక్ష రిపోర్ట్‌ని చూపించాలి.ఇది 72 గంటల కంటే పాతది ఉండకూడదు. అయితే కొన్ని దేశాల నుంచి వచ్చే వ్యక్తులపై భారత ప్రభుత్వం ప్రయాణ ఆంక్షలను విధించింది.
దీని ప్రకారం యూకె, యూరోపియన్ యూనియన్, పశ్చిమ ఆసియా దేశాల నుంచి వచ్చే వ్యక్తులు RT-PCR పరీక్ష రిపోర్ట్ చూపించడం తప్పనిసరి. అదే సమయంలో భారతదేశానికి వచ్చిన తర్వాత కూడా వారు తప్పనిసరిగా RT-PCR పరీక్ష చేయించుకోవాలి. దేశంలో కోవిడ్-19 మహమ్మారి కారణంగా అంతర్జాతీయ ప్రయాణికుల సేవలు మార్చి 23, 2020 నుంచి నిలిపివేశారు. అయితే మే 2020 నుంచి వందే భారత్ మిషన్ కింద ప్రత్యేక అంతర్జాతీయ విమానాలు మాత్రం నడుస్తున్నాయి.
0 Response to "Indians go to 18 countries .."
Post a Comment