RRC Recruitment 2021: Registration for 3093 Apprentice posts to begin on Sept 20
Indian Railways: రైల్వేలో 3093 అప్రెంటిస్ జాబ్స్.. విద్యార్హతలు, ముఖ్యమైన తేదీల వివరాలు.
RRC 3093 Apprentice posts: నార్తర్న్ రైల్వే సంస్థల్లో ఖాళీగా ఉన్న అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 3093 పోస్టుల భర్తీ చేయనుంది.
ప్రధానాంశాలు:
- RRC అప్రెంటిస్ రిక్రూట్మెంట్
- నార్తర్న్ రైల్వే సంస్థలో 3093 పోస్టుల భర్తీ
- సెప్టెంబర్ 20 నుంచి దరఖాస్తులు ప్రారంభం
- అక్టోబర్ 20 దరఖాస్తులకు చివరితేది
నిరుద్యోగ యువతకు గుడ్న్యూస్. రైల్వే రిక్రూట్మెంట్ సెల్.. నార్తర్న్ రైల్వే సంస్థల్లో ఖాళీగా ఉన్న అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 3093 పోస్టుల భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు సంబంధించి సెప్టెంబర్ 20 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 20న ప్రారంభమయ్యే ఈ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 20 వరకు కొనసాగుతుంది.
అప్రెంటీస్ కాలపరిమితి, జీత భత్యాలు, ఎంపిక విధానం తదితర వివరాలను సెప్టెంబర్ 20న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ సమయంలో వెల్లడిస్తారు. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం రైల్వే రిక్రూట్మెంట్ సెల్ అధికారిక వెబ్సైట్ http://rrcnr.org/ ను సందర్శించవచ్చు.
మొత్తం పోస్టులు : 3093
అర్హతలు
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా 10+2 లేదా 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. తప్పనిసరిగా గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: అభ్యర్థుల వయసు 15 ఏళ్లు నుంచి 24 ఏళ్లు మధ్య ఉండాలి.
ముఖ్యమైన తేదీలు
- నోటిఫికేషన్ విడుదల తేదీ: సెప్టెంబర్ 14, 2021
- ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: సెప్టెంబర్ 20, 2021
- ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగింపు తేది: అక్టోబర్ 20, 2021
పూర్తి వివరాలకు వెబ్సైట్: http://rrcnr.org/
Ok
ReplyDeleteAny required vacancies contact me
ReplyDelete