Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Ola Scooter Booking

 Ola Scooter Booking : రూ .499 ధరకే ఓలా స్కూటర్ బుకింగ్ .

Ola Scooter Booking

Ola Scooter Booking: పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల ధరల కారణంగా చాలా మంది వినియోగదారులు ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు చూస్తున్నారు. ఆయా వాహనాల తయారీ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్‌ వాహనాలను తయారు చేస్తూ మార్కెట్లో విడుదల చేస్తున్నాయి.

ఇక ఓలా నుంచి కూడా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మార్కెట్లో విడుదలైన విషయం తెలిసిందే. అయితే కొత్తగా స్కూటర్ కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది శుభవార్తే. తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల బుకింగ్‌ను ప్రారంభించింది. అతి తక్కువ ధరతో మీరు ఈ స్కూటర్‌ను కంపెనీ వెబ్‌సైట్ ద్వారా ప్రీబుకింగ్ చేసుకోవచ్చు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కేవలం రూ.499తో బుక్ చేసుకోవచ్చు. ఇది రిఫండబుల్. ప్రిబుక్ చేసుకున్న వారికి ఎలక్ట్రిక్ స్కూటర్లు ముందుగా డెలివరీ చేస్తారు. ఈ స్కూటర్‌లో పలు ప్రత్యేకతలు ఉన్నాయి

గత నెలలో ఈ స్కూటర్‌ కేవలం రెండు రోజుల్లోనే రూ.1100 కోట్ల వ్యాపారం జరిగింది. రెండు రోజుల అమ్మకాలలో అద్భుతమైన బిజినెస్‌ చేసింది. ఇది S1, S1 ప్రో అనే రెండు వేరియంట్‌లలో సెప్టెంబర్ 15, 2021 న అమ్మకాలు ప్రారంభించింది. దీనికోసం కొనుగోలు విండోను సెప్టెంబర్ 16, 2021 వరకు 48 గంటల పాటు తెరిచి ఉంచింది. ఓలా తన స్కూటర్ల కోసం జూలై 2021 లో ఆన్‌లైన్ రిజర్వేషన్‌లను ప్రారంభించింది. ఇక నవంబర్‌ 1, 2021 నుంచి మళ్లీ బుకింగ్ ప్రారంభించాలని భావిస్తోంది. అప్పుడు రిజర్వ్ చేసుకున్న కస్టమర్లకు ఇప్పుడు కంపెనీ కొనుగోలు విండోలో ప్రాధాన్యత ఇచ్చినట్లు ఓలా గ్రూప్‌ సీఈవో భవిష్య అగర్వాల్‌ తెలిపారు. భారతీయ ఇ-కామర్స్ చరిత్రలో ఒకే ఉత్పత్తికి ఒక రోజు (విలువ ప్రకారం) అత్యధిక అమ్మకాలలో ఇది ఒకటి అని ఆయన అన్నారు. ఈ స్కూటర్‌ రెండు వేరియంట్లలో విడుదలైంది. ఓలా ఎస్‌1, ఎస్‌1 ప్రో వేరియంట్లు వేగంగా విక్రయాలు కొనసాగాయి. కేవలం రూ. 499లతో బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని అందించడంతో విడుదలైన రోజే దాదాపు 1000 నగరాల్లో లక్ష ఫ్రీ బుకింగ్‌లతో రికార్డు నెలకొల్పింది.

రెండు వేరియంట్లలో ఓలా స్కూటర్స్‌.

ఓలా ఈ -స్కూటర్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి ఓలా ఎస్1, ఎస్1 ప్రో. ఇక ఓలా ఎస్ 1 ధర రూ. 1,41,400- ఎక్స్‌-షోరూమ్‌ ధర) ఉండగా, సబ్సిడీ రూపంలో.99,999లతో అందుబాటులో ఉంది. ఓలా ఎస్1 ప్రో రూ .1,29,999లలో లభించనుంది. కేంద్రం అందించే సబ్సిడీలతో పలు రాష్ట్రాల్లో ధరల్లో మార్పులుంటాయి.

