DIPAVALI
దీపాలను ఈ వత్తులతో పెడితే సంపదలు మీ సొంతం అవుతుంది.
దీపం… సాక్షాత్తు శ్రీలక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అయితే దీపారాధన సమయంలో దీపంలో వాడే నూనె లేదా నెయ్యి ఎంత ముఖ్యమో దీపారాధనకు వాడే వత్తులు అంతే ముఖ్యం. ఆయా రకాల పదార్థాలతో తయారుచేసిన వత్తులను వాడటం వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం….
ఎక్కువ శాతం మనం పత్తితో చేసిన వత్తులతో దీపం పెడుతాం. దీనివల్ల మనకు ఆయుష్షు పెరుగుతుంది. ఇక జిల్లేడినారతో దీపము వెలిగించినచో భూత, ప్రేత, పిశాచాల బాధలు పోతాయి. తామరనార పూర్వ జన్మలో చేసిన పాపములు నశించిపోతాయి. ఆరటి నారతో చేసిన వత్తులతో దీపము వెలిగించినచో చేసిన తప్పులు తొలగి కుటుంబమునకు శాంతి, సౌఖ్యం లభిస్తాయి. అంతేకాదు ధనవoతులు అవుతారు. కొత్త తెల్ల వస్త్రమం -పన్నీరులో ముంచి ఆరబెట్టి వత్తులు తయారుచేసి దానితో దీపము వెలిగించిన శుభకార్యములు నిర్వహించే శక్తి వస్తుంది. అదేవిధంగా నూతన పసుపు వస్త్రముతో తయారుచేసిన వత్తులను ఉపయోగించి దీపం వెలిగిస్తే అమ్మవారి అనుగ్రహమునకు లభిస్తుంది. నూతన ఎరుపు వస్త్రముతో తయారుచేసిన వత్తులతో దీపం పెడితే పెండ్లికాని వారికి వివాహ ప్రాప్తి, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. భక్తి, శ్రద్ధలతో పాటు శుచి, శుభ్రతతో దీపారాధన చేయడం చాలా ప్రధానమైన విషయం. ఇవేకాకుండా పలు రకాల వత్తులు అంటే శనిదోష నివృత్తికి నల్లని వత్తులు, కుజగ్రహానికి ఎరుపు, గురుగ్రహదోషనివారణకు పసుపు ఇలా అనేక రకాల వత్తులు మనకు మార్కెట్లో లభిస్తున్నాయి. వాటిని వాడటం వల్ల మనకు ఆయా దోషాలు నివృత్తి అవుతాయి. శుభఫలితాలు వస్తాయి.
0 Response to "DIPAVALI "
Post a Comment