Let's find out what happens if you do not close unnecessary bank accounts.
అవసరం లేని బ్యాంకు ఖాతాలను క్లోజ్ చేయకపోతే ఏమవుతుందో తెలుకుందాం.
చాలా మంది ప్రజలు ఒక్క బ్యాంకు ఖాతా కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను ఓపెన్ చేస్తుంటారు. డీమాట్ అకౌంట్, గృహరుణం, శాలరీ ఇలా ఒక్కొక్క ఆర్థిక పనులకు ఒక్కో ఖాతాలు తెరుస్తారు.
మీరు చాలా బ్యాంకుల ఖాతాలను మెయింటెన్ చేస్తున్నట్లయితే.. అవసరం లేనివి గుర్తించి వాటిని వెంటనే క్లోజ్ చేసేయండి. లేదంటే మీరు మంచి రాబడిని వదులుకున్నట్టు అవుతుంది. ఎల్లప్పుడూ ప్రతి బ్యాంకు ఖాతాలో మినిమం బాలన్స్ మెయింటెన్ చేయడమంటే ఎవరికైనా కష్టంతో కూడుకున్న పనే అని చెప్పవచ్చు. అలాగే ఎక్కువగా ఖాతాల వల్ల గందరగోళంతో పాటు వాటి పాస్‌వర్డ్‌లు మర్చిపోయే అవకాశం ఉంది.
ఒకవేళ మీరు మీ జీరో బ్యాలెన్స్ పొదువు ఖాతాల్లో వరుసగా మూడు నెలల పాటు ఎలాంటి డిపాజిట్ చెయకపోతే అది క్లోజ్ అవుతుంది. అందులోని డబ్బులు మళ్ళీ మీరు ఉపసంహరించుకోవాలి అంటే లేఖ ద్వారా అభ్యర్థన పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత అది జీరో పొదుపు ఖాతా నుంచి సాధారణ పొదుపు ఖాతాగా మారుతుంది. అప్పుడు మీరు మళ్ళీ కనీస బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఆదాయపు పన్ను రిటర్న్ చేస్తున్న సమయంలో మీ బ్యాంకు ఖాతాల వివరాలన్నీ పొందుపరచాల్సి ఉంటుంది. ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటే ఈ సమయంలో కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది.. ఒకవేళ మీరు జీతాల కోసం కొత్తగా ఖాతాను తెరవాలనుకుంటే పాత ఖాతాను వెంటనే క్లోజ్ చేసేయండి. మీ పెట్టుబడికి సొంతంగా ఒక పర్మినెంట్ బ్యాంకు ఖాతా, కుటుంబ సభ్యులతో కలిసి ఒక ఉమ్మడి బ్యాంకు ఖాతా ఉంటే సరిపోతుందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. పర్మనెంట్ ఖాతాను శాలరీ అకౌంట్ గా మీరు మార్చుకునేందుకు వీలు ఉంటుంది. కేవలం రెండు, మూడు ఖాతాలు ఉంటే వాటిని సమీక్షించుకోవడం కూడా చాలా సులభతరం అవుతుంది.
0 Response to "Let's find out what happens if you do not close unnecessary bank accounts."
Post a Comment