Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Details of the meeting of the Joint Staff Council Membership Teachers Associations with the Chief Secretary of the School Education Department yesterday (17/11/21) in more detail ...!

పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శితో నిన్నటి రోజు(17/11/21) జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సభ్యత్వ ఉపాధ్యాయ సంఘాల సమావేశ వివరాలు మరింత వివరంగా...!



నిన్నటి రోజు అనగా 17/11/21 బుధవారం.. సాయంత్రం దాదాపు   2 1/2 గం౹౹ల పాటు సి.ఎస్.సి కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ రాజశేఖర్ గారి అధ్యక్షతన సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సభ్య సంఘాలతో సమావేశం సుహృద్భావ వాతావరణంలో జరిగింది. సమావేశంలో ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను చర్చించడం జరిగింది.

 ఉపాధ్యాయుల బోధనకు ఆటంకం కలిగిస్తున్న యాప్ ల భారాన్ని తగ్గించాలని, సాంకేతిక సమస్యలను పరిష్కరించి యాప్ లను సులభతరం చేయాలని కోరగా, విద్యార్థుల హాజరు ఒకే యాప్ ద్వారా సులభతరంగా నమోదు చేయుటకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

టాయిలెట్స్ ఫోటోలు 9 గం౹౹లకే తప్పక అప్లోడ్ చేయవలసిన అవసరం లేదని, రోజులో ఎప్పుడైనా చేయవచ్చునని, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ నందు ఇబ్బందులు తొలగిస్తామని తెలిపారు. 

నెట్వర్క్ సరిగ్గా పనిచేయని ప్రాంతాల్లో ఆఫ్ లైన్ లో హాజరు నమోదుకు, వివరాలు అప్ లోడ్ చేయడానికి అవకాశం కల్పిస్తామని తెలిపారు.

ఫార్మేటివ్ మార్కుల నమోదులో ఇబ్బందులు తొలగించి పాత పద్దతిలో నమోదుకు అవకాశం కల్పిస్తామని తెలిపారు.

స్టూడెంట్ ఇన్ఫో నమోదులో సాంకేతిక ఇబ్బందులు తొలగిస్తామని, సర్వర్ సామర్థ్యం పెంచుతామని తెలిపారు. 

జె.వి.కె కిట్ వివరాల నమోదు, షూ సైజ్ సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు.

యం.డి.యం బియ్యం పాఠశాల పాయింట్ కు చేర్చాలని కోరడం జరిగింది. చిక్కీలు, గుడ్లు పంపిణీపై  ఎవ్వరికి షోకాజ్ నోటీసులు ఇవ్వబోమని, ఎటువంటి చర్యలు ఉండవని హామీ ఇస్తూ, సకాలంలో సరఫరాకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

3,4,5 తరగతుల విలీన సమస్య పరిష్కరించాలని కోరగా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను కేటాయించడానికి సూచనలు చేశామని తెలిపారు. విలీన విద్యార్థులకు అనుగుణంగా అవసరమైన 14,497 తరగతి గదులను 2వ విడత నాడు నేడు క్రింద మంజూరు చేస్తామని చెప్పారు. 

సర్వీస్ రూల్స్, జె.ఎల్ పదోన్నతుల సమస్య పరిష్కరించాలని, నియామకాలలో కోర్టు తీర్పు ననుసరించి ఎమ్.ఏ తెలుగు గలవారిని అనుమతించినట్లు పదోన్నతులలో యం.ఏ తెలుగు అర్హత గల వారిని అనుమతించాలని కోరగా పరిశీలిస్తామన్నారు.

ఉన్నతీకరించిన 400 ఉన్నత పాఠశాలలకు ప్రధానోపాధ్యాయ పోస్టులు వెంటనే మంజూరు చేయాలని కోరగా సానుకూలంగా స్పందించారు.

బీపీఈడీ అర్హత లేక పదోన్నతులు పొందలేని పి.ఇ.టి లకు సమ్మర్ కోర్సు ద్వారా బి పి డి చేసుకునే అవకాశం కల్పించాలని కోరగా పరిశీలిస్తామన్నారు.

