Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Buying a house? You can also find out about these costs.

 ఇల్లు కొంటున్నారా? ఈ ఖ‌ర్చుల గురించి కూడా తెలుసుకోగలరు.

Buying a house?  You can also find out about these costs.


సొంత ఇల్లు అనేది ప్ర‌తీ ఒక్క‌రి క‌ల‌. చాలామందికి జీవిత ల‌క్ష్యం. సొంత ఇల్లు ఉంటే భ‌ద్ర‌తగా, సుర‌క్షితంగా ఉన్న అనుభూతిని పొందుతారు.  అప్ప‌టి వ‌ర‌కు అద్దె ఇంటిలో ఉండి క‌ష్ట‌ప‌డి సంపాదించిన డ‌బ్బుతో ఇల్లు కొనుగోలు చేస్తే ఉండే తృప్తి వేరుగా ఉంటుంది. స్వేచ్ఛ‌గా జీవిస్తున్న ఫీలింగ్ క‌లుగుతుంది. అయితే ఇంటి కొనుగోలు అంత సుల‌భం కాదు.  ఒక వ్య‌క్తి జీవితంలో చేసే అతి పెద్ద పెట్టుబ‌డుల‌లో ఇదీ ఒక‌టి. స‌రైన ప్ర‌ణాళిక లేకుండా సొంతింటి క‌ల‌ను సాకారం చేసుకోవ‌డం క‌ష్ట‌మ‌వుతుంది. 

ఒక ప్ర‌ణాళిక ప్ర‌కారం బ‌డ్జెట్ వేసుకున్న‌ప్ప‌టికీ.. కొనుగోలు ప్రాసెస్ మొత్తం పూర్తయ్యే సరికి అనుకున్న దానికంటే ఎక్కువ మొత్తం ఖ‌ర్చువుతుంది. దీని వల్ల అప్పులు చేస్తుంటారు. అలా జరగ‌కుండా ఉండాలంటే.. ఇంటి కొనుగోలుకు సంబంధించి వాస్త‌వ ఖ‌ర్చుల‌ను ముందుగా తెలుసుకోవాలి. ఇంటి కోసం బిల్డ‌ర్ లేదా విక్రేతని సంప్ర‌దించిన‌ప్పుడు.. వారు చెప్పిన అంచ‌నా వ్యాయానికి వాస్త‌వ వ్య‌యానికి మ‌ధ్య వ్య‌త్యాసం ఉంటుంది. దీనికి కార‌ణం అద‌న‌పు ఖ‌ర్చులు. వీటి క‌ల‌యిక‌తో అప్ప‌టి వ‌ర‌కు ఉన్న ఆర్థిక ప్ర‌ణాళిక దారి త‌ప్పుతుంది. 

ఇల్లు కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్న‌వారు అద‌న‌పు ఖ‌ర్చుల గురించి కూడా తెలుసుకుంటే.. స‌రైన ఆర్ధిక ప్ర‌ణాళిక‌ను సిద్ధంచేసుకుని ముందుకు వెళ్లేందుకు అవ‌కాశం ఉంటుంది. దీనివ‌ల్ల చివ‌రి నిమిషంలో ఇబ్బందులు ప‌డ‌కుండా నివారించ‌వ‌చ్చు.  

ఇంటి కొనుగోలు చేసిన‌ప్పుడు ఉండే 5 ప్ర‌ధాన‌ అద‌న‌పు ఖ‌ర్చుల‌ను ఇప్పుడు తెలుసుకుందాం..

1. స్టాంప్ డ్యూటి..

ఆస్తి లావాదేవీల‌పై ప్ర‌భుత్వం విధించే త‌ప్ప‌నిస‌రి ప‌న్ను స్టాంప్ డ్యూటి. ఇది అమ్మ‌క‌పు ఒప్పందాన్ని ధృవీక‌రిస్తుంది. ఆస్తి అమ్మ‌కం లేదా కొనుగోలుకు సాక్ష్యంగా ప‌నిచేస్తుంది. ఇల్లు ఉన్న రాష్ట్రం, ఇంటివిలువ త‌దిత‌ర అంశాల‌పై ఆధార‌ప‌డి ఆస్తి విలువ‌లో 4 నుంచి 7 శాతం మ‌ధ్య స్టాంప్ డ్యూటి ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు, మీరు కొనుగోలు చేస్తున్న ఇంటి విలువ రూ. 50 ల‌క్ష‌లు ఉంటే, స్టాంప్ డ్యూటీ రూ.2 ల‌క్ష‌ల నుంచి రూ.3.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటుంది. ఇది ఇంటి కొనుగోలుకు అయ్యే ఖ‌ర్చును పెంచుతుంది. 

