Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Saving control .. It is difficult to commit

పొదుపే అదుపు.. కట్టుతప్పితే కష్టాలే

Saving control .. It is difficult to commit

క్రెడిట్‌ కార్డు వినియోగంలో జాగ్రత్త

క్రెడిట్‌ కార్డు జాగ్రత్తగా వాడితే ప్రయోజనకరమే. క్రమశిక్షణ లోపిస్తే, దీర్ఘకాలంలో ఆర్థిక కష్టాలపాలయ్యే ప్రమాదం ఉంటుంది. మీ కార్డు వినియోగం దారి తప్పుతోందనడానికివే సంకేతాలు.

కనీస చెల్లింపులతో సరి

తిరిగి చెల్లించగలిగే సామర్థ్యం మేరకే క్రెడిట్‌ కార్డును వినియోగించండి. మొత్తం బకాయిలో కనీస సొమ్మును చెల్లించి, మిగతాది తర్వాత చూసుకుందాం అనే ధోరణి సరికాదు. ఆలస్య రుసుము వడ్డింపు, క్రెడిట్‌ స్కోర్‌కు గండిపడకుండా కనీస చెల్లింపులు రక్షించగలవేమో కానీ, వడ్డీల భారం నుంచి కాదు. ఎందుకంటే, కనీస సొమ్ము చెల్లించగా మిగిలిన బకాయిలపై క్రెడిట్‌ కార్డు కంపెనీలు 23-52 శాతం వరకు వార్షిక వడ్డీ విధిస్తాయి. ఏదైనా నెలలో క్రెడిట్‌ కార్డు బకాయిని పూర్తిగా చెల్లించలేమనుకుంటే, కనీసం మొత్తం చెల్లించి మిగతాదాన్ని నెలవారీ కిస్తీ (ఈఎంఐ)ల కింద బదలాయించుకోండి. ఎందుకంటే, చెల్లించని బకాయిలపై విధించే వడ్డీ రేటుతో పోల్చితే ఈఎంఐల కన్వర్షన్‌కు వసూలు చేసే వడ్డీ చాలా తక్కువ. 

ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రా

మరే ప్రత్యామ్నాయం లేని పక్షంలో తప్ప క్రెడిట్‌ కార్డు ఉపయోగించి ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రా చేయవద్దు. ఎందుకంటే, తిరిగి చెల్లింపు పెనుభారమవుతుంది. ఏటీఎం నుంచి విత్‌డ్రా చేసిన మొత్తంపై క్రెడిట్‌ కార్డు కంపెనీలు 3.5 శాతం వరకు నగదు ఉపసంహరణ రుసుమును వసూలు చేస్తాయి. అలాగే, విత్‌డ్రా చేసిన తేదీ నుంచి తిరిగి చెల్లించే నాటి వరకు ఆ బకాయిపై 52 శాతం వరకు వార్షిక వడ్డీని వసూలు చేస్తున్నాయి. ఒకవేళ క్రెడిట్‌ కార్డుతో ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రా చేసినా, వీలైనంత త్వరగా తిరిగి చెల్లించడం ఉత్తమం. 

30 శాతానికి పైగా సీయూఆర్‌

కార్డు మొత్తం క్రెడిట్‌ లిమిట్‌లో వినియోగించుకున్న వాటాను ‘క్రెడిట్‌ యుటిలైజేషన్‌ రేషియో’ (సీయూఆర్‌) అంటారు. ప్రతినెలా సీయూఆర్‌ 30 శాతానికి మించడం మిమల్ని రిస్క్‌లోకి నెడుతుంది. క్రెడిట్‌ స్కోర్‌పైనా ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇలాంటి సందర్భంలో మీరు క్రెడిట్‌ లిమిట్‌ పెంచమని బ్యాంక్‌ను కోరవచ్చు లేదా యాడ్‌ ఆన్‌ కార్డు తీసుకోవచ్చు. 

క్రెడిట్‌ లిమిట్‌ పెంపు ఆఫర్‌ తిరస్కరణ

వినియోగం ఆధారంగా బ్యాంక్‌లు కస్టమర్లకు క్రెడిట్‌ లిమిట్‌ పెంపును ఆఫర్‌ చేస్తాయి. పరిమితి పెరిగితే, వ్యయం పెరుగుతుందన్న భయంతో కొంత మంది ఆఫర్‌ను తిరస్కరిస్తుంటారు. కానీ, ఇలాంటి ఆఫర్‌ను తప్పక వినియోగించుకోవాలి. ఎందుకంటే, తద్వారా ఆర్థిక సామర్థ్యం మెరుగుపడుతుంది. పరిమితి పెంపు ఆర్థిక అత్యవసరాలు లేదా పండగ సీజన్‌ వంటి ముఖ్యమైన సందర్భాల్లో ఉపయోగపడుతుంది. అంతేకాదు, మీ సీయూఆర్‌ కూడా తగ్గుతుంది. తత్ఫలితంగా మీ క్రెడిట్‌ స్కోర్‌ మెరుగుపడటంతోపాటు భవిష్యత్‌లో రుణం లేదా మరో క్రెడిట్‌ కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికీ దోహదపడుతుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Saving control .. It is difficult to commit"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0