2003 డిఎస్సి ఉపాధ్యాయులు, 2002 డీఎస్సీ హిందీ పండితులకు పాత పెన్షన్ వర్తింపజేయాలని కోరగా వివరాలు ప్రభుత్వానికి పంపామని త్వరలో ఉత్తర్వుల విడుదలకు హామీ ఇచ్చారు.

అంతరాష్ట్ర బదిలీలు చేపట్టాలని కోరగా ప్రభుత్వాన్ని అనుమతి కోరామని అనుమతించిన వెంటనే ఉపాధ్యాయుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు.

ఎంఇఓ లకు ఇన్చార్జి బాధ్యతలు తప్పించి ఒకే మండలానికి పరిమితం చేయాలని కోరగా పరిష్కారం ఆలోచిస్తామన్నారు.

ప్రభుత్వంలో లో విలీనమైన ఎయిడెడ్ ఉపాధ్యాయుల ప్రయోజనాలు కాపాడాలని, విలీనం కాని ఎయిడెడ్ ఉపాధ్యాయులకు ప్రభుత్వ ఉపాధ్యాయులకు వర్తించే అన్ని సౌకర్యాలు కల్పించాలని, ఆదర్శ పాఠశాలల ప్రిన్సిపాల్స్ కు డ్రాయింగ్ అధికారం కల్పించాలని కోరడం జరిగింది.

గత బదిలీలలో బ్లాక్ చేయబడిన పోస్టులను ఖాళీలు గా చూపించాలని కోరగా చేపట్టబోయే పదోన్నతులలో చూపిస్తామన్నారు.

అంతర్ జిల్లా బదిలీలు వారం రోజుల్లో పూర్తి చేస్తామన్నారు.

నాడు నేడు విధులలో పాల్గొన్న ఉపాధ్యాయులకు ఆర్జిత సెలవులు మంజూరు చేయాలని కోరగా ప్రభుత్వం నుండి వివరణ వచ్చిన వెంటనే ఉత్తర్వులు ఇస్తామన్నారు.

కడప జోన్ లోని నాలుగు జిల్లాలలో ఎన్నికల కోడ్ కారణంగా ఆగిపోయిన పదోన్నతులు చేపట్టాలని కోరగా చేపడతామన్నారు.

విద్యాశాఖ, ఈ.హెచ్.ఎస్ ట్రస్ట్ వేరు వేరు సాఫ్ట్వేర్ ఉపయోగించడం వల్ల మెడికల్ బిల్లుల మంజూరులో ఎదురవుతున్న ఇబ్బందులు తొలగించుటకు ఒకే రకమైన సాఫ్ట్వేర్ ఉపయోగించుటకు చర్యలు తీసుకుంటామన్నారు.

2008 డీఎస్సీ యం.టి.ఎస్ ఉపాధ్యాయులకు కొన్ని నెలలుగా జీతాలు చెల్లించని విషయం ప్రస్తావించగా ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన వెంటనే జీతాల చేల్లింపుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.                                                23వ తేదీ నుండి జిల్లాలలో పర్యటించి యం.ఇ.ఓలు, హెచ్.ఎంలు, సంఘాల నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసి సమస్యలు తెలుసుకుంటామన్నారు. 

సమావేశంలో 73 సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ముఖ్య కార్యదర్శి గారికి అందచేయడం జరిగింది.

సమావేశంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ వి.చినవీరభద్రుడు, ఎస్.పి.డి శ్రీమతి వెట్రి సెల్వి, ప్రభుత్వ పాఠశాల విద్య మౌలిక సదుపాయాల సలహాదారు శ్రీ ఎ.మురళి, ఎం.డి.ఎం డైరెక్టర్ శ్రీ దివాన్, ఏడిలు శ్రీ సుబ్బారెడ్డి, శ్రీ రవీంద్రనాథ్ రెడ్డి, జెడిలు శ్రీ ప్రతాప్ రెడ్డి, శ్రీ మువ్వా రామలింగం, శ్రీ మధుసూదన్ రావు, డీఎస్సీ అధికారులు పాల్గొనగా, ఎస్.టి.యు పక్షాన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథ్ రెడ్డి, రాష్ట్ర సంయుక్త అధ్యక్షులు కే.సురేష్ బాబు పాల్గొన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Details of the meeting of the Joint Staff Council Membership Teachers Associations with the Chief Secretary of the School Education Department yesterday (17/11/21) in more detail ...!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0