Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Cash Withdrawal: Let us know the rules of what happens if money is drawn with the ATM card of the deceased.

 Cash Withdrawal : మరిణించినవారి ఏటీఎం కార్డుతో డబ్బులు డ్రా చేస్తే ఏమౌతుందో రూల్స్ తెలుకుందాం.

Cash Withdrawal: Let us know the rules of what happens if money is drawn with the ATM card of the deceased.

1. ఈ రోజుల్లో బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికీ ఏటీఎం కార్డు ఉంటోంది.

అకౌంట్‌లో ఉన్న డబ్బు తీసుకోవడానికి (Cash Withdrawal) బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా... ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏటీఎంల నుంచి క్యాష్ విత్‌డ్రా చేసుకుంటున్నారు. అయితే అకౌంట్ హోల్డర్ చనిపోతే వారి ఏటీఎం కార్డుతో ఎవరైనా డబ్బు విత్‌డ్రా చేయవచ్చా? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తున్నారు బ్యాంకింగ్ రంగ నిపుణులు.

2. చనిపోయిన తల్లిదండ్రుల ఏటీఎం కార్డు ద్వారా వారి బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బు విత్‌డ్రా చేయవచ్చా? తల్లిదండ్రుల మరణం తర్వాత బ్యాంకుకు సమాచారం ఇవ్వకుండా డబ్బు విత్‌డ్రా చేసి... ఆ తరువాత వారి మరణం గురించి బ్యాంకుకు తెలియజేయడం నేరం కిందకు వస్తుందా? ఈ విషయంలో చట్టపరమైన వారసులకు సంబంధించి ఏదైనా వివాదం లేదా దావా ఎదుర్కోవాల్సి వస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు చూద్దాం.

3. చనిపోయిన వారి అకౌంట్ నుంచి డబ్బు విత్‌డ్రా చేయడం అనేది బ్యాంకును, ఇతర చట్టపరమైన వారసులను మోసం చేయడం కిందకు వస్తుంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. అనంతరం చట్ట ప్రకారం పోలీసులు దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. 

4. ఒకవేళ మరణించిన వారి అకౌంట్ నుంచి ఎవరైనా పెద్ద మొత్తంలో డబ్బు విత్‌డ్రా చేస్తే.. చనిపోయిన వారి ఎస్టేట్‌కు సంబంధించిన ప్రొబేట్ (Probate) లేదా లెటర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ప్రొబేట్ అనేది చనిపోయిన వ్యక్తి ఎస్టేట్ నిర్వహణకు సంబంధించిన మొత్తం ప్రక్రియ.

5. ఇందులో వారి డబ్బు, ఆస్తుల నిర్వహణ, వాటిని వారసత్వంగా పంపిణీ చేయడం వంటివన్నీ ఉంటాయి. మరణించిన వ్యక్తి వీలునామా రాస్తే.. వారి ఎస్టేట్ నిర్వహణకు ఎంచుకున్న వ్యక్తుల పేరును అది తెలియజేస్తుంది. ఈ విషయంలో చట్టపరమైన వారసుల మధ్య వివాదం తలెత్తితే.. దీన్ని దావాగా మార్చుకోవచ్చు.

6. ఈ పత్రాలతో పాటు బ్యాంక్ అకౌంట్ స్టేట్‌యూమెంట్, సీసీటీవీ ఫుటేజ్, ఖాతాదారుడి మరణ ధ్రువీకరణ పత్రం, డబ్బు విత్‌డ్రా చేసినప్పుడు ATM కార్డు ఎవరి వద్ద ఉంది.. వంటి అన్ని వివరాలతో క్రిమినల్ కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆరోపణలు, దర్యాప్తు, రుజువులను బట్టి క్రిమినల్ పనిష్‌మెంట్ వర్తిస్తుంది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Cash Withdrawal: Let us know the rules of what happens if money is drawn with the ATM card of the deceased."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0