NIACL Recruitment 2021
NIACL Recruitment 2021: న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీలో 300 ఉద్యోగాలు... అప్లై చేయు విధానం.
NIACL Recruitment 2021 ది న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్-NIACL భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. నోటిఫికేషన్ వివరాలతో పాటు ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకోగలరు.
భారత ప్రభుత్వానికి చెందిన జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ ది న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్-NIACL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్కేల్ 1 కేడర్‌లో ఆఫీసర్ (జనరలిస్ట్) పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 300 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు 2021 సెప్టెంబర్ 1న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అప్లై చేయడానికి 2021 సెప్టెంబర్ 21 చివరి తేదీ. అభ్యర్థులు ఇదే వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ఇతర పద్ధతుల్లో వచ్చే దరఖాస్తుల్ని కంపెనీ స్వీకరించదు. డ్యూటీలో చేరినప్పటి నుంచి ఒక ఏడాది పాటు ప్రొబెషన్ పీరియడ్ ఉంటుంది. ప్రొబెషన్ పీరియడ్ సమయంలో ఆఫీసర్లు ఇన్స్యూరెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిర్వహించే నాన్ లైఫ్ లైసెన్షియేట్ ఎగ్జామినేషన్ పాస్ కావాలి. ఈ పరీక్ష పాస్ అయితేనే ఉద్యోగుల సేవల్ని కంపెనీ కొనసాగిస్తుంది. ప్రొబెషనర్స్‌గా చేరడానికి ముందే నాలుగేళ్లు కంపెనీలో పనిచేస్తామని అండర్‌టేకింగ్ ఇవ్వాల్సి ఉంటుంది.
NIACL Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే.
మొత్తం ఖాళీలు- 300
NIACL Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన తేదీలు
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2021 సెప్టెంబర్ 1
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ- 2021 సెప్టెంబర్ 21
- దరఖాస్తు ఫీజు చెల్లింపు- 2021 సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 21 వరకు
- ఫేజ్ 1 ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టీవ్)- 2021 అక్టోబర్
- ఫేజ్ 2 ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ (ఆబ్జెక్టీవ్+డిస్క్రిప్టీవ్)- 2021 నవంబర్
NIACL Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
విద్యార్హతలు- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి. కనీసం 60 శాతం మార్కులతో పాస్ కావాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులు 55 శాతం మార్కులతో పాస్ కావాలి. డిగ్రీ చివరి సంవత్సరం లేదా చివరి సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేయొచ్చు. ఇంటర్వ్యూ సమయానికి 2021 సెప్టెంబర్ 30 లోగా డిగ్రీ పూర్తి చేసినట్టు సర్టిఫికెట్ ప్రూఫ్ ఉండాలి.
వయస్సు- 2021 ఏప్రిల్ 1 నాటికి కనీసం 21 ఏళ్ల నుంచి 30 ఏళ్లు. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్‌కు 5 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు- రూ.750. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులకు రూ.100.
ఎంపిక విధానం- ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ.
వేతనం- రూ.32,795 బేసిక్ వేతనంతో మొత్తం రూ.62,315 వేతనం లభిస్తుంది.
పరీక్షా కేంద్రాలు- ఆంధ్రప్రదేశ్‌లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో, తెలంగాణలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్‌లో పరీక్షా కేంద్రాలు ఉంటాయి.
NIACL Recruitment 2021: అప్లై చయు విధానo
- అభ్యర్థులు ముందుగా https://www.newindia.co.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
- హోమ్ పేజీలో APPLY ONLINE పైన క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత Click here for New Registration పైన క్లిక్ చేయాలి.
- పేరు, కాంటాక్ట్ వివరాలు ఎంటర్ చేయాలి.
- ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్ జనరేట్ అవుతాయి.
- ఈ వివరాలు ఇమెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా వస్తాయి.
- రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి
- విద్యార్హతలు, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి.
- ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.
- ఫీజు చెల్లించి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.
- అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.
Website https://www.newindia.co.in/portal/readMore/Recruitment
0 Response to "NIACL Recruitment 2021"
Post a Comment