Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Another Corona Wave Launch in Europe!

యూరప్ లో మరో కరోనా వేవ్ ప్రారంభం!

Another Corona Wave Launch in Europe!

  • ఫిబ్రవరి నాటికి 5 లక్షల మరణాలు నమోదు కావచ్చు
  • ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా హెచ్చరిక

లండన్ నవంబర్ 5 : ప్రపంచంలో కరోనా మరోసారి విజృంభిస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా యూరప్ ఖండంలో మహమ్మారి మరోసారి జూలు విదిల్చి విశ్వరూపాన్ని ప్రదర్శించే అవకాశం. ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్) హెచ్చరిస్తో ౦ది. వ్యాక్సిన్ రాకతో కరోణా విజృంభణ కాస్త అదుపులోకి వచ్చినట్లు అనిపించినా పలు దేశాల్లో కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా కరోనా విజృంభణకు యూరప్ కేంద్ర బిందువయ్యే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటోంది. గడచిన కొన్ని వారాలుగా యూరప్లో కొత్త కేసులు, ఆస్పత్రుల్లో చేరే కేసులు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఫిబ్రవరి నాటికి మరో 5 లక్షల మరణాలు సంభవించే ప్రమాదం ఉందని డబ్ల్యుహెచ్ ఒ భయాందోళనలు వ్యక్తం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ పలు దేశాల్లో కొవిడ్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా యూరప్ దేశాల్లో కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. కేవలం గడిచిన వారంలోనే యూరప్ వ్యాప్తంగా కొత్తగా 18 లక్షల కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ కేసుల్లో 6 శాతం పెరుగుదల కనిపించింది. వీటితోపాటు గతవారంలో మరణాల సంఖ్య 24 వేలకు చేరుకుంది. అక్కడి కొవిడ్ మరణాల్లో ఏకంగా 12 శాతం పెరుగుదల కనిపిచింది. ప్రతి లక్ష మందికి 192 కేసులు బయటపడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గతవారం నమోదైన మొత్తం కేసుల్లో 59 శాతం ఉండగా, సగం మరణాలు ఇక్కడే చోటుచేసుకున్నాయి. గత ఐదు వారాలుగా అక్కడ పెరుగుతోన్న కొవిడ్ తీవ్రత మరికొన్ని రోజులపాటు ఇలాగే కొనసాగితే వచ్చే ఫిబ్రవరి నాటికి యూరప్లో 5 లక్షలమంది చనిపోయే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ యూరప్ డైరెక్టర్ డాక్టర్ హాన్స్ క్లూగే హెచ్చరించారు. వ్యాక్సినేషన్ కొనసాగుతున్నప్పటికీ కొవిడ్ తీవ్రత క్రమంగా పెరగడం ఆందోళన కలిగించే విషయమని అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే కొవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారిలో అధికంగా పూర్తి మోతాదులో వ్యాక్సిన్ తీసుకోనివారే ఉన్నట్లు వెల్లడించారు. ఇలా వైరస్ తీవ్రత పెరుగుతుండటం చూస్తుంటే మరో వేవ్ ముంచుకొస్తుందనే విషయం స్పష్టమవుతోందని స్వీడన్ చీఫ్ ఎపిడమాలజిస్ట్ అండర్స్ టెగ్నెల్ అన్నారు. ముఖ్యంగా శీతాకాలంలో వైరస్ విజృంభణ పెరగడం ఈ ఆందోళన పెరగడానికి కారణమని అన్నారు. మరో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆమస్టర్ మ్లోని యూరోపియన్ మెడికల్ ఏజెన్సీ ప్రజలకు విజృప్తి చేసింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Another Corona Wave Launch in Europe!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0