Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

IBPS Clerk Recruitment 2021

 IBPS Clerk Recruitment 2021 ప్రభుత్వ బ్యాంకుల్లో 7855 క్లర్క్ ఉద్యోగాల భర్తీ... డిగ్రీ పాస్ అయితే చాలు

IBPS Clerk Recruitment 2021

IBPS Clerk Notification 2021  దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బ్యాంకుల్లో 7855 క్లర్క్ పోస్టుల (Bank Clerk Jobs) భర్తీకి ఐబీపీఎస్ మరోసారి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఖాళీల వివరాలు తెలుసుకోగలరు.

బ్యాంకింగ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నవారికి గుడ్ న్యూస్. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (IBPS) మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల్ని (Bank Clerk Jobs) భర్తీ చేస్తోంది. మొత్తం 7855 ఖాళీలు ఉన్నాయి. వాస్తవానికి కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ క్లర్క్ 11 జాబ్ నోటిఫికేషన్ జూలైలోనే రిలీజ్ అయింది. అప్పుడు 5,830 క్లర్క్ పోస్టుల్ని ప్రకటించింది ఐబీపీఎస్. అయితే క్లర్క్ ఎగ్జామ్‌ను ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలన్న డిమాండ్ వినిపించింది. దీంతో ఆర్థిక శాఖ ఆదేశాలతో ఈ నోటిఫికేషన్ దరఖాస్తు ప్రక్రియను నిలిపివేసింది ఐబీపీఎస్. ప్రాంతీయ భాషల్లో కూడా ఐబీపీఎస్ క్లర్క్ పరీక్షల్ని నిర్వహించేందుకు ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడంతో నోటిఫికేషన్ సవరించి మరోసారి రిలీజ్ చేసింది ఐబీపీఎస్.

ఐబీపీఎస్ లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన క్లర్క్ నోటిఫికేషన్‌లో పోస్టుల సంఖ్య పెరిగింది. మొదట రిలీజ్ చేసిన నోటిఫికేషన్‌లో 5,830 క్లర్క్ పోస్టుల్ని ప్రకటిస్తే, తాజా నోటిఫికేషన్ ద్వారా 7855 పోస్టుల్ని భర్తీ చేస్తున్నట్టు ఐబీపీఎస్ ప్రకటించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులైన బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనెరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మొత్తం 7855 క్లర్క్ పోస్టులున్నాయి.

ఐబీపీఎస్ క్లర్క్ పరీక్షలకు దరఖాస్తు ప్రక్రియ 2021 అక్టోబర్ 7న ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 అక్టోబర్ 27 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు జూలై 12 నుంచి 14 మధ్య దరఖాస్తు చేసిన అభ్యర్థులు మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఖాళీల వివరాలు, విద్యార్హతలతో పాటు సవరించిన నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకోండి.

మొత్తం ఖాళీలు 7855

IBPS Clerk Recruitment 2021: రాష్ట్రాలవారీగా ఖాళీల వివరాలు .

మొత్తం ఖాళీలు 7855
 తెలంగాణ 333
ఆంధ్రప్రదేశ్ 387
 అండమాన్ & నికోబార్ 05
 అరుణాచల్ ప్రదేశ్ 13
 అస్సాం 191
 బీహార్ 300
 చండీగఢ్ 33
 ఛత్తీస్‌గఢ్ 111
 దాద్రా నగర్ హవేలి అండ్ డయ్యూ డామన్ 03
 న్యూ ఢిల్లీ318
 గోవా 59
 గుజరాత్395
 హర్యానా 133
 హిమాచల్ ప్రదేశ్ 113
 జమ్మూ అండ్ కాశ్మీర్ 26
 జార్ఖండ్ 111
 కర్ణాటక 454
 కేరళ194
 లక్షద్వీప్ 05
 మధ్యప్రదేశ్ 389
మహారాష్ట్ర 882
 మణిపూర్ 06
మేఘాలయ 09
 మిజోరం 04
 నాగాలాండ్ 13
 ఒడిశా 302
 పుదుచ్చేరి 30
 పంజాబ్ 402
 రాజస్తాన్ 142
 సిక్కిం 28
 తమిళనాడు 842
 త్రిపుర 8
 ఉత్తరప్రదేశ్ 1039
 ఉత్తరాఖండ్ 58
 పశ్చిమ బెంగాల్ 516

IBPS Clerk Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన తేదీలు

 నోటిఫికేషన్ విడుదల 2021 అక్టోబర్ 7
 దరఖాస్తు ప్రారంభం 07.10.2021
దరఖాస్తుకు చివరి తేదీ 27.10.2021
 దరఖాస్తులు ఎడిట్ చేయడానికి చివరి తేదీ 27.10.2021
 ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ కాల్ లెటర్స్ డౌన్‌లోడ్ 2021 నవంబర్
 ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ 2021 నవంబర్
 ప్రిలిమినరీ ఆన్‌లైన్ ఎగ్జామ్ కాల్ లెటర్స్ డౌన్‌లోడ్ 2021 నవంబర్ లేదా డిసెంబర్
 ప్రిలిమినరీ ఆన్‌లైన్ ఎగ్జామ్ 2021 డిసెంబర్
 ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫలితాల విడుదల 2021 డిసెంబర్ లేదా 2022 జనవరి
 మెయిన్ ఆన్‌లైన్ ఎగ్జామ్ కాల్ లెటర్స్ డౌన్‌లోడ్2021 డిసెంబర్ లేదా 2022 జనవరి
 మెయిన్ ఆన్‌లైన్ ఎగ్జామ్ 2022 జనవరి లేదా ఫిబ్రవరి
 ప్రొవిజినల్ అలాట్‌మెంట్ 2022 ఏప్రిల్
IBPS Clerk Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

విద్యార్హతలు- అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ కావాలి.

ఇతర అర్హతలు- కంప్యూటర్ సిస్టమ్స్ ఆపరేట్ చేసే నైపుణ్యం ఉండాలి. కంప్యూటర్ ఆపరేషన్స్ లేదా లాంగ్వేజ్‌లో సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ ఉండాలి.

భాష- అభ్యర్థులకు సంబంధిత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన అధికార భాషలో నైపుణ్యం ఉండాలి. అంటే ఆ భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం తెలిసి ఉండాలి.

మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్- ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తెలంగాణ అభ్యర్థులకు ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ.

వయస్సు- 2021 జూలై 1 నాటికి 20 నుంచి 28 ఏళ్లు. అభ్యర్థులు 1993 జూలై 2 నుంచి 2001 జూలై 1 మధ్య జన్మించినవారై ఉండాలి.

దరఖాస్తు ఫీజు- రూ.850. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌కు రూ.175.

ఎగ్జామ్ సెంటర్- ఆంధ్రప్రదేశ్‌లో చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. తెలంగాణలో హైదరాబాద్,కరీంనగర్, ఖమ్మం, వరంగల్.

For Notification CLICK HERE
For Notification CLICK HERE

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "IBPS Clerk Recruitment 2021"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0