Download Aadhaar card without registered phone number
రిజిస్టర్డ్ ఫోన్ నంబరు లేకున్నా ఆధార్ కార్డు డౌన్‌లోడ్ చేసుకొనే విధానం.
ప్రతిదానికీ ఇప్పుడు ఆధార్ కార్డు అవసరమవుతోంది. సులభమైన గుర్తింపు కార్డుగా ఎన్నో పనులకు ఉపయోగపడుతోంది. కొన్నిసార్లు ఇది డాక్యుమెంట్ రూపంలోనూ అవసరపడొచ్చు. ఫోన్ నంబరు రిజిస్టర్ కాకపోతే ఆన్‌లైన్‌లో దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవటం కష్టం. మరెలా? ఇందుకు తేలికైన మార్గం లేకపోలేదు. తెలిసినవారి ఫోన్ నంబరు ద్వారా ఆధార్‌కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
విధానం
- ముందుగా యూఐడీఏఐ అధికార వెబ్‌సైట్‌ను తెరచి, ‘మై ఆధార్’ విభాగంలోకి వెళ్లాలి.
- ‘ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డు’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- తర్వాత 12 అంకెల ఆధార్ సంఖ్యను టైప్ చేయాలి. కావాలనుకుంటే దీనికి బదులు 16 అంకెల వర్చువల్ ఐడెంటిఫికేషన్ నంబరునూ ఉపయోగించుకోవచ్చు.
- సెక్యూరిటీ కోడ్‌ను ఎంటర్ చేసి, ‘మై మొబైల్ నంబర్ నాట్ రిజిస్టర్’ ఆప్షన్‌ను క్లిక్ చేయాలి.
- ప్రత్యామ్నాయ ఫోన్ నంబరును ఎంటర్ చేసి, సెండ్ ఓటీపీ బటన్‌ను నొక్కాలి. దీంతో అప్పుడు ఎంటర్ చేసిన ఫోన్‌కు ఓటీపీ వస్తుంది.
- అనంతరం ఫోన్‌కు అందిన ఓటీపీని టైప్ చేయాలి.
- ‘టర్మ్ అండ్ కండిషన్స్’కు అంగీకారం తెలిపి, ‘సబ్మిట్’ బటన్‌ను నొక్కాలి. అప్పుడు ఆధార్ లెటర్ ప్రివ్యూ కనిపిస్తుంది. భద్రత దృష్ట్యా కొన్నిసార్లు ప్రివ్యూ కనిపించకపోవచ్చు.
- తర్వాత ‘మేక్ పేమెంట్’ ఆప్షన్ ద్వారా రుసుము చెల్లించి, ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రింట్ తీసుకోవచ్చు.
0 Response to "Download Aadhaar card without registered phone number"
Post a Comment