Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

DRDO Recruitment 2021

 DRDO Recruitment 2021: డీఆర్డీఓలో ఉద్యోగాలు.. ఎలాంటి ఎగ్జామ్ లేదు.. కేవలం మార్కుల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక.. వివరాలివే.

DRDO Recruitment 2021

డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు అప్రంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మొత్తం ఖాళీలు : 61

ఇటీవల పలు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వరుసగా జాబ్ నోటిఫికేషన్లు (Job Notifications) విడుదలవుతున్నాయి. తాజాగా ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. సంస్థ నుంచి తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. సంస్థకు చెందిన Terminal Ballistics Research Laboratoryలో 61 ఖాళీలను అప్రంటీస్ విధానంలో భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎలాంటి ఎగ్జామ్ (Exam) లేకుండా కేవలం మెరిట్ ఆధారంగానే ఎంపిక చేపట్టనున్నట్లు నోటిఫికేషన్లో (Notification) స్పష్టం చేశారు. ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు అప్రంటీస్ (Apprenticeship) విధానంలో పని చేయాల్సి ఉంటుందని ప్రకటనలో స్పష్టం చేశారు. ఇంకా.. ఎంపికైన వారికి ఉపకారవేతనంగా నెలకు రూ. 8050 (stipend) చెల్లించనున్నారు.

ఖాళీలు, విద్యార్హతల వివరాలు..

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 61 అప్రంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ కింది ట్రేడ్ లలో ఐటీఐ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ట్రేడ్ ల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.

 అప్లై చేయు విధానం

  • Step 1: అభ్యర్థులు NAPS పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
  • Step 2: అభ్యర్థులు apprenticeshipindia.org పోర్టల్ లో రిజిస్టర్ అయ్యి అన్ని కావాల్సిన సర్టిఫికేట్లను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
  • Step 3: అనంతరం అభ్యర్థులు టెన్త్ క్లాస్ మార్క్ షీట్, ఐటీఐ పాస్ సర్టిఫికేట్&మార్క్స్ షీట్, కాస్ట్ సర్టిఫికేట్, ఐడీ ప్రూఫ్ స్కానింగ్ కాపీలను సింగిల్ పీడీఎఫ్ ఫైల్ లో admintbrI@tbrl.drdo.in మెయిల్ లో పంపించాల్సి ఉంటుంది.
  • Step 4: ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు డిసెంబర్ 20ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు.
  • ఎంపిక విధానం
  • అభ్యర్థులు విద్యార్హత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేపడుతారు.
  • -ఒక వేళ మార్కులు సమానంగా ఉంటే కింది తరగతుల్లో అభ్యర్థులు సాధించిన మార్కులను ప్రామాణికంగా తీసుకుంటారు.
  • -ఎంపికైన అభ్యర్థులకు ఈ-మెయిల్, ఎస్ఎంఎస్, ఫోన్ ద్వారా ట్రైనింగ్ కు సంబంధించిన సమాచారం ఇస్తారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "DRDO Recruitment 2021"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0