Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Review on Education: CM Jagan

విద్యాశాఖ పై సమీక్ష : సీఎం జగన్

Review on Education: CM Jagan

  • సీబీఎస్‌ఈ అఫిలియేషన్
  • ఇంగ్లీష్‌పై ప్రత్యేక శ్రద్ధ
  • టీచర్లకు అత్యంత నాణ్యమైన శిక్షణ
  • స్కూళ్లో సదుపాయాలపై ఏమైనా సమస్యలు, ఇబ్బందులు ఉంటే వెంటనే కాల్‌చేసేలా ఒక నంబర్‌
  • ఎయిడెడ్ పూర్తిగా స్వచ్ఛందం
  • మరుగుదొడ్లు నిర్వహణ
  • గోరుముద్దపై ఫీడ్‌ బ్యాక్‌
  • లెర్న్‌ టు లెర్న్‌ కాన్సెప్ట్‌... పై సమీక్ష చేసిన సీఎం జగన్
  • విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణల అమలుపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష

నూతన విద్యా విధానం అమలుపైనా సీఎం సమగ్ర సమీక్ష

క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహంచిన సీఎం

శాటిలైట్‌ఫౌండేషనల్‌ స్కూల్స్, ఫౌండేషనల్‌ స్కూల్స్, ఫౌండేషనల్‌ ప్లస్‌స్కూల్స్, ప్రీ హైస్కూల్స్, హైస్కూల్స్, హైస్కూల్‌ ప్లస్‌ స్కూల్స్‌పై సీఎంకు వివరాలు అందించిన అధికారులు

నూతన విద్యా విధానంలో తీసుకున్న చర్యలు వాటి అమలుపై సీఎం ఆరా

విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లను నియమించడంతోపాటు, సబ్జెక్టుల వారీగా టీచర్లు, వారితో బోధనే లక్ష్యంగా నూతన విద్యా విధానం

2021–22 నుంచి 2022–23, 2023–24 వరకూ మూడు విద్యా సంవత్సరాల్లో  మూడుదశలుగా పూర్తిగా అమలు కానున్న నూతన విద్యా విధానం

దీంట్లో భాగంగా 25,396 ప్రైమరీ పాఠశాలలను యూపీ (అప్పర్ ప్రైమరీ) స్కూళ్లు, హైస్కూళ్లలో విలీనం 

తొలిదశలో భాగంగా ఈ విద్యా సంవత్సరం 2663 స్కూళ్లు  విలీనం చేశామని తెలిపిన అధికారులు

2,05,071 మంది విద్యార్థులు నూతన విద్యావిధానం అనుసరించి విలీనం అయ్యారన్న అధికారులు

మొత్తంగా  ఈ ప్రక్రియలో 9.5 లక్షల మంది విద్యార్థులకు నూతన విద్యావిధానం ఈసంవత్సరమే అందుబాటులోకి వచ్చిందన్న అధికారులు

ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్ ఏమన్నారంటే.

రానున్న విద్యా సంవత్సరంలో నూతన విద్యావిధానం అమలు చేయడానికి అవసరమైన చోట్ల అదనపు తరగతి గదుల నిర్మాణంపై దృష్టిపెట్టాలి : సీఎం ఆదేశం

దీనికి సంబంధించిన కార్యాచరణ పూర్తిచేసి వెంటనే పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం

మొత్తం ప్రక్రియ పూర్తయ్యేనాటికి అవసరమైన టీచర్ల సంఖ్యను కూడా గుర్తించాలని సీఎం ఆదేశం

సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌మీద కూడా సీఎం సమీక్ష

1092 స్కూల్స్‌ 2021–22 విద్యా సంవత్సరంలో సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ జరిగాయని వివరించిన అధికారులు

ఈ విద్యార్థులు 2024–25 నాటికి పదోతరగతి పరీక్షలు రాస్తారన్న విద్యార్థులు

అంతర్జాతీయంగా 24వేల స్కూళ్లకు మాత్రమే సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ ఉందని తెలిపిన అధికారులు

ఒక దేశంలో ఒక ఏడాది, అదికూడా ఒక రాష్ట్రంలో 1092 స్కూళ్లకు సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ ఇవ్వడం రికార్డని తెలిపిన అధికారులు

టీచర్‌ ట్రైనింగ్‌ ఇస్తున్న డైట్‌ సంస్థల సమర్థత పెంచాలని సీఎం ఆదేశం

టీచర్లకు అత్యంత నాణ్యమైన శిక్షణ అందాలన్న సీఎం

టీచర్లకు శిక్షణకార్యక్రమాలపై వచ్చే సమావేశంలో వివరాలు అందించాలని సీఎం ఆదేశం

స్కూళ్లో సదుపాయాలపై ఏమైనా సమస్యలు, ఇబ్బందులు ఉంటే వెంటనే కాల్‌చేసేలా ఒక నంబర్‌ పెట్టాలన్న సీఎం

ప్రతి స్కూళ్లో అందరికీ కనిపించేలా ఈ నంబర్‌ను ప్రదర్శించాలన్న సీఎం

ఈ కాల్‌సెంటర్‌ను అధికారులు పర్యవేక్షణ చేసిన వారినుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుని, తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన సీఎం