ఓలా ఫీచర్స్‌

ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ రివర్స్ మోడ్‌తో వస్తుంది. ఇది రైడర్‌కి కఠినమైన ట్రాఫిక్ పరిస్థితుల నుంచి సులభంగా బయటపడేందుకు సహాయపడుతుంది. అలాగే హిల్ హోల్డ్ ఫీచర్‌తో ఎత్తుపైకి వెళ్లేటప్పుడు ఏమంత కష్టంగా ఉండబోదు. ఈ-స్కూటర్ కూడా క్రూయిజ్ కంట్రోల్ మోడ్‌తో కూడిన పవర్ లేదా బ్యాటరీ లైఫ్‌కు ప్రాధాన్యత ఇచ్చేందుకు మూడు మోడ్‌లతో పనిచేయనుంది. ఇందులో మూడు డ్రైవింగ్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి. నార్మల్, స్పోర్ట్, హైపర్‌ మోడ్స్‌లో పనిచేస్తుంది. అలాగే ఓలా ఎస్1 కేవలం 3 సెకన్లలో 0kmph నుంచి 40kmph వరకు వెళ్లగలదు. అలాగే గరిష్టంగా 115 కి.మీ. వెళ్లగలదు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎలక్ట్రిక్ స్కూటర్ 181 కిమీల వరకు వెళ్తుందని కంపెనీ వెల్లడించింది.

ఫుల్ ఛార్జ్‌తో ఓలా S1 డ్రైవింగ్ రేంజ్ 181 కి.మీ

ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవీష్ అగర్వాల్ వెల్లడించిన వివరాల మేరకు S1 స్కూటర్ పూర్తిగా ఛార్జ్ చేసినప్పుడు 181 కి.మీ. చేరుకోగలదు. అలాగే S1 స్కూటర్ కేవలం 3 సెకన్లలో 0 kmph నుంచి 40 kmph వరకు వెళ్లగలదని అగర్వాల్ తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనం గరిష్టంగా 115 కి.మీ వెళ్లగలదని ఆయన వెల్లడించారు.

ఛార్జింగ్ సమయం

ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగించడం ద్వారా కస్టమర్‌లు కేవలం 18 నిమిషాల్లో 50శాతం వరకు ఈ-స్కూటర్‌ను ఛార్జ్ చేసుకోవచ్చని ఓలా కంపెనీ తెలిపింది. రెగ్యులర్ ఛార్జింగ్ స్టేషన్‌లో, ఎలక్ట్రిక్ స్కూటర్ 0 నుంచి ఫుల్ ఛార్జ్ కావడానికి 2.5 గంటలు పడుతుంది. ఇంట్లో ఒక సాధారణ ప్లగ్‌తో 5.5 గంటల సమయం పడుతుంది.

ఓలా ఎలక్ట్రిక్ ఈ-స్కూటర్ సబ్సీడీ

ఓలా ఈ-స్కూటర్ 50శాతం ఛార్జ్‌తో 75 కిమీ వరకు ప్రయాణం చేయగలదని వెల్లడించింది. ఇది ఫుల్‌గా ఛార్జ్ చేసినప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ 150 కిమీ ప్రయాణం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ వాహనం 3.4kWh బ్యాటరీని కలిగి ఉంది. దీంతో ప్రభుత్వ FAME-II సబ్సిడీకి అర్హత పొందుతుంది.

ఓలా ఎలక్ట్రిక్ ఈ-స్కూటర్ కలర్స్

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ 10 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. నీలం, నలుపు, ఎరుపు, గులాబీ, పసుపు, తెలుపు, సిల్వర్ షేడ్స్‌లో మ్యాట్, గ్లోస్ ఎంపికల్లో ఉండనున్నాయి. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా మెరుగైన సేవలందించేందుకు ఓలా ఈ-స్కూటర్ మూడు విభిన్న వేరియంట్లలో లభించనుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Ola Scooter Booking"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0