Side Effects of salt
Side Effects of salt : కూరలో ఉప్పు ఎక్కువగా ఉంటే వచ్చే రోగాల గురించి తెలుసుకుందాం.
ఉప్పు (Salt). అది లేనిదే కూరల్లో రుచి తెలియదు. నిజమే కానీ, ఉప్పు తగినంత వేసుకుంటే బాగుంటుంది. అయితే చాలామంది కూరలో ఉప్పు తగ్గిందని కూరల్లో. పెరుగులో ఉప్పు లేదని.
చారులో ఉప్పు లేదని వేస్తూనే ఉంటారు. అయితే ఈ పద్దతే మీకు అనారోగ్యాలను తెచ్చిపెడుతుందట. మనం రోజూ తినే ఆహారం (food)లో ఉప్పు ఎక్కువైతే విపరీతైనమైన అనారోగ్య సమస్యలు వస్తాయంట. గుండె సంబంధిత వ్యాధులు (heart diseases) మొదలుకుని, మూత్రపిండాల (kidneys) వరకు దీని ప్రభావం చూపిస్తుందట. మనం ఎక్కువ ఉప్పు తింటే అంటే 10గ్రా కంటే ఎక్కువ తింటే మూత్రపిండాలు ఆ ఉప్పుని బయటకు పంపలేవు. అప్పుడు ఆ ఉప్పు రక్తం లో ఉండిపోతుంది దానివలన రక్తం (blood) గాఢత పెరుగుతుంది . పెరిగిన గాఢత తగ్గటానికి రక్తంలో నీరు (water) చేరుతుంది. నీరు చేరిన రక్తం ఎక్కువయ్యి గుండెకి చేరుతుంది. ఆ తర్వాత సమస్యలు (Side Effects of salt) మొదలవుతాయట. ఇంతకీ ఎలాంటి ప్రమాదం పొంచి ఉందో ఒకసారి తెలుసుకుందాం..
ఐదు గ్రాములు మించకూడదు..
ఉప్పు రోజుకి ఐదు గ్రాములకి మించి తినకూడదు. పది గ్రాములు మనం సాధారణంగా తింటాం. లవణ ప్రియులు ఇరవై గ్రాముల వరకు తింటారు. ఎక్కవు ఉప్పు తినడం వల్ల కొద్దిరోజుల తర్వాత మనం ఏమాత్రం గుండె మీద భారం వేసినా, అంటే పరిగెత్తినా, కడుపునిండా తిన్నా చివరికి శృంగారంలో పాల్గొన్నా గుండెకి రక్తం సరిపోక ఛాతీలో నొప్పి వస్తుంది. ఇంకాస్త ఎక్కువైతే గుండెపోటు (Heart Attack) వస్తుంది.
మెదడు (Brain)లో రక్త నాళాలు చాలా చిన్నవి, సున్నితమైనవి. అధికంగా ఉప్పు తినడం వల్ల రక్తనాళాలు కొన్ని సార్లు ఒత్తిడికి మూసుకుపోయి ఆ రక్తనాళం వెళ్లే మెదడు కణజాలం రక్తం అందక చనిపోతుంది. అయితే అలా చనిపోయేవి చుక్కంత ఉంటాయి. కానీ ఒక పది ఇరవై ఏళ్లలో ఈ చుక్కలన్నీ కలిసి మెదడు పనితీరు బాగా దెబ్బతీసి మతిమరుపు, డెమెన్షియా మొదలైన ఇబ్బందులు వస్తాయి. ఇవి కాక ఒకేసారి రక్త పీడనం పెరిగి మెదడులో రక్తనాళం పగిలి అక్కడ రక్త స్రావం అయ్యి పక్షవాతం రావచ్చు, లేదా మెదడులో ఒకేసారి ఒత్తిడి (pressure) పెరిగి ఊపిరి ఆగొచ్చు.
ఈలోగా మూత్రపిండాలు (kidneys) కూడా బాగా పని చేసి చేసి అలసిపోయి ఇక పనిచేయటం మానేస్తాయి. దాంతో రక్తం లో నీరు ఒంట్లో కి చేరి ఒళ్ళు ఉబ్బుతుంది. అలాగే యూరియా, క్రియాటినిన్ లు పెరిగి ఆయాసం వస్తుంది. ఊపిరితిత్తులు ఊది ఊది అలసిపోయి ఇక ఊపిరి తీయటం మానేస్తాయి. కాబట్టి ఉప్పు అతిగా తింటే అనారోగ్యాలు బోలెడు.
Useful information
ReplyDeleteA detailed brief summary
Wonderfully expressed short essays
Good keep it up