Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

SCR Notification 2021 – Opening for 4103 Technician Posts.

 సికింద్రాబాద్‌ రైల్వేలో 4103 జాబ్స్‌.. రాత పరీక్ష లేదు.. టెన్త్‌, ఐటీఐ అర్హత.

SCR Notification 2021 – Opening for 4103 Technician Posts.

scr.indianrailways.gov.in: దక్షిణ మధ్య రైల్వే వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 4,103 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.

ప్రధానాంశాలు:

  • దక్షిణ మధ్య రైల్వే రిక్రూట్‌మెంట్‌
  • 4103 అప్రెంటిస్‌ ఖాళీల భర్తీ
  • నవంబర్‌ 3 దరఖాస్తులకు చివరితేది

సికింద్రాబాద్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 4,103 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.

దక్షిణ మధ్య రైల్వే లోని 35 ఎస్టాబ్లిష్‌మెంట్‌ల లోని 11 ట్రేడ్ ల లో ఈ 4,103 ఖాళీలున్నాయి. దరఖాస్తు చేసుకోదలచిన అభ్యర్థులు పదవ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులను టెన్త్‌, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారం గా ఎంపిక చేస్తారు.

ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు అక్టోబర్ 4 వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి నవంబర్ 3 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు https://scr.indianrailways.gov.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

విభాగాల వారీగా ఖాళీలు:

మొత్తం పోస్టులు 4,103

  • ఏపీ మెకానిక్‌ - 250
  • కార్పెంటర్‌- 18
  • డీజిల్‌ మెకానిక్‌ - 531
  • ఎలక్ట్రీషియన్‌ - 1019
  • ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌ - 92
  • ఫిట్టర్‌ - 1460
  • మెషినిస్ట్‌ - 71
  • ఎంఎంటీఎం - 5
  • ఎంఎండబ్ల్యూ- 24
  • పెయింటర్‌ - 80
  • వెల్డర్‌- 553

ధరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. ధరఖాస్తు ఫీజును ఇతరులకు 100రూపాయలు గాను, ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. ధరఖాస్తులకు చివరి తేదిగా నవంబరు 3 ప్రకటించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ scr.indianrailways.gov.in

NOTIFICATION


నోటిఫికేషన్ వివరాలు పూర్తిగా ఇంగ్లీష్ కొరకు ఇక్కడ చూడగలరు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "SCR Notification 2021 – Opening for 4103 Technician Posts."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0