Is the smartphone getting hot ..? But it is OK to follow these tips. !
స్మార్ట్ ఫోన్ వేడెక్కిపోతోందా .. ? అయితే ఈ టిప్స్ ని ఫాలో అయితే సరి . !
ఇప్పటి కాలంలో ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ అనేది చాలా ముఖ్యం అయిపోయింది. ఫోన్ మాట్లాడడానికి, ఈమెయిల్ పంపించడానికి, ఇంటర్నెట్ వాడడానికి, డిజిటల్ పేమెంట్ చేయడానికి ఇలా చాలా వాటికి స్మార్ట్ ఫోన్ ముఖ్యం.
మీ ఫోన్ ని పూర్తిగా ఛార్జ్ చేయొద్దు:
చార్జింగ్ పెట్టినప్పుడు 100% చార్జింగ్ అయ్యేవరకు ఉంచకండి. అదే విధంగా మీ ఫోన్ లో ఛార్జింగ్ 20 శాతం కంటే తక్కువ ఉండకుండా చూసుకుంటూ ఉండండి. అలాగే ఎక్కువ సార్లు ఛార్జింగ్ పెట్టడం వల్ల కూడా ఫోన్ ఓవర్ హీట్ అయిపోతుంది. రోజుకి రెండు నుండి మూడు సార్లు మాత్రమే మీ ఫోన్ ని ఛార్జింగ్ లో పెట్టండి.
ఫోన్ కవర్ వాడండి:
మొబైల్ కవర్స్ ఉపయోగించడం వల్ల ఓవర్ హీటింగ్ సమస్య తగ్గుతుంది. సూర్య కిరణాలు డైరెక్ట్ గా పడకుండా అది చూసుకుంటుంది. కాబట్టి మొబైల్ కవర్ ని తప్పక ఉపయోగించండి.
బ్యాక్ గ్రౌండ్ యాప్స్ ని క్లోజ్ చేయండి:
మీరు యాప్స్ తో పని చేయకపోయినట్లయితే వాటిని క్లోజ్ చేయండి. మీరు ఇలా చేయకపోతే యాప్స్ వర్క్ అవుతూ ఉంటాయి. దీనితో ఫోన్ వేడెక్కిపోతుంది.
ఫోన్ సెట్టింగ్స్ మార్చండి:
ఎంత తక్కువ బ్రైట్నెస్ పెట్టుకుంటే అంత మంచిది. బ్రైట్నెస్ తగ్గించడం వల్ల బ్యాటరీ కూడా తక్కువ అవుతుంది. కాబట్టి వీలైనంత తక్కువ వేడి ఫోన్ కి ఉండేట్టు చూసుకోండి.
ఒరిజినల్ చార్జర్ ని వాడండి:
చాలా మంది ఒకసారి ఛార్జర్ పోయిన తర్వాత డూప్లికేట్ చార్జర్లని కొనుగోలు చేస్తారు. అలా చేయడం వల్ల ఓవర్ హీట్ అయిపోతుంది. బ్యాటరీ కూడా పేలిపోయే అవకాశం ఉంటుంది.
0 Response to "Is the smartphone getting hot ..? But it is OK to follow these tips. !"
Post a Comment