The AP government released the holiday calendar
సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
మరో నెలలో మనం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. 2021 ఏడాదికి గుడ్‌బై చెప్పి 2022 సంవత్సరానికి స్వాగతం పలకబోతున్నాం. ఈ నేపథ్యంలో విద్యార్థులు, ఉద్యోగులకు వచ్చే ఏడాది సెలవులపై ఆసక్తి ఉంటుంది.
ఈ మేరకు 2022 సంవత్సరానికి సెలవుల క్యాలెండర్‌ను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. జాబితాలో ప్రభుత్వ కార్యాలయాలకు 17 సాధారణ, 18 ఆప్షనల్ హాలీడేస్ ఇచ్చారు.
సాధారణ సెలవులు:
జనవరి 14-భోగి, జనవరి 15-సంక్రాంతి, జనవరి 26-రిపబ్లిక్ డే, మార్చి 1-మహాశివరాత్రి, మార్చి 18-హోలీ, ఏప్రిల్ 2-ఉగాది, ఏప్రిల్ 5-బాబూ జగ్జీవన్‌రాం జయంతి, ఏప్రిల్ 14-అంబేద్కర్ జయంతి, ఏప్రిల్ 15-గుడ్‌ఫ్రైడే, మే 3-రంజాన్, ఆగస్టు 9-మొహర్రం, ఆగస్టు 15- ఇండిపెండెన్స్ డే, ఆగస్టు 19-కృష్ణాష్టమి, ఆగస్టు 31-వినాయకచవితి, అక్టోబర్ 3-దుర్గాష్టమి, అక్టోబర్ 5-విజయదశమి, అక్టోబర్ 24-దీపావళి
ఆదివారం వచ్చిన సాధారణ సెలవులు
జనవరి 16-కనుమ, ఏప్రిల్ 10-శ్రీరామనవమి, జూలై 10- బక్రీద్, అక్టోబర్ 2-గాంధీ జయంతి, అక్టోబర్ 9-మిలాద్ ఉన్ నబీ, డిసెంబర్ 25-క్రిస్మస్
GENERAL HOLIDAYS LIST-2022
OPTIONAL HOLIDAYS LIST-2022
0 Response to "The AP government released the holiday calendar"
Post a Comment