Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Clean the toilets in the school.

బడిలో మరుగుదొడ్లు శుభ్రం చేయండి.

Clean the toilets in the school.


  • టీచర్లు, తల్లిదండ్రులు శ్రమదానం చేయాలి 
  • పాఠశాల విద్యాశాఖ అధికారుల ఉత్తర్వులు 

 మరుగుదొడ్ల ఫొటోలు తీసి అప్‌లోడ్‌ చేసే పని నుంచి టీచర్లకు ఇటీవలే మినహాయింపు ఇచ్చారు. అయితే ఈ నెల 19న ‘ప్రపంచ టాయ్‌లెట్‌ డే’ సందర్భంగా పాఠశాలల్లో మరుగుదొడ్లను ఉపాధ్యాయులు, పేరెంట్స్‌ కమిటీలు శుభ్రం చేయాలంటూ సర్కారు గురువారం చిత్రమైన ఉత్తర్వు జారీ చేసింది. మరుగుదొడ్లను సందర్శించి, శుభ్రంచేసే కార్యక్రమంలో వీరితో పాటు విద్యాశాఖ అధికారులు కూడా పాల్గొనాలని ఆదేశించింది. అందుకోసం ఉపయోగించే కెమికల్స్‌, ఇతర పరికరాల గురించి పిల్లలకు చెప్పాలని సూచించింది. శ్రమదానం చేసి మరుగుదొడ్లను శుభ్రం చేయాలని పేర్కొంది. అలాగే పాఠశాలల్లో సేవలందిస్తున్న ఆయాలను అభినందించి, వారిని విద్యార్థులకు పరిచయం చేయాలని ఆదేశించింది. అయితే ఈ ఉత్తర్వుపై వ్యతిరేకత రావడంతో ‘వరల్డ్‌ టాయ్‌లెట్‌ డే’ను శుక్రవారం కాకుండా మరో రోజు నిర్వహించాలంటూ విద్యాశాఖ అధికారులు మళ్లీ ఆదేశాలిచ్చారు. ఆ తర్వాత పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు జోక్యం చేసుకొని వివరణ ఉత్తర్వులు జారీచేశారు. ‘‘ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం మరుగుదొడ్ల ఆవశ్యకత గురించి తల్లిదండ్రులు, విద్యార్థుల్లో అవగాహన కల్పించడమే. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి, సలహాదారు, డైరెక్టర్‌ కూడా పాల్గొంటున్నాం. అయితే ఇది పూర్తిగా స్వచ్ఛందం, ఐచ్ఛికం...’’ అని పేర్కొన్నారు. మరోవైపు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆప్షనల్‌ హాలిడే తీసుకున్న పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని మరో రోజు నిర్వహించాలని సూచించారు.

పౌర్ణమి నాడు.. మరుగుదొడ్ల శుభ్రత కార్యక్రమమా?

ప్రభుత్వ ఆదేశాలపై ఉపాధ్యాయ వర్గాల్లో వ్యతిరేకత


ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా శుక్రవారం (కార్తిక పౌర్ణమి రోజున) ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు, పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సభ్యులు శ్రమదానంతో మరుగుదొడ్లను శుభ్రం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై వివాదం రాజుకుంది. పర్వదినాన పాఠశాలల మరుగుదొడ్లను శుభ్రం చేయడమేమిటంటూ ఉపాధ్యాయుల నుంచి వ్యతిరేకత రావడంతో అధికారులు కొంత వెనక్కి తగ్గారు. కార్తిక పౌర్ణమికి ఐచ్ఛిక సెలవు తీసుకునే పాఠశాలలు మరోరోజు మరుగుదొడ్ల దినోత్సవం జరపాలని, సెలవు లేకపోతే శుక్రవారమే నిర్వహించాలని గురువారం సాయంత్రం పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఇచ్చిన మరో ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం మరుగుదొడ్ల ఆవశ్యకతను వివరించడమేనని, శ్రమదానం స్వచ్ఛందం, ఐచ్ఛికమేనని పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్‌, సలహాదారు మురళి, సంచాలకుడు చినవీరభద్రుడు, మధ్యాహ్న భోజనం సంచాలకుడు దివాన్‌, ఎస్‌ఎస్‌ఏ పీడీ వెట్రి సెల్వి శుక్రవారం కొన్ని పాఠశాలల్లో స్వయంగా శ్రమదానం చేస్తారని వెల్లడించారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో మరుగుదొడ్లు, పరిసరాలు శుభ్రం చేయాలని, ఈ సందర్భాన్ని తెలియజేసే ఫ్లెక్సీలు బడుల్లో ఏర్పాటు చేయాలని ఉత్తర్వుల్లో సూచించారు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Clean the toilets in the school."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0