Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Aadhaar card

Aadhaar card: మీ ఆధార్‌ నంబర్‌ అందరికీ కనిపించకుండా!

Aadhaar card

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆధార్‌.. ప్రతి భారతీయుడూ ప్రతి సందర్భంలోనూ వెంట ఉంచుకోవాల్సిన ధ్రువపత్రంలా మారిపోయింది. బ్యాంక్‌ ఖాతా తెరవాలన్నా.. కొత్త సిమ్‌ తీసుకోవాలన్నా.. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు పొందాలన్నా ఈ 12 అంకెల గుర్తింపు కార్డు తప్పనిసరి. అయితే, ఆధార్‌ దుర్వినియోగం గురించీ భయాందోళనలు ఉన్నాయి.ఒకవేళ మీ ఆధార్‌ నంబర్‌ దుర్వినియోగం అవుతుందని మీరు భావిస్తే మాస్క్‌డ్‌ ఆధార్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడం ఉత్తమం.

12 అంకెల బదులు చివరి 4 అంకెలు మాత్రమే కనిపించే ఉండే ఆధార్‌ పత్రమే ఈ మాస్క్‌డ్‌ ఆధార్‌. దీనిపై మీ ఫొటో, క్యూఆర్‌ కోడ్‌, మీ చిరునామా ఇతర వివరాలు యథావిధిగా ఉంటాయి. ఎవరికైనా ఓ గుర్తింపు పత్రంలా ఆధార్‌ ఇవ్వాలనుకుంటే ఈ మాస్క్‌డ్‌ ఆధార్‌ ఉపయోగపడుతుంది. ఆధార్‌ నంబర్‌ పూర్తిగా అవసరం లేని చోట, ఇ-కేవైసీకి దీన్ని వినియోగించొచ్చు. ఆధార్‌ నంబర్‌ పూర్తిగా అవసరం ఉన్న చోట మాత్రం ఇది ఉపయోగపడదనేది గుర్తుంచుకోవాలి. మీకూ మాస్క్‌డ్‌ ఆధార్‌ కావాలంటే ఈ దిగువ ఇచ్చిన సింపుల్‌ స్టెప్స్‌ ఫాలో అయ్యి డౌన్‌లోడ్‌ చేసుకోండి.

డౌన్‌లోడ్‌ ఇలా.

  • UIDAI అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి ‘డౌన్‌లోడ్‌ ఆధార్‌’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
  • ఆధార్‌ నంబర్‌/ఎన్‌రోల్‌మెంట్‌ ఐడీ/ వర్చువల్‌ ఐడీ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి.
  • ఆధార్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేముందు అక్కడ ఉన్న ‘మాస్క్‌డ్‌ ఆధార్‌’ టిక్‌బాక్స్‌ను ఓకే చేయాలి. తర్వాత క్యాప్చా కోడ్‌ ఎంటర్‌ చేయాలి.
  •  ఆ తర్వాత సెండ్‌ ఓటీపీ బటన్‌పై క్లిక్‌ చేస్తే ఆధార్‌తో జత చేసిన మొబైల్‌ నంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్‌ చేయాలి. తర్వాత డౌన్‌లోడ్‌ క్లిక్‌ చేయాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Aadhaar card"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0