Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Promotions to take up promotions upto the cadre of Head Masters, Grade II and School Assistant on Adhoc basis -Rc.No.ESE02-13021 CSE DT:14-10-2021

Gr 2 HM మరియు స్కూల్ అసిస్టెంట్ లకు సంబంధించి  పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ.


Promotions to take up promotions upto the cadre of Head Masters, Grade II and School Assistant on Adhoc basis -Rc.No.ESE02-13021 CSE DT:14-10-2021

Promotion Schedule - Permission to take up promotions upto the cadre of Head Masters, Grade-II and School Assistants

ఉపాధ్యాయ పదోన్నతుల షెడ్యూలును విడుదల చేసిన పాఠశాల విద్యా శాఖ - సీనియారిటీ జాబితా 16న విడుదల

ప్రభుత్వ పాఠశాలల టీచర్లకు ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించేందుకు పాఠశాల విద్యా శాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ను ఆ శాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు గురువారం విడుదల చేశారు. స్కూల్ అసిస్టెంట్లు గ్రేడ్-2 ప్రధానోపాధ్యాయులుగా, సెకండరీ గ్రేడ్ టీచర్లు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందనున్నారు.

ఈ మేరకు జిల్లాల వారీగా రీజినల్ జాయింట్ డైరెక్టర్లకు విద్యా శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. స్టేట్ సబార్డినేట్ నిబంధనల ప్రకారం.. ఇప్పటికే డీఈవోలు జిల్లాల వారీగా సీనియార్టీ జాబితాలను సిద్ధం చేసిపదోన్నతులకు వీలుగా అందుబాటులో ఉంచారు. ఈ జాబితాలను రీజినల్ జాయింట్ డైరెక్టర్లు, డీఈవో కార్యాలయాల్లోని నోటీసు బోర్డుల్లో అందరికీ కనిపించేలా ఉంచాలి. హెచ్ఎం పోస్టులను ఆయా పేరెంట్ డిపార్ట్మెంట్లకు చెందిన టీచర్లకు పదోన్నతిపై కేటాయించాలి. 

నవంబర్ 1 నాటికి పదవీ విరమణ చేసినవారి పోస్టులు, మరణించినవారి పోస్టులు, ఇతర ఖాళీలను పదోన్నతులకు వీలుగా చూపాలి.

2021 జనవరిలో నిర్వహించిన బదిలీల సమయంలో బ్లాక్ చేసిన, ప్రదర్శించినవాటిని ఖాళీల్లో చూపరాదు.

ప్రస్తుతం కల్పిస్తున్న పదోన్నతులన్నీ తాత్కాలిక (అడహాక్) ప్రాతిపదికపై ఉంటాయి.

బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియలో టీచర్లు.. వారి ప్రతిభ, సాధించిన ఫలితాలు, ఇతర ప్రాతిపదికల ఆధారంగా ఇచ్చే ఆప్షన్ల ప్రాధాన్యతలను బట్టి పదోన్నతులు ఉంటాయి. 

షెడ్యూల్ 
  • స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్ల సీనియార్టీ జాబితాల ప్రదర్శన అక్టోబర్ 16..
  • సీనియార్టీ జాబితాలపై అప్పీళ్ల సమర్పణ అక్టోబర్ 18, 19..
  • అప్పీళ్ల పరిశీలన, పరిష్కారం అక్టోబర్ 21, 22..
  • తుది సీనియార్టీ జాబితాల ప్రదర్శన అక్టోబర్ 23..
  • పదోన్నతులకు కౌన్సెలింగ్ అక్టోబర్ 29 నుంచి 30 వరకు..

https://drive.google.com/file/d/1vN6WtdBJqkDAd3Z8TV140FB5gh4RfMrL/view

Rc.No.ESE02-13021 CSE Dated 14-10-2021 ప్రకారం..ప్రమోషన్ షెడ్యూల్ 16 వ తేదీన ప్రారంభం అయ్యి, 30 తో ముగుస్తుంది.

Display of Provisional seniority : 16-10-2021

Appeals & objections: 18-10-2021 19-10-2021

Display of Final Seniority lists : 23-10-2021

Gr.II HMs కౌన్సెలింగ్ : 25-10-2021

SAs కౌన్సెలింగ్ : 29-10-2021

& 30-10-2021

Points to be noted!

01 - 11 - 2020 తర్వాత ఏర్పడిన ఖాళీలను, అనగా.. రిటైర్మెంట్ , డెత్ మరియు ప్రమోషన్ వలన ఏర్పడిన ఖాళీలను మాత్రమే భర్తీ చేయాలని సూచించారు.

జనవరి - 2021 లో చేపట్టిన ట్రాన్స్ ఫర్స్ లో block చేయబడిన ఖాళీలను ఓపెన్ చేయవద్దు అని సూచించారు.

ఈ ప్రమోషన్స్ adhoc based.

ఇప్పుడు promotion పొందబోయేవారు, త్వరలో చేపట్టబోయే ట్రాన్స్ ఫర్స్ లో మరలా పాల్గొని options exercise చేయవలసి ఉంటుంది

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Promotions to take up promotions upto the cadre of Head Masters, Grade II and School Assistant on Adhoc basis -Rc.No.ESE02-13021 CSE DT:14-10-2021"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0