BSF Recruitment 2021
టెన్త్ క్లాస్‌తో కానిస్టేబుల్ ఉద్యోగాలు.. రూ.69,100 వరకూ జీతం.. వెంటనే అప్లయ్ చేసుకోగలరు.
ప్రధానాంశాలు:
- బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉద్యోగాలు
- 72 గ్రూప్-సీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
- కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ
- 2 కానిస్టేబుల్ (సీవర్‌మ్యాన్)
- 24 కానిస్టేబుల్ (జనరేటర్ ఆపరేటర్)
- 28 కానిస్టేబుల్ (జనరేటర్ మెకానిక్)
- 11 కానిస్టేబుల్ (లైన్‌మన్)
- 1 ఏఎస్‌ఐ
- 6 హెచ్‌సీ ఖాళీలను భర్తీ చేస్తారు.
మొత్తం ఖాళీలు : 72
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://rectt.bsf.gov.in/ ద్వారా ఎంప్లాయిమెంట్ న్యూస్ ఉద్యోగ ప్రకటన వెలువడిన 45 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టుల్లో కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతం ఉంటుంది. ఏఎస్‌ఐ పోస్టులకు రూ.29200 నుంచి రూ.92300, హెచ్‌సీ పోస్టుకు రూ.25500 నుంచి రూ.81100 వరకు జీతం ఉంటుంది.
విద్యార్హతలు- ఇతర వివరాలు:
అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇది కాకుండా, అభ్యర్థి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి. ఈ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం అభ్యర్థి కనీస వయస్సు 18 సంవత్సరాలు , గరిష్ట వయస్సు 25 సంవత్సరాలుగా నిర్ణయించబడింది. అయితే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు వయో సడలింపులు ఉంటాయి. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ చూడొచ్చు.
https://rectt.bsf.gov.in/
0 Response to "BSF Recruitment 2021"
Post a Comment