Festive Season
Festive Season: పండగ ఆఫర్ల వలలో పడొద్దు!
ఇంటర్నెట్ డెస్క్: దసరా, దీపావళి, క్రిస్మస్, ఆ తర్వాత నూతన సంవత్సరం.. ఇలా వరుసగా వస్తున్న పండగల నేపథ్యంలో ఇ-కామర్స్ సంస్థలు, ఆఫ్‌లైన్ స్టోర్లు ఫెస్టివల్ ఆఫర్ల పేరిట భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తూ వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఇప్పటికే దేశంలో పండగ సీజన్ మొదలైంది. కొనుగోళ్లు పోటెత్తుతున్నాయి. ఈ కార్డుపై ఆఫర్.. ఆ కార్డుపై ఆఫర్ అంటూ ఆయా సంస్థలు ఊరిస్తున్నాయి. వినియోగదారులు సైతం కొనుగోళ్లకు పెద్ద ఎత్తున కొనుగోళ్లకు ముందుకొస్తున్నారు. ఇదే సమయమని కొందరు బహుమతులు ఇవ్వడానికి కొనుగోళ్లు చేస్తుంటే.. మరికొందరు భవిష్యత్‌లో పనికొస్తాయనే ఉద్దేశంతో ముందుగానే కొనుగోలు చేసి పెట్టుకుంటున్నారు. ఓ విధంగా ఈ అలవాటు భవిష్యత్‌లో మీ ఆర్థిక జీవనంపై ప్రభావం చూపొచ్చు. మరి ఈ పోకడ ఎంత వరకు కరెక్ట్? సేల్ అనగానే మనమేం ఆలోచించాలి?
పొదుపు చేస్తున్నారా.. ఖర్చు చేస్తున్నారా..?
మీకు ‘‘Save 33%’’ అని కనిపించినప్పుడు ఖర్చు కంటే ముందు అంత మొత్తం తక్కువకు లభిస్తుందన్న ఆలోచనే వస్తుంది. కానీ 33 శాతం తక్కువకు కొనుగోలు చేసేందుకు.. ఖర్చు చేస్తున్నామన్న విషయం అప్పుడు గుర్తుండదు. వాస్తవానికి, మీరు గమనించినట్లయితే.. ఈ రోజుల్లో మీరు చేసిన కొనుగోళ్ల రసీదులపై తరచుగా ‘మీరు ఈ రోజు రూ.11,125 ఆదా చేసారు!’ లేదా ‘అభినందనలు! మీరు 225 స్టోర్ క్రెడిట్ పాయింట్లను సంపాదించారు! అదనపు డిస్కౌంట్ల కోసం మీరు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ప్రోమో కోడ్‌లను ఉపయోగించినట్లయితే, పొదుపు సంఖ్య మరింత పెరిగేది’ అనే మెసేజ్‌లు చూస్తుంటాం. అలాంటివి చూశాక ఎంత మొత్తం ఖర్చు చేశారన్న విషయమే మర్చిపోతున్నారు. ఈ రకమైన ఆలోచనలను నియంత్రించడం చాలా సులభం. ఖర్చు చేయడం ద్వారా సంపదను కూడబెట్టుకోలేరన్న విషయం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. కేవలం పొదుపు, పెట్టుబడులు చేయడంతోనే ఇది సాధ్యమవుతుంది. ప్రమోషన్ కోడ్‌లు, ఫ్లాస్‌సేల్స్ డిస్కౌంట్ లభించినప్పటికీ తక్కువకు వస్తున్నాయని మీకు అవసరం లేని వస్తువులను కొనుగోలు చేస్తున్నారన్న విషయం తెలుసుకోండి. పొదుపు చేసి కొనుగోలు చేయడానికి.. అప్పు చేసి కొనుగోలు చేయడానికీ మధ్య వ్యత్యాసం ఉందని గమనించండి. అవసరమైన వస్తువును కొనుగోలు చేసేందుకు బడ్జెట్ ప్రకారం పొదుపు చేసి.. డిస్కౌంట్లలో కొనుగోలు చేయడం మంచిది. కానీ అప్పు చేసి ఆదా చేసేందుకు కొనుగోలు చేస్తున్నాం అనడం సరికాదు. ఈ రెండింటికీ మధ్య వ్యత్యాసాన్ని గుర్తించండి.
