Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Teaching as a lip top

లిప్ టాప్ గా  బోధన

Teaching as a lip top

  • 100 రోజులు .. 500 పదాలు
  • త్రిభాషా సామర్థ్యం పెంపునకు స్కూళ్లలో ప్రత్యేక కార్యక్రమం
  • 10 నుంచి శ్రీకారం
  • 100 రోజుల పాటు ప్రణాళిక అమలు

పిల్లల్లో భాషా సామర్థ్యం పెంచేందుకు ఓ కార్యక్రమాన్ని సిద్ధం చేశారు . వంద రోజుల్లో 500 పదాలు నేర్పించేలా దీనిని రూపొందించారు . కోవిడ్ కారణంగా అభ్యస నంలో ఏర్పడిన లోటును భర్తీ చేసేందుకు దోహదపడే ఈ కార్యక్రమాన్ని లాంగ్వేజ్ ఇంప్రూ వ్మెంట్ ప్రోగ్రామ్ ( లిప్ ) గా వ్యవహరించను న్నారు . 1 నుంచి 10 తరగతుల విద్యార్థులకు రోజూ తెలుగు , హిందీ , ఇంగ్లిష్ భాషల్లో కొన్ని పదాలు నేర్చిస్తారు . 1.2 తరగతుల వారికి తెలుగు , ఇంగ్లిష్ లో రోజుకు 2 చొప్పున , 3 నుంచి పదో తరగతి వరకూ విద్యార్థులకు మూడు భాషల్లో 5 చొప్పున పదాలు నేర్పిస్తారు . జగనన్న విద్యాకానుక డిక్షనరీలో ఈ పదాలు ఉంటాయి . వంద రోజుల పాటు ప్రయోగా త్మకంగా మూడు జిల్లాల్లో లిప్ అమలు చేయనున్నారు.

సుమారు 200 నుంచి 500 పదాలు తెలిసి భాషపై పట్టు సాధించేలా చూస్తారు . ఉచ్ఛారణ దోషాలను కూడా సవరించనున్నారు

పాఠశాలల్లో అమలు ఇలా .

  • ప్రతి పాఠశాలలో రోజూ 5 నిమిషాలు లిప్ కోసం కేటాయిస్తారు . 
  • బోర్డుపై పదాలు కనిపించేలా ఉంచి , మెదడుపై ముద్ర వేసేలా చూస్తారు .  
  • భాషా ఉపాధ్యాయులు ఈ బాధ్యతలను నిర్వర్తిస్తారు .
  • 1 , 2 ఒక గ్రూప్ .. 3 , 4 , 5 తరగతులు మరో గ్రూప్ . 6 , 7 , 8 తరగతులు ఇంకో గ్రూప్ ... 9 , 10 తరగతులను ఇంకో గ్రూప్ ను విభజించి అభ్యసనా సామర్థ్యాలు పెరుగుతాయి లిప్ కార్యక్రమం భాషా నైపుణ్యాల సాధనకు ఉపకరించే అద్భుతమైన కార్యక్రమం . 
  • ప్రతి పిరియడ్లోనూ అంత ర్భాగమే కనుక ఉపాధ్యాయునికి భారమయ్యే అవకాశం లేదు. 

విధానం

  • ఈ నెల 10 నుంచి మార్చి 31 వరకూ లిప్ అమలు చేస్తారు . 
  • వారానికోసారి 15 పదాలకు 15 మార్కులకు 10 నిమిషాల వ్యవధిలో స్వయం నిర్ధారణ పరీక్ష నిర్వహిస్తారు .
  • 13 నుంచి 15 మార్కులు సాధించిన విద్యార్థికి ఎ . 
  • 10 నుంచి 12 వస్తే బి 7 నుంచి 9 వస్తే సి , 4 నుంచి 6 వస్తే డి , 4 కంటే తక్కువ వస్తే ఇ గ్రేడుగా కేటాయిస్తారు . 
  • ప్రతి వారం అధికారులు సమీక్షించి వివరాలను ఆర్జేడీకి నివేదించాలి . 
  • 85 నుంచి 100 శాతం సగటు వచ్చిన విద్యార్థుల స్కూలుకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తారు . 
  • మిగిలిన స్కూళ్లకు కూడా రేటింగ్ ఉంటుంది . 
  • ఆ మెరుగైన ఫలితాలు సాధించిన స్కూలుకు సర్టిఫి కెట్ ఇస్తారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Teaching as a lip top"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0