Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

NEET: Neat test .. girls do not come with earrings and chains ..!

NEET: నీట్‌ పరీక్ష.. అమ్మాయిలు చెవిపోగులు, చైన్లతో రావొద్దు..!

NEET: Neat test .. girls do not come with earrings and chains ..!

డ్రెస్‌కోడ్‌ కచ్చితంగా పాటించాలన్న నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ

దిల్లీ: వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ స్థాయి *నీట్‌ పరీక్ష సెప్టెంబరు 12న జరగనుంది*. ఈ పరీక్ష నిర్వహిస్తున్న నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ తాజాగా పరీక్ష రాసే విద్యార్థులకు ప్రత్యేక డ్రెస్‌కోడ్‌ ప్రకటించింది. అబ్బాయిలు పొడుగు చేతుల చొక్కాలు, బూట్లు ధరించి రావొద్దని స్పష్టం చేసింది. ఇక అమ్మాయిలు కూడా చెవిపోగులు, చైన్లు వంటి ఆభరణాలు పెట్టుకోవద్దని ఆదేశించింది. 

డ్రెస్‌కోడ్‌ నిబంధనలివే..

  • నీట్‌ పరీక్ష రాసే విద్యార్థులు లేత రంగు దుస్తులు మాత్రమే ధరించారు. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా పొడుగు చేతులుండే డ్రెస్‌లు వేసుకోవద్దు. ఒకవేళ మతపరమైన సంప్రదాయం ప్రకారం అలాంటి దుస్తులు వేసుకోవాల్సి వస్తే.. అలాంటి విద్యార్థులు మధ్యాహ్నం 12.30 గంటలకు పరీక్ష కేంద్రానికి రావాలి
  • అభ్యర్థులు బూట్లు వేసుకుని వస్తే పరీక్ష హాలులోకి అనుమతించరు. స్లిప్పర్లు, తక్కువ హీల్‌ ఉండే సాండిల్స్‌ మాత్రమే వేసుకుని రావాలి.
  • వ్యాలెట్‌, పౌచ్‌, గాగుల్స్‌, టోపీలు, హ్యాండ్‌బ్యాగులు వంటివి తీసుకురావొద్దు.
  • పెన్సిల్‌బాక్సు, కాలిక్యులేటర్‌, పెన్ను, స్కేల్‌, రైటింగ్‌ ప్యాడ్‌, వంటికి కూడా అనుమతించరు.
  • మొబైల్‌ ఫోన్‌, బ్లూటూత్‌, ఇయర్‌ఫోన్స్‌, హెల్త్‌బ్యాండ్‌, వాచ్‌లు వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు కూడా తమ వెంట తీసుకురావొద్దు.
  • అమ్మాయిలు చెవిపోగులు, చైన్లు, ముక్కు పుడక, నెక్లెస్‌, బ్రాస్‌లెట్‌ వంటి ఆభరణాలు, అబ్బాయిలు చైన్లు, బ్రాస్‌లెట్లు వేసుకోవద్దు.
  • పరీక్ష రాసే అభ్యర్థులు తమ వెంట ఎలాంటి ఆహార పదార్థాలు, వాటర్‌ బాటిళ్లు కూడా తీసుకురావొద్దు. అవేవీ పరీక్ష హాలులోకి అనుమతించబోమని ఎన్‌టీఏ స్పష్టం చేసింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "NEET: Neat test .. girls do not come with earrings and chains ..!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0