What is e-Aadhaar card and what is its use? Is it the same as Aadhaar card? Description.
ఇ - ఆధార్ కార్డు అంటే ఏంటి , దాని వల్ల ఉపయోగం ఏమిటి ? ఆధార్ కార్డుతో సమానంగా ఉంటుందా ? వివరణ.
భారతదేశంలో గుర్తింపు, అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు (aadhar card)ఎక్కువగా ఆమోదించే డాక్యుమెంట్. ప్రతి ఒక్కరి గోప్యతను కాపాడటానికి, మరింత సులభతరం చేయడానికి ఆధార్ జారీ చేసే సంస్థ ప్రత్యేక గుర్తింపు అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఇ-ఆధార్‌ను అవసరమైన చోట ఉపయోగించడానికి అనుమతించింది.
ఇ-ఆధార్ అంటే ఏమిటి?
ఇ-ఆధార్ అనేది ఆధార్ యొక్క పాస్ వర్డ్ ప్రొటెక్టెడ్ ఎలక్ట్రానిక్ కాపీ. దీనిపై యూఐడిఏఐ అథారిటీ డిజిటల్ సంతకం ఉంటుంది.
అతేంటిసిటి ఇ-ఆధార్ అంటే ఏమిటి? ఆధార్ ఫిజికల్ కాపీతో సమానంగా చెల్లుబాటు అవుతుందా?
ఆధార్ చట్టం ప్రకారం, ఇ-ఆధార్ అన్ని ప్రయోజనాల కోసం ఆధార్ భౌతిక కాపీలాగానే సమానంగా చెల్లుబాటు అవుతుందని అథారిటీ తెలిపింది.
ఇ-ఆధార్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
ఆధార్ కార్డు ఉన్నవారు రెండు మార్గాలను అనుసరించడం ద్వారా ఇ-ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
ఎన్రోల్మెంట్ నంబర్ ఉపయోగించడం ద్వారా
ఆధార్ కార్డు హోల్డర్లు పూర్తి పేరు, పిన్ కోడ్‌తో పాటు 28 అంకెల ఎన్రోల్మెంట్ నంబరును ఉపయోగించి ఇ-ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ డౌన్‌లోడ్ ప్రక్రియలో ఓటిపి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు అందుతుంది. ఓటిపికి బదులుగా ఇ-ఆధార్ డౌన్‌లోడ్ చేయడానికి టిఓటిపిని కూడా ఉపయోగించవచ్చు. ఎంఓ ఆధార్ మొబైల్ అప్లికేషన్ ఉపయోగించి టిఓటిపిని జనరేట్ చేయవచ్చు.
ఆధార్ నంబర్ ఉపయోగించడం ద్వారా
ఆధార్ కార్డు హోల్డర్లు పూర్తి పేరు, పిన్ కోడ్‌తో పాటు 12 అంకెల ఆధార్ నంబర్‌ను ఉపయోగించి ఇ-ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ డౌన్‌లోడ్ ప్రక్రియలో ఓటిపి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు అందుతుంది. ఓటిపికి బదులుగా ఇ-ఆధార్ డౌన్‌లోడ్ చేయడానికి టిఓటిపిని కూడా ఉపయోగించవచ్చు. ఎంఓ ఆధార్ మొబైల్ అప్లికేషన్ ఉపయోగించి టిఓటిపి జనరేట్ చేయవచ్చు.
ఇ-ఆధార్ పాస్‌వర్డ్ అంటే ఏమిటి?
కాపిటల్‌లో పేరు మొదటి 4 అక్షరాలు, పుట్టిన సంవత్సరం (YYYY) పాస్‌వర్డ్‌గా కలపడం.
ఉదాహరణ 1
పేరు: రాజేశ్ కుమార్
పుట్టిన సంవత్సరం: 1980
పాస్‌వర్డ్: RAJE1980
ఉదాహరణ 2
పేరు: రాజ్ కుమార్
పుట్టిన సంవత్సరం: 1980
పాస్‌వర్డ్: RAJK1980
ఉదాహరణ 3
పేరు: ఆర్.కుమార్
పుట్టిన సంవత్సరం: 1980
పాస్‌వర్డ్: R.KU1990
ఉదాహరణ 4
పేరు: జియా
పుట్టిన సంవత్సరం: 1990
పాస్‌వర్డ్: JIA1990
ఇ-ఆధార్‌ను ఎక్కడ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు?
మీరు యుఐడిఎఐ వెబ్ సైట్స్ సందర్శించడం ద్వారా ఇ-ఆధార్‌ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇందుకు ఇ-ఆధార్ https://uidai.gov.in/ లేదా https://eaadhaar.uidai.gov.in సందర్శించవచ్చు.
0 Response to "What is e-Aadhaar card and what is its use? Is it the same as Aadhaar card? Description."
Post a Comment