గుర్తించుకోండి.. స్టాంప్ డ్యూటిని రాష్ట్ర ప్ర‌భుత్వాలు నిర్ణ‌యిస్తాయి. అలాగే ఆస్తి ఉన్న ప్ర‌దేశం బ‌ట్టి కూడా స్టాంప్ డ్యూటి మారుతుంది. అంటే ఆస్తి గ్రామీణ ప్రాంతంలో ఉంటే స్టాంప్ డ్యూటి కొంత త‌క్కువ ఉండ‌చ్చు. అదే ప‌ట్ట‌ణ ప్రాంతాల‌లో ఉంటే పెర‌గొచ్చు. కొన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు మ‌హిళ‌ల పేరుపై, అఫ‌ర్డ్‌బుల్ ఇళ్లు కొనుగోలు చేసిన వారికి స్టాంప్ డ్యూటిపై 1శాతం రాయితీని అందిస్తున్నాయి. అందువ‌ల్ల ఒక రాష్ట్రంలో అంత‌ర్గంగా వ‌ర్తించే స్టాంప్ డ్యూటిపై కూడా గ‌ణ‌నీయ‌మైన వ్య‌త్యాసం ఉండ‌చ్చు. 

2. రిజిస్ట్రేష‌న్ ఛార్జీలు..

కొనుగోలు స‌మ‌యంలో ప్ర‌భుత్వం విధించే మ‌రో త‌ప్ప‌నిస‌రి ఖ‌ర్చు రిజిస్ట్రేష‌న్ ఛార్జీలు. కొనుగోలుదారుని పేరుపై ఆస్తిని న‌మోదు చేయ‌డం, ఆస్తి యాజ‌మాన్య రికార్డుల‌ను అప్‌డేట్ చేసేందుకు రిజిస్ట్రేష‌న్ ఛార్జీలు విధిస్తారు. ఈ ఛార్జీలు ఇంటి విలువ‌లో 1శాతం ఉంటాయి. అంటే రూ. 50 ల‌క్ష‌ల విలువైన ఇంటిని కొనుగోలు చేస్తే రూ.50వేల రిజిస్ట్రేష‌న్ ఛార్జీల‌కు చెల్లించాలి. ఇవి స్టాంప్‌డ్యూటికి అద‌నం. 

3. వ‌స్తుసేవ‌ల ప‌న్ను(జీఎస్‌టీ)..

నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేస్తే జీఎస్‌టీ వ‌ర్తిస్తుంది. నిర్మాణంలో అఫ‌ర్డ్‌బుల్ ఇళ్ల‌కు ఆస్తివిలువ‌లో 1శాతం.. మిగిలిన వాటికి 5శాతం జీఎస్‌టీ వ‌ర్తిస్తుంది. ఇక్క‌డ అఫ‌ర్డ్‌బుల్ హౌస్ అంటే.. ఇంటి విలువ రూ.45 ల‌క్ష‌ల లోపు ఉండి.. మెట్రో న‌గ‌రాల‌లో అయితే 60 చ‌ద‌ర‌పు మీట‌ర్లు, ఇత‌ర ప్ర‌దేశాల‌లో అయితే 90 చ‌ద‌ర‌పు మీట‌ర్ల కంటే త‌క్కువ విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం ఉండాలి. 

ఉదాహ‌ర‌ణ‌కి, నిర్మాణంలో ఉన్న అఫర్డ్‌బుల్ హౌస్ విలువ రూ.40 ల‌క్ష‌లు ఉంటే రూ.40వేలు జీఎస్‌టీ చెల్లించాలి. ఒక‌వేళ నిర్మాణంలో ఉన్న ఇంటి విలువ రూ.50 ల‌క్ష‌ల ఉంటే రూ. 2.5 ల‌క్ష‌ల వ‌ర‌కు జీఎస్‌టీ వ‌ర్తిస్తుంది. పూర్తైన ఇల్లు అంటే నివ‌సించేంద‌కు సిద్ధంగా ఉన్న ఇల్లు లేదా రీసేల్ చేసే పాత ఇళ్ల‌పై జీఎస్‌టీ వ‌ర్తించ‌దు. 

4. ముందస్తు నిర్వ‌హ‌ణ ఛార్జీలు..

ఆస్తి నిర్వహణ ఛార్జీలు ఇంటి ఖర్చును గణనీయంగా ప్రభావితం చేస్తాయి. బిల్డర్‌లు వీటిని ఒకటి లేదా రెండు సంవత్సరాలు ముందుగానే తీసుకోవ‌చ్చు, ఆస్తి, అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ పరిమాణం, స్థానాన్ని బట్టి ఈ మొత్తం లక్షల్లో ఉంటుంది. సాధారణంగా, నిర్వహణ ఛార్జీలలో భవనం భద్రత, లిఫ్ట్ ఛార్జీలు, ఆస్తి నిర్వహణ ఖ‌ర్చులు, నీరు, విద్యుత్ ఛార్జీలు ఉంటాయి.

5. పార్కింగ్ ఛార్జీలు..

చాలా మంది గృహ కొనుగోలు దారులు ఇళ్లు కొనుగోలు చేస్తారు కానీ వాహ‌నల పార్కింగ్ ఛార్జీలు గురించి ఆలోచించ‌రు. సొంత ఇల్లు కాబ‌ట్టి పార్కింగ్ ఛార్జీలు చెల్లించాల్సి అవ‌స‌రం ల

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Buying a house? You can also find out about these costs."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0