NASA Trip
NASA Trip : ఈ పరీక్షలో టాప్ ప్లేస్ సాధిస్తే స్కాలర్షిప్ ... ఉచితంగా నాసా ట్రిప్.
పాఠశాల విద్యార్థులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ. సంస్థ నిర్వహించే ఆకాశ్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్ (ANTHE 2021) ద్వారా 7 నుంచి 12 తరగతి పరీక్షల్లో అత్యుత్తమ స్కోర్ సాధించిన విద్యార్థులకు 100% స్కాలర్‌షిప్స్ (Scholarship) ఇస్తామని తెలిపింది.
దీంతో పాటు ఐదుగురు విద్యార్థులకు తల్లిదండ్రుల్లో ఒకరితో కలిసి నాసా ట్రిప్ (NASA Trip) వెళ్లే అవకాశం సైతం ఆకాశ్ ఎడ్యుకేషనల్ సంస్థ కల్పించనుంది. ట్యూషన్ ఫీజుపై స్కాలర్ షిప్‌తో పాటు టాప్ మార్కులు సాధించిన విద్యార్థులకు క్యాష్ ప్రైజ్ కూడా అందజేస్తామని ఆకాశ్ సంస్థ వెల్లడించింది. అర్హత సాధించిన విద్యార్థులు అదనపు ప్రయోజనంగా ఏఈఎస్‌ఎల్ అనుబంధ సంస్థ మెరిట్ నేషన్‌కు చెందిన స్కూల్ బూస్టర్ కోర్సు ఉచితంగా పొందవచ్చు.
ఏఎన్‌టీహెచ్‌ఈ పరీక్ష సమయం, పరీక్ష విధానం
ఏఎన్‌టీహెచ్‌ఈ 2021 పరీక్షను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండు విధానాల్లో నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో డిసెంబర్ 4, 2021 నుంచి డిసెంబర్ 12, 2021 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఆయా తేదీల్లో ఏఎన్‌టీహెచ్‌ఈ ఆన్‌లైన్ పరీక్షను ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల మధ్య నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి ఒక గంట మాత్రమే ఉంటుంది.
ఆఫ్‌లైన్ పరీక్షలను 2021 డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 12 వరకు రోజు రెండు షిప్టుల్లో నిర్వహించనున్నారు. ఉదయం 10:30 గంటల నుంచి ఉదయం 11:30 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4:00 గంటల నుంచి 5 గంటల వరకు ఆఫ్‌లైన్ పరీక్ష ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న 215 ఆకాశ్ ఇనిస్టిట్యూట్ కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. పరీక్ష రాసే విద్యార్థులు ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కొవిడ్-19 మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. విద్యార్థులకు తమకు అనుకూలంగా ఉండే ఒక గంట స్లాట్ ఎంచుకోవచ్చు.
ఏఎన్‌టీహెచ్‌ఈ పేపర్ నమూనా
ఏఎన్‌టీహెచ్‌ఈ పరీక్షకు 90 మార్కులు ఉంటాయి. విద్యార్థుల గ్రేడ్, వారు ఎంచుకునే స్ట్రీమ్స్ ఆధారంగా ఇందులో 35 మల్టీఫుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. 7 నుంచి 9 వ తరగతి విద్యార్థులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలాజీ, మ్యాథమ్యాటిక్స్, మెంటల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు ఉంటాయి. అలాగే మెడిసిన్ చదవాలని అభిలాషిస్తున్న 10వ తరగతి విద్యార్థుల కోసం ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మెంటల్ ఎబిలిటీ కవర్ చేసేలా పరీక్ష ఉంటుంది. అదే ఇంజినీరింగ్ స్ట్రీమ్ కోరుకునే విద్యార్థుల కోసం ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమ్యాటిక్స్, మెంటల్ ఎబిలిటీతో కూడిన ప్రశ్నలు ఉంటాయి.
నీట్ రాసేందుకు సిద్ధమవుతున్న 11, 12 వ తరగతి విద్యార్థుల కోసం రూపొందించిన ప్రశ్నాపత్రంలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్ట్స్ ఉంటాయి. అలాగే ఇంజినీరింగ్ చదవాలనుకునే విద్యార్ధులు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమ్యాటిక్స్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
ఏఎన్‌టీహెచ్‌ఈ దరఖాస్తు వివరాలు
ఆకాశ్ ఆఫిషియల్ వెబ్‌సైట్ ద్వారా ఈ పరీక్షకు అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్ పరీక్షలు ప్రారంభయ్యే 3 రోజుల ముందు వరకు, ఆఫ్‌లైన్ అయితే పరీక్ష తేదీకి 7 రోజుల ముందు వరకు ఎన్‌రోల్‌మెంట్ చేసుకోవచ్చు. పరీక్ష ఫీజు రూ.99. దీన్ని ఆన్‌లైన్‌లో లేదా మీ సమీపంలోని ఆకాశ్ ఇనిస్టిట్యూట్ సెంటర్‌లో చెల్లించవచ్చు. 10 -12 తరగతులకు సంబంధించిన ఏఎన్‌టీహెచ్‌ఈ 2021 ఫలితాలు 2022 జనవరి 2న, 7-9 తరగతుల ఫలితాలు జనవరి 4న విడుదలవుతాయి.
0 Response to "NASA Trip"
Post a Comment