What are True-Up Charges? Why pay for it?
ఈ నెల కరెంటు బిల్లు కరెంట్ కంటే గట్టిగా షాక్ ఇస్తున్నాయి. ప్రతీ వినియోగ దారుని బిల్లులో.
ట్రూ అప్ చార్జెస్ అని గతంలో వాడిన విద్యుత్ కు మనం చెల్లించిన బిల్లుకు ఇపుడు అదనంగా వడ్డింపులు ట్రూ అప్ చార్జెస్ పేరున వడ్డిస్తున్నారు.
True-Up ఛార్జీలు అంటే ఏమిటి ? ఇది ఎందుకు చెల్లించాలి ?
విద్యుత్ సరఫరా చేసే సంస్థలు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆమోదించిన రెవెన్యూ వ్యయం కన్న అధికంగా చేసిన వ్యయాన్ని వినియోగ దారులు నుంచి వసూలు చేసుకోవటం True-Up charges అంటారు..
అత్యంత దారుణంగా విద్యుత్ సంస్థలు సుమారు 19000 కోట్లు True-Up ఛార్జీలు వసూలు చేసుకునేందుకు ప్రతిపాదనలు పంపగా రెగ్యులేటరీ కమిషన్ 3100 కోట్లు కి అనుమతి ఇచ్చింది..
కాబట్టి ఈ నెల నుంచి True-up అనే అధి కారిక బాదుడు మన జీవితంలో భాగం కానున్నది.
ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ 2014-15 నుంచి 2018-19 కాలవ్యవధికి సంబంధించిన పంపిణీ వ్యాపారమునకు 19000 కోట్లు ట్రూ ఆప్ చార్జీల ప్రతిపాదనలను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ముందు 15-06-2020 న దాఖలు చేయగా రెగ్యులేటరీ కమిషన్ 3100 కోట్లు కి అనుమతి ఇచ్చింది..
ఎ.పి.ఇ.ఆర్.సి. వారు
ఆమోదించిన ట్రూ అప్ చార్జీలను ఆర్థిక సంవత్సరం 2021-22లోని మిగిలిన 8 నెలల కాల వ్యవవధిలో వినియోగదారుల నుండి వసూలు చేయుటకై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ సంస్థ వారు అనుమతించారు.
ఈ ట్రూ అప్ మొత్తాలను కేంద్ర విద్యుత్ పంపిణీ సంస్థ ఏ.పి.సి.పి.డి.సి.ఎల్., విజయవాడ వారి వినియోగదారుల నుంచి కూడా వసూలు చేస్తారు.
01-04-2019 నుంచి నూతనముగా సరఫరా అందించబడిన వినియోగదారులకు ఈ ట్రూ అప్ చార్జీల నుంచి మినహాయింపు కల్పించడమైనది.
ఈ ట్రూ అఫ్ చార్జీలను ఆర్థిక సంవత్సరం 2021-22లో ఆమోదించిన అమ్మకాలపై విధించి ప్రతి యూనిట్కూ వసూలు చేయవలసిన ట్రూ అఫ్ చార్జీలను గణించి ఏకరీతిన అన్ని కేటగిరీల వినియోగదారుల నుండి ఈ ఆగష్టు నెల వినియోగము సెప్టెంబరు నెల బిల్లు నుండి మార్చి 2022 నెల వినియోగము ఏప్రిల్ 2022 నెల బిల్లు వరకు వసూలు చేయుదురు.
ఇప్పటికే విద్యుత్ వినియోగపు బిల్లులలో శ్లాబ్ లను బట్టి అధిక రేట్లు వినియోగదారులనుండి వసూలుకు ఉత్తర్వులు ఇచ్చిఉన్నారు. దీనికి అదనంగా ట్రూఅప్ చార్జీలమోత వెరశి విద్యుత్ వినియోగదారుల పై మోపబడింది. సామాన్యులు , మధ్యతరగతి వారికి ఇది పెద్ద గుదిబండ గాబోతుంది. ట్రూఅప్ చార్జీలను రద్దు చేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
0 Response to "What are True-Up Charges? Why pay for it?"
Post a Comment