PAN Card You can easily change your photo or signature on the PAN card. Details.
PAN Card పాన్ కార్డ్‌లో మీ ఫోటో లేదా సిగ్నేచర్ సులువుగా మార్చుకోవచ్చు. వివరాలు.
పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (పాన్) అనేది 10-అంకెల ప్రత్యేక ఆల్ఫాన్యూమరిక్ కోడ్. దీనిద్వారా వ్యక్తి కి సంబంధించిన ఫైనాన్సియల్ హిస్టరీ తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఇది గుర్తింపు కార్డుగా కూడా ఉపయోగపడుతుంది. మీ ఫోటోగ్రాఫ్ సంతకాన్ని ధృవీకరించడానికి PAN కార్డ్ ఉపయోగించబడుతుంది కాబట్టి ఇందులో నమోదు చేసిన సమాచారం ఖచ్చితంగా ఉండాలి. క్రెడిట్ కార్డ్ లేదా లోన్ తీసుకోవడానికి లేదా పెట్టుబడులు పెట్టడానికి మీ పాన్ కార్డ్‌పై మీ ఫోటో ,సంతకం ఖచ్చితంగా ఉండాలి. మీరు మీ పాన్ కార్డ్‌లో ఫోటో లేదా సంతకంలో ఏదైనా వ్యత్యాసాన్ని కనుగొంటే కనుక మీరు PAN కార్డ్‌లోని ఫోటో,సంతకాన్ని మార్చడానికి లేదా అప్ డేట్ చేయాలంటే ఇలా..చేయండి.. !
PAN కార్డ్‌లోని ఫోటో,సంతకాన్ని మార్చడానికి లేదా అప్ డేట్ చేయు విధానం.
- ఎన్ఎస్డీల్ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయండి..
- ఆ తర్వాత అప్లికేషన్ టైప్ ఎంపికపై క్లిక్ చేసి ఇప్పటికే ఉన్న పాన్ డేటా ఎంపికలో మార్పులు లేదా సవరణను ఎంచుకోవాలి.
- కేటగిరి మెను నుంచి వ్యక్తిగత ఎంపికను ఎంచుకోండి.
- ఆ తర్వాత అవసరమైన మొత్తం సమాచారాన్ని పూర్తిచేసి, సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
- ఇప్పుడు పాన్ అప్లికేషన్‌కు వెళ్లి KYC ఎంపికను ఎంచుకోండి.
- ఆ తర్వాత ‘ఫోటో నాట్ మ్యాచ్ ‘ అండ్ ‘సిగ్నేచర్ నాట్ మ్యాచ్’ ఎంపికను కనుగొంటారు. ఇక్కడ మీరు ఫోటోను మార్చడానికి ‘ఫోటో నాట్ మ్యాచ్’ ఎంపిక మీద క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీ తల్లిదండ్రుల వివరాలను ఫిలిప్చేసిన తర్వాత నెక్స్ట్ బటన్‌పై క్లిక్ చేయండి.
- మొత్తం సమాచారాన్ని పూరించిన తర్వాత దరఖాస్తుదారుడి ఐడెంటి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ను అటాచ్ చేయాలి.
- అనంతరం డిక్లరేషన్‌ను టిక్ చేసి సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
- ఫోటో అండ్ సిగ్నేచర్ లో మార్పు కోసం దరఖాస్తు రుసుము జీ ఎస్టీతో కలిపి రూ.101 చెల్లించాలి.
- ఈ ప్రక్రియ మొత్తం పూర్తి అయిన తర్వాత 15-అంకెల రిసిప్ట్ వస్తుంది.
- అప్లికేషన్ ప్రింటౌట్‌ను ఆదాయపు పన్ను పాన్ సర్వీస్ యూనిట్‌కి పంపండి.
- దరఖాస్తును రసీదు సంఖ్య నుండి ట్రాక్ చేయవచ్చు.
0 Response to "PAN Card You can easily change your photo or signature on the PAN card. Details."
Post a Comment