Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

APPSC Recruitment 2021

 APPSC Recruitment 2021 : బీటెక్ పాస్ అయినవారికి అలర్ట్ ... ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు.

APPSC Recruitment 2021

బీటెక్ లేదా బ్యాచిలర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ కోర్సు పాస్ అయినవారికి అలర్ట్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సర్వీస్‌లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది.

ఈ జాబ్ నోటిఫికేషన్‌ను (Job Notification) కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) విడుదల చేసింది. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ సర్వీస్‌లో అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల్ని ప్రకటించింది. మొత్తం 6 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు ప్రస్తుతం దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. అప్లై చేయడానికి 2021 నవంబర్ 12 చివరి తేదీ. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హత వివరాలు తెలుసుకోవాలి.

వీటితో పాటు 4 డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పోస్టులకు, 151 మెడికల్ ఆఫీసర్ పోస్టులకు, 39 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులకు, 5 తెలుగు రిపోర్టర్ పోస్టులకు, 35 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా 6 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభమైంది. మరి ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.

APPSC Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే.

భర్తీ చేసే పోస్టుఅసిస్టెంట్ డైరెక్టర్
ఖాళీల వివరాలు 06
దరఖాస్తు ప్రారంభం22.10.2021
దరఖాస్తుకు చివరి తేదీ12.11.2021

APPSC Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

విద్యార్హతలు- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ (సివిల్), బ్యాచిలర్స్ ఆఫ్ టెక్నాలజీ (సివిల్) పాస్ కావాలి.

వయస్సు- 2021 జూలై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 42 ఏళ్లు ఉండాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు- రూ.250 అప్లికేషన్ ఫీజు, రూ.120 ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ అభ్యర్థులు, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్‌ రూ.120 ఎగ్జామినేషన్ ఫీజు చెల్లిస్తే చాలు.
ఎంపిక విధానం- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్.
వేతనం- రూ.37,100 బేసిక్ వేతనంతో మొత్తం రూ.91,450 వేతనం లభిస్తుంది.

APPSC Recruitment 2021: అప్లై చేయు విధానం.

  • Step 1- అభ్యర్థులు ముందుగా https://psc.ap.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
  • Step 2- హోమ్ పేజీలో One Time Profile Registration పైన క్లిక్ చేయాలి.
  • Step 3- ఆ తర్వాత New Registration పైన క్లిక్ చేయాలి.
  • Step 4- అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతల వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
  • Step 5- యూజర్ ఐడీ జనరేట్ అవుతుంది.
  • Step 6- ఆ తర్వాత లాగిన్ అయి పాస్‌వర్డ్ సెట్ చేసుకోవాలి.
  • Step 7- ఆ తర్వాత https://psc.ap.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి వన్‌టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ నెంబర్‌తో లాగిన్ కావాలి.
  • Step 8- Online Application Submission పైన క్లిక్ చేయాలి.
  • Step 9- యూజర్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ చేయాలి.
  • Step 10- పోస్టు పేరు సెలెక్ట్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.
  • Step 11- అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని భద్రపర్చుకోవాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "APPSC Recruitment 2021 "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0