Google Messages
Google Messages: Google కొత్త ఫీచర్..మెసేజెస్ నుంచి ఫొటోలు, వీడియోలు పంపొచ్చు
ఇంటర్నెట్‌డెస్క్: ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం Google మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో యూజర్స్ Google ఎస్సెమ్మెస్ యాప్ నుంచే Google ఫొటోస్ ద్వారా ఫొటోలు, వీడియోలు పంపొచ్చు. అయితే ఆర్‌సీఎస్ (రిచ్ కమ్యూనికేషన్స్ సర్వీసెస్) అందుబాటులో లేనప్పుడు మాత్రమే ఈ ఫీచర్‌ను ఉపయోగించగలరని సమాచారం. ప్రస్తుతం ప్రయోగాల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకురానున్నారు.
Google మెసేజెస్ 10.4 అనే బీటా వెర్షన్ ద్వారా ఈ ఫీచర్‌ను ఇతర యూజర్స్ పరీక్షించవచ్చు. Google మెసేజెస్ యాప్ నుంచి ఫొటోలు పంపితే అవతలి వారికి Google ఫొటోస్ లింక్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి ఫొటో లేదా వీడియోను చూడొచ్చు. అలానే హై-క్వాలిటీ వీడియోలు కూడా మెసేజింగ్ యాప్ ద్వారా పంపొచ్చు. ఐఓఎస్ యూజర్స్ మాత్రం ఫొటో లేదా వీడియో చూసేందుకు మెసేజ్‌లో వచ్చిన లింక్‌ను బ్రౌజర్‌లో ఓపెన్ చేయాల్సిందేనట.
క్లౌడ్ షేరింగ్‌తో ఫైల్స్ పంపడం కొత్తేం కాదు. గతంలో శాంసంగ్ లింక్ షేరింగ్ ద్వారా ఫొటోలు, వీడియోలు పంపేవారు. వాటిని యూజర్స్ పరిమిత కాలవ్యవధిలో డౌన్‌లోడ్ చేసుకుని చూడొచ్చు. అయితే ఆండ్రాయిడ్ ఫోన్లలో వీడియో క్వాలిటీకి, ఐఫోన్‌లో వీడియో క్వాలిటీ చాలా వ్యత్యాసం ఉంటుంది. ఫైల్‌ని ఆండ్రాయిడ్ ఫోన్‌లోని మెసేజింగ్ యాప్ ద్వారా ఐఓఎస్ డివైజ్‌లకు పంపితే వీడియో క్వాలిటీలో తేడా ఉంటుందని, అలానే యూజర్స్ వాటిని ఆస్వాదించలేరనే సందేహాన్ని టెక్ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సమస్యకు గూగుల్ ఎలాంటి పరిష్కారం చూపిస్తుందనేది తెలియాల్సివుంది.
0 Response to "Google Messages"
Post a Comment