ఇంగ్లీషు పై ప్రత్యేక శ్రద్ధ

  • ఇంగ్లిషు ఉచ్ఛారణ, భాష, వ్యాకరణాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న సీఎం
  • దీనికోసం పాఠ్యప్రణాళికలో దృష్టిపెట్టాలన్న సీఎం
  • పిల్లలకు ఇదివరకే డిక్షనరీలు ఇచ్చామని, వాటిని వినియోగించుకోవాలన్న సీఎం
  • ప్రతిరోజూ కనీసం మూడు పదాలు నేర్పించాలని, ఆ పదాలను వినియోగించడంపై పిల్లలకు నేర్పించాలన్న సీఎం
  • ఎయిడెడ్‌ పాఠశాలలను ప్రభుత్వానికి అప్పగించడం అన్నది పూర్తిగా స్వచ్ఛందం అని సమావేశంలో మరోసారి స్పష్టంచేసిన సీఎం
  • వివిధ కారణాలతో నడుపుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారికి ప్రభుత్వం ఒక అవకాశం మాత్రమే కల్పిస్తుందన్న సీఎం
  • ఇష్టం ఉన్నవారు, స్వచ్ఛందంగా ప్రభుత్వంలో విలీనంచేయొచ్చని, లేదంటే యథాప్రకారం నడుపుకోవచ్చని మరోసారి స్పష్టంచేసిన సీఎం
  • విలీనంచేస్తే.. వారి పేర్లు కొనసాగిస్తామని తెలిపిన సీఎం
  • ప్రభుత్వంలో విలీనానికి ముందు అంగీకరించిన వారు... నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని నడుపుకుంటామంటే.. నిరభ్యంతరంగా వెనక్కి తీసుకోవచ్చన్న సీఎం
  • విద్యార్థులకు మంచి సదుపాయాలు, నాణ్యమైన విద్య అందాలన్నదే ఉద్దేశమని స్పష్టంచేసిన సీఎం
  • ఈ ప్రక్రియలో ఎక్కడా బలవంతంలేదని, ఈ విషయంలో అపోహలకు గురికావొద్దని, రాజకీయాలుకూడా తగవని స్పష్టంచేసిన సీఎం.

మరుగుదొడ్లు నిర్వహణ

మన ఇంట్లో మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండాలని ఎలా అనుకుంటామో.. పిల్లలు చదివే పాఠశాలల్లో కూడా మరుగుదొడ్లు అలాగే ఉండాలన్న సీఎం

నాణ్యమైన సదుపాయాలు అన్నది అందరి లక్ష్యం కావాలన్న సీఎం

అందుకనే పాఠశాలల్లో మరుగుదొడ్ల స్థితిగతులపై తనిఖీలు చేయాలన్న సీఎం

టాయిలెట్స్‌లో ట్యాప్‌లు పనిచేయక, నీళ్లు రాక... అవి చివరకు దుర్గంధంతో నిండిపోయి ఎవరూ వినియోగించని పరిస్థితులు చూశామన్న సీఎం

అలాంటి పరిస్థితులను నాడు – నేడు ద్వారా మార్చాం

ఇప్పడు వాటిని సరిగ్గా పర్యవేక్షించి పిల్లలకు మంచి వాతావరణం అందుబాటులో ఉండాలి

పాఠశాలలకు హెడ్‌మాస్టర్లు కుటుంబ పెద్దలు

ఆ పాఠశాలల్లో నాణ్యమైనరీతిలో బోధన దగ్గరనుంచి మొదలు భోజనం నుంచి ఇతర సదుపాయాలు, మౌలిక వసతులపై తనిఖీలు చేసి... వాటిని సవ్యంగా ఉండేలా వారుచూడాలని, ఆవిధంగా హెడ్మాస్టర్లను చైతన్యం చేయాలన్న సీఎం

ప్రతిరోజూ మానిటరింగ్‌ జరగాలన్న సీఎం

గోరుముద్దపై ఫీడ్‌ బ్యాక్‌

గోరుముద్దపై క్రమం తప్పకుండా ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవాలని సీఎం ఆదేశం

పిల్లలనుంచి, తల్లులనుంచి తప్పకుండా ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలన్న సీఎం

ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా, ఎక్కడ సమస్య ఉన్నా వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం

కలెక్టర్లు, జేసీలు, అధికారులు తప్పనిసరిగా గోరుముద్ద అమలును పర్యవేక్షించాలన్న సీఎం

స్వయంగా వారు భోజనం చేసి నాణ్యతను పరిశీలించాలన్న సీఎం

లెర్న్‌ టు లెర్న్‌ కాన్సెప్ట్‌ను పాఠ్యప్రణాళికలో తీసుకురావాలన్న సీఎం

ఇంటర్నెట్, ఎలక్ట్రానిక్‌ పరికరాల ద్వారా వివిధ అంశాలను నేర్చుకోవడం, వాటిని ఇతరులకు నేర్పించడం లాంటి కాన్సెప్ట్‌ను పిల్లలకు నేర్పించాలి : అధికారులకు సీఎం నిర్దేశం

ఈ సమీక్షా సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్, మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్‌ అనురాధ, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ (ఎండిఎం అండ్‌ శానిటేషన్‌) బి ఎం దివాన్, మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ కృతికా శుక్లా, సర్వశిక్షా అభయాన్‌ స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ వెట్రిసెల్వి, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి చినవీరభద్రుడు, ఏపీఆర్‌ఈఐఎస్‌ సెక్రటరీ వి రాములు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Review on Education: CM Jagan"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0