Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Paytm

 Paytm : గుడ్ న్యూస్ ... ఇక పేటీఎంలో ఆధార్ కార్డ్ , పాన్ కార్డ్ దాచుకోవచ్చు.

Paytm


తమ యూజర్లకు కొత్తరకం సేవలందిస్తున్నట్లు తెలిపింది ఆన్‌లైన్ పేమెంట్స్ ప్లాట్‌ఫాం పేటీఎం (Paytm).

వినియోగదారులు ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, ఆర్‌సీ, ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లను డిజిలాకర్ (Digilocker) ద్వారా స్టోర్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. డిజిలాకర్ అనేది క్లౌడ్ ఆధారిత ప్లాట్‌ఫామ్‌. దీన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ అభివృద్ధి చేసింది. దీన్ని పేటీఎం యాప్‌లోని మినీ యాప్ స్టోర్‌లో (Mini App Store) కూడా పొందొచ్చు. డిజిలాకర్‌లో ప్రభుత్వానికి సంబంధించిన డాక్యుమెంట్లను స్టోర్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో అవసరం ఉన్నప్పుడు ఆఫ్‌లైన్‌లోనూ ఆయా డాక్యుమెంట్స్‌ను తిరిగి పొందే వీలు ఉంటుంది.

ఇప్పుడు పేటీఎం యూజర్లు ఆధార్‌, డ్రైవింగ్ లైసెన్స్, వాహన ఆర్‌సీ, కోవిడ్ 19 సర్టిఫికెట్స్‌.. ఇలా అన్ని రకాల డాక్యుమెంట్లను ఒకే చోట స్టోర్ చేసుకోవచ్చు. డిజిలాకర్‌లో స్టోర్ చేసుకుంటే.. అవి కేవలం క్లౌడ్‌లో లాకర్‌లో సేవ్ అయి ఉంటాయి. కాబట్టి ప్రైవసీకి సంబంధించిన సమస్యలు రావు. డిజిలాకర్ ద్వారా సెల్ఫ్ కేవైసీ కూడా చేసుకోవచ్చు. టెలికాం ఆపరేటర్లతో వీడియో కేవైసీ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ప్రకారం డిజిలాకర్ డాక్యుమెంట్స్ లీగల్‌గా చెల్లుతాయి. ఏదైనా కంపెనీకి డాక్యుమెంట్స్ పంపించాలన్నా.. కేవైసీ చేయాలన్నా.. ఫైనాన్షియల్ సంస్థలకు, ఆన్‌లైన్ షేర్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లకు పంపించాలన్నా కూడా చాలా సులభం అవుతుంది. దీని వల్ల కంపెనీలకు ఒరిజినల్ డాక్యుమెంట్స్‌ను పట్టుకొని వెళ్లాల్సిన అవసరం ఉండదు. కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను కూడా డిజిలాకర్‌లో యాడ్ చేసుకోవచ్చు.

పేటీఎం యాప్‌లోని డిజిలాకర్ ప్రొఫైల్‌కు వెళ్లి ప్రొఫైల్ సెక్షన్‌లో యువర్ డాక్యుమెంట్స్ అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ స్టోర్ అయి ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ కనిపిస్తాయి. ఒకసారి డిజిలాకర్‌లో డాక్యుమెంట్స్‌ను స్టోర్ చేసుకున్నాక నెట్ కనెక్టివిటీ సమస్యలు ఉన్నా.. ఆఫ్‌లైన్‌లో ఉన్నా డాక్యుమెంట్స్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు.

'డిజిలాకర్ ఫంక్షనాలిటీని పేటీఎం యాప్‌లో ఇంటిగ్రేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. కోట్ల మంది యూజర్లు ప్రతి రోజు పేటీఎం యాప్‌ను సందర్శిస్తుంటారు. అందులో చాలామంది వ్యాక్సిన్ బుకింగ్‌, ట్రావెల్, ఫాస్టాగ్‌, ఇన్సురెన్స్, కేవైసీ లాంటి ఎన్నో పనుల కోసం విజిట్ చేస్తుంటారు. వాళ్లందరికి కూడా డిజిలాకర్ ప్లాట్‌ఫామ్ బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యమైన డాక్యుమెంట్లను అందులో దాచుకుని... అవసరం ఉన్నప్పుడు వాటిని వాడుకునే బెస్ట్ ఫంక్షనాలిటీని డిజిలాకర్ ద్వారా అందిస్తున్నారు..' అని పేటీఎం అధికార ప్రతినిధి పేర్కొన్నారు.

'డిజిటల్ ఇండియా మిషన్ లక్ష్యంతో డిజిలాకర్ రూపుదిద్దుకుంది. భారత పౌరులకు తమ ముఖ్యమైన డాక్యుమెంట్స్‌ను ఆన్‌లైన్‌లో భద్రంగా దాచుకునేలా ఈ యాప్ ఉపయోగపడుతుంది. పేటీఎం మినీ యాప్‌తో పార్ట్‌నర్‌షిప్ అయిన సందర్భంగా పేటీఎం యూజర్లు తమ ఆధార్‌, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి అన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను అందులో స్టోర్ చేసుకోవచ్చు..' అని డిజిలాకర్ ప్రతినిధి పేర్కొన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Paytm"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0