How to Prepare Promotion Seniority Lists
How to Prepare Promotion Seniority Lists:పదోన్నతుల జాబితా ఎలా తయారు చేస్తారు ?
Roaster Points in Promotions
Communal Roaster Points & Seniority in Promotions
ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 5 (ఐ.ఇ.) తేది 14-2-2003 ప్రకారము పదోన్నతుల పోస్టుల యందు కూడ ప్రభుత్వములోని అన్ని శాఖలలోని, అన్ని కేటగిరి పోస్టులలో 15% ఎస్సిలకు, 6% ఎస్టిలకు రిజర్వేషన్ కల్పించబడినది. ఆ ఉత్తర్వును అమలు చేయుటకు మార్గదర్శక సూత్రాలు *GO.Ms.No. 21 Dt. 1 8.03.2003* ద్వారా విడుదలయినవి.
అదే విధముగ 3% వికలాంగులకు కూడ రిజర్వు చేయబడినవి. (GO.Ms.No.42 Dt. 19.10.2011) అంధ ఉద్యోగులకు పదోన్నతులకు అవసరమైన డిపార్ట్మెంట్ పరీక్షల నుండి 5 సంవత్సరములు మినహయింపు కలదు. (G0.Ms.No.748 GAD Dt: 29.12.2008).
పదోన్నతులలో SC,ST & PHC కేటగిరీ లో అర్హులు దొరకనట్లయితే సంభందిత రోస్టర్ పాయింట్లు 2 సంవత్సరముల వరకు బ్యాక్ లాగ్ ఉంచాలి. రెండవ సంవత్సరం కూడా భర్తీ కానట్లయితే ఆ పోస్టులకు డీ - రిజర్వు చేసి తదుపరి సంవత్సరం మరల యధావిధంగా బ్యాక్ లాగ్ గా ఉంచాలి.
SC , ST కేటగిరి లలో మహిళలు లేనిచో పురుషులలో భర్తీ చేస్తారు. *(G.O.Ms.No.18 Dt:17.2.2005)
సీనియారిటీ, ప్రమోషన్సు రిజిస్టర్ల గురించి వివరణ.
DSC లోని మెరిట్ ర్యాంకు, DOB ల సహాయంతోనూ, SC, ST, PH, BC లకు కేటాయించిన రోష్టరు ప్రకారం తయారు చేసిన ప్రమోషన్ రిజిస్టర్నే మెరిట్ కం రోష్టరు రిజిస్టర్ అంటారు.
గౌరవ కోర్టువారు మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారమే సీనియారిటీ లిష్టు తయారు చేయాలని తీర్పులిస్తున్నారు. గౌరవ భారత సుప్రీం కోర్టు వారు మెరిట్కి,రోస్టర్ ర్యాంకుకు అన్యాయం జరగకుండా పదోన్నతులు ఇవ్వాలని తీర్పునిచ్చింది. APSSSR 1996 రూల్సు నందుకూడా 33 నుండి 37 వరకు మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం సీనియారిటీ లిష్టులు ఎలాతయారు చేయవలసి ఉందో స్పష్టంగా ఉన్నది.
సీనియారిటీ లిష్టులు మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం తయారు చేసి, దీని ఆధారంగా ప్రమోషన్సు రిజిస్టర్ తయారు చేయాలి. ఈ ప్రమోషన్సు రిజిస్టర్లో ప్రమోషన్సులో రిజర్వేషన్లు ఉన్న SC, ST, PH అభ్యర్థులను రోష్టర్లో పెట్టి ప్రమోషన్సు ఇవ్వాలి .
సీనియారిటీ రిజిస్టర్ (లిష్టు):
ఒకే సారి(DSC) లో సెలక్టు కాబడిన వారందరూ డేట్ ఆఫ్ జాయినింగ్ తో సంభందం లేకుండా మెరిట్ కమ్ రోస్టర్( DSC Appointment)ర్యాంకు ప్రకారం సీనియారిటీ లిష్టులు తయారు చేయాలి, ఈ రిజిస్టర్ ప్రకారం SC, ST, PH అభ్యర్థులు లిష్టులో చివరలో ఎక్కడ ఉన్నా మెరిట్ కమ్ రోష్టరు ప్రకారం ప్రమోషన్సు పొందుతారు.
3. ప్రమోషన్సు రిజిస్టర్: ప్రమోషన్సులో రిజర్వేషన్లు ఉన్న SC (15%) , ST(6%), PHC (3%) లకు రోష్టరు పాయింట్లు అడక్వసీ నిబంధనలకు లోబడి వర్తిస్తాయి.
0 Response to "How to Prepare Promotion Seniority Lists"
Post a Comment