Railway Recruitment 2021
Railway Recruitment 2021: భారతీయ రైల్వేలో 904 ఉద్యోగాలకు నోటిఫికేషన్ , పూర్తి వివరాలు.
Railway Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ అందించింది భారతీయ రైల్వే. సౌత్ వెస్టర్న్ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..
Railway Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ అందించింది భారతీయ రైల్వే. సౌత్ వెస్టర్న్ రైల్వేకు చెందిన రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేస్తోంది. ఇందులో మొత్తం 904 ఖాళీలు ఉన్నాయి. ఎలక్ట్రీషియన్, వెల్డర్, ఫిట్టర్, కార్పెంటర్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకునేందుకు 2021 నవంబర్ 3 చివరి తేదీ. పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ అయిన అభ్యర్థులు పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కర్ణాటక, గోవా, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, చిత్తూరు, తమిళనాడులోని ధర్మపురి, సేలం, వేలూర్, మహారాష్ట్రలోని సంగ్లి జిల్లాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ జాబ్ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు : 904
ఖాళీల వివరాలు
- ఫిట్టర్ -390,
- వెల్డర్ – 55,
- మెషినిస్ట్ – 13,
- టర్నర్ -13,
- ఎలక్ట్రిషియన్ -248,
- కార్పెంటర్ – 11,
- పెయింటర్ -18,
- రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్ మెకానిక్ – 16,
- ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ – 138,
- స్టెనోగ్రాఫర్ – 2 ఉన్నాయి.
దరఖాస్తు ప్రారంభం- 04.10.2021
దరఖాస్తుకు చివరి తేదీ- 03.11.2021
విద్యార్హతలు: వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. పదవ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాల్సి ఉంటుంది
వయస్సు: 15 నుంచి 24 ఏళ్లు.
దరఖాస్తు ఫీజు: రూ.100
దరఖాస్తు చేయు విధానం
- అభ్యర్థులు ముందుగా https://jobs.rrchubli.in/ActApprentice2021-22/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
- హోమ్ పేజీలో New Registration పైన క్లిక్ చేయాలి.
- బేసిక్ వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
- ఫోటో, సంతకంతో పాటు అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.
- ఫీజు చెల్లించి దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేయాలి.
- అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసి భద్రపర్చుకోవాలి.
For Notification CLICK HERE
For online Apply CLICK HERE
0 Response to "Railway Recruitment 2021"
Post a Comment