ఆ డీల్ మీకు సరిపడేదేనా..?
ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ సంస్థలు వినియోగదారులను ఆకర్షించేందుకు వీలైనన్ని ట్రిక్కులు ప్రయోగిస్తాయి. రెండు కొంటే ఒకటి ఉచితం, 80శాతం డిస్కౌంట్, 50శాతం క్యాష్‌బ్యాక్ అని ఆఫర్లను ప్రకటిస్తాయి. దీంతో భారీగా డిస్కౌంట్ వస్తుందనే ఆశతో కొనుగోళ్లకు మొగ్గుచూపుతారు. ఇది కేవలం మిమ్మల్ని ఆకర్షించడానికి మాత్రమే అన్న విషయాన్ని గుర్తించండి. మీకు ఒకటి మాత్రమే అవసరం అయినప్పటికీ, వాటిలో మూడు కలిసి కొనుగోలు చేసినప్పుడు మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఎందుకంటే మీరు ఖర్చు చేసే సొమ్ము కంటే ఎక్కువ విలువైనవి లభిస్తున్నాయని మీరు అనుకుంటున్నారు. ఇలాంటి అలవాట్లు మానుకోవాలంటే కొనుగోలు చేసేముందు ఒకసారి ఆలోచించండి. ఈ వస్తువు నాకు అవసరమా? కొన్ని రోజుల తర్వాత తీసుకుంటే ఏమవుతుంది? దీనికి ఏ విధంగా చెల్లించాలి? కొనుగోలు కారణంగా పెట్టుబడులకు ఆటంకం కలుగుతుందా? ఒకవేళ ఈ వస్తువు ఆఫర్‌లో లేకపోతే నేను కొనుగోలు చేస్తానా? అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఒకవేళ ఈ ప్రశ్నలకు కాదు అని సమాధానం అయితే, కొనుగోలును ఆపేయండి.
సేల్ మిస్ అవుతారా...?
పండగల సమయంలో ఆఫర్లను అందించి ఈ వస్తువులు ఇప్పుడు తీసుకోకపోతే చాలా మిస్ అవుతారు అనే భ్రమను కలిగించడంలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ సంస్థలు విజయవంతం అయ్యాయి. పండగల సమయంలో డిస్కౌంట్‌లో వస్తువులను కొనుగోలు చేస్తే ఏదో సాధించినట్లుగా సంతోషపడుతుంటారు. లిమిటెడ్ స్టాక్‌లో వస్తువు లభించినందుకు ఆనందం వస్తుంది. దీనికంతటికీ కారణం FOMO (fear of missing out mindset). ఇలాంటి ఆలోచనలతో అవసరమైనదానికంటే ఆఫర్ల సమయంలో ఎక్కువ కొనేస్తున్నారు. దీన్ని నియంత్రించేందుకు మీ మొబైల్‌కు వచ్చే డిస్కౌంట్ నోటిఫికేషన్లను చదివేయడం ఆపేయండి. ఆఫర్ గురించి తెలుసుకునేందుకు ఆసక్తి తగ్గించుకోండి. సంస్థ నుంచి వచ్చే మెయిల్స్ అన్ సబ్‌స్క్రైబ్ చేసుకోండి. పండగ కోసం బడ్జెట్‌ను తయారు చేసుకోండి. అవసరమైన వస్తువుల జాబితా వేసుకొని మొత్తం ఒకేసారి కొనేయండి. మీకు అవసరమైనప్పుడు మాత్రమే వస్తువులను ఫ్లాష్ సేల్‌లో తీసుకోండి.
చివరగా..
మీరు పండగలకు ఒక అర్థవంతమైన బడ్జెట్‌ను తయారు చేసుకోండి. ఖర్చుల కంటే పెట్టుబడులకు ఎప్పుడూ మొదటి ప్రాధాన్య
0 Response to "Festive Season"
Post a Comment