Jobs in Railways: Notification for replacement of 2226 posts
రైల్వేలో ఉద్యోగాలు: 2226 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.
ప్యాండమిక్ సీజన్లో ఉద్యోగాలన్నీ బంద్ అయిపోయాయి. ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. ఇప్పుడిప్పుడే కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టడంతో, మెల్లిగా ఒక్కో రంగంలోనూ ఖాళీగా ఉన్న ఉద్యోగాలని భర్తీ చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్లు జారీ చేస్తున్నాయి.
మిగిలిన శాఖల్లో మాదిరిగానే రైల్వే శాఖలో కూడా నోటిఫికేషన్లు వెలువడగా… తాజాగా ఇప్పుడు మరో నేటిఫికేషన్ విడుదలైంది. రైల్వేకి చెందిన వేర్వేరు జోన్లలో ఉండే ఖాళీలను భర్తీ చేసేందుకుగాను… వేర్వేరు నోటిఫికేషన్స్ ని విడుదల చేస్తున్నారు.
అందులో భాగంగానే వెస్ట్ సెంట్రల్ రైల్వే కూడా భారీగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సుమారు 2226 అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేస్తోంది. ఈ పోస్టులలో ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్ వంటివి ఉన్నాయి. ఇందుకు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరితేది నవంబర్ 10, 2021. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెబ్సైట్లో చూడొచ్చు.
మొత్తం పోస్టులు : 2226
ముఖ్య సమాచారం:
- విద్యార్హతలు: 50 శాతం మార్కులతో టెన్త్ పాస్ అయి ఉండాలి. సంబంధిత ట్రేడ్లో ఐటీఐ పాస్ కావాల్సి ఉంటుంది.
- వయస్సు: అభ్యర్ధి వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
- ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
- దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ కి, మహిళలకి ఎలాంటి ఫీజు లేదు.
- దరఖాస్తులు ప్రారంభం: 11.10.2021
- దరఖాస్తులకు చివరి తేదీ: 10.11.2021
- వెబ్సైట్: https://wcr.indianrailways.gov.in
0 Response to "Jobs in Railways: Notification for replacement of 2226 posts"
Post a Comment