Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AIC Recruitment 2021

 అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగాలు .. పోస్టుల వివరాలు , అర్హతలివే.

AIC Recruitment 2021


ప్రధానాంశాలు:

  • ఏఐసీ ఇండియా జాబ్‌ రిక్రూట్‌మెంట్‌
  • మేనేజ్‌మెంట్ ట్రైనీ, హిందీ ఆఫీసర్ పోస్టుల భర్తీ
  • డిసెంబర్‌ 13 దరఖాస్తులకు చివరితేది

AIC Recruitment 2021: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు గుడ్‌న్యూస్‌. అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ( Agriculture Insurance Company of India) మేనేజ్‌మెంట్ ట్రైనీ, హిందీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 31 పోస్టులను భర్తీ చేయనున్నారు.

అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్ట్‌లకు అప్లయ్‌ చేసుకోవడానికి డిసెంబర్ 13 చివరితేది. ఫీజు చెల్లించడానికి కూడా ఇదే చివరితేదీ. ఈ పోస్టులకు 2022 జనవరి నెలలో పరీక్ష నిర్వహిస్తారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://www.aicofindia.com/ ని సందర్శించాలి.

మొత్తం ఖాళీలు: 31

అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం 31 పోస్టులను భర్తీ చేస్తారు. ఇందులో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు 30, హిందీ ఆఫీసర్‌కు ఒక పోస్టును కేటాయించారు. దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్ మోడ్‌లో నిర్వహిస్తారు.

విద్యార్హతలు:

మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి B.Sc అగ్రికల్చర్, B.Tech లేదా M.Tech అగ్రికల్చర్‌ చేసి ఉండాలి. 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు.

హిందీ ఆఫీసర్ పోస్ట్ కోసం దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి హిందీ సబ్జెక్టుతో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండాలి. ఇందులో 60% మార్కులు సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

దరఖాస్తు విధానం:

  • మొదట https://www.aicofindia.com/ అధికారిక వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయాలి.
  • హోమ్ పేజీలో, మేనేజ్‌మెంట్ ట్రైనీల పోస్ట్ & డైరెక్ట్ రిక్రూట్ హిందీ ఆఫీసర్ (స్కేల్ I) కోసం దరఖాస్తును ఆహ్వానించడంపై క్లిక్ చేయాలి.
  • ఆన్‌లైన్ అప్లికేషన్ లింక్‌కి వెళ్లాలి.
  • కొత్త రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి అనే లింక్‌పై క్లిక్ చేయాలి.
  • పూర్తి వివరాలను నింపడం ద్వారా మీ పేరు నమోదు చేసుకోవాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AIC Recruitment 2021"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0