Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

10th class qualification jobs

 10th class qualification jobs: ప‌దో త‌ర‌గ‌తి విద్యార్హ‌త‌తో ఉద్యోగాలు.. జీతం రూ.25,500.. అప్లికేష‌న్ ప్రాసెస్‌.

10th class qualification jobs

ప‌దో త‌ర‌గతి విద్యార్హ‌త‌తో ఎన్నో ప్ర‌భుత్వ ఉద్యోగాలు ఉంటాయి. తాజాగా ప‌దోత‌ర‌గ‌తి విద్యార్హ‌త‌తో ఓ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (Border Security Force)లో కానిస్టేబుల్ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తున్నారు. ఈ ద‌ర‌ఖాస్తుల స‌మ‌ర్ప‌న‌కు డిసెంబ‌ర్ 29, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థుల కోసం ద‌ర‌ఖాస్తు వివ‌రాలు.

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (Border Security Force)లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల అయ్యింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా కానిస్టేబుల్‌లో ప‌లు విభాగాల్లో అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నున్నారు. గ్రూప్ సి విభాగంలోకి వ‌చ్చే ఈ పోస్టులకు ఆన్‌లైన్ (Online) ద్వారా ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.21700 నుంచి రూ.69100 వరకు జీతం ఇవ్వబడుతుంది. కాగా, ఏఎస్‌ఐ పోస్టుకు రూ.29200 నుంచి రూ.92300, హెచ్‌సీ పోస్టుకు రూ.25500 నుంచి రూ.81100 వరకు జీతం ఇవ్వనున్నారు. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి డిసెంబ‌ర్ 29, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. నోటిఫికేష‌న్‌, ద‌ర‌ఖాస్తు విధానం కోసం అధికారిక వెబ్‌సైట్ https://rectt.bsf.gov.in/#bsf-current-openings ను సంద‌ర్శించాల్సి ఉంటుంది.

పోస్టుల వివ‌రాలు మరియు అర్హ‌త‌లు

పోస్టు పేరుఖాళీలుఅర్హ‌త‌లుజీతం
కానిస్టేబుల్‌ (సీవర్‌మ్యాన్‌)2అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి. వయస్సు 18 సంవత్సరాలు , గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు ఉండాలి.రూ.21700 నుంచి రూ.69100
కానిస్టేబుల్‌ (జనరేటర్‌ ఆపరేటర్‌)24అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి. వయస్సు 18 సంవత్సరాలు , గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు ఉండాలి.రూ.21700 నుంచి రూ.69100
కానిస్టేబుల్‌ (జనరేటర్‌ మెకానిక్‌)28అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి. వయస్సు 18 సంవత్సరాలు , గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు ఉండాలి.రూ.21700 నుంచి రూ.69100
కానిస్టేబుల్‌ (లైన్‌మన్‌)11అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి. వయస్సు 18 సంవత్సరాలు , గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు ఉండాలి.రూ.21700 నుంచి రూ.69100
ఏఎస్‌ఐ1గుర్తింపు పొందిన యూనివ‌ర్సిటీలో ప‌దో త‌ర‌గ‌తి పాసై ఉండాలి. సివిల్‌లో డిప్ల‌మా కోర్సు, డ్రాఫ్ట్‌మెన్‌షిప్‌ చేసి ఉండాలి.వయస్సు 18 సంవత్సరాలు , గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు ఉండాలి.రూ.29200 నుంచి రూ.92300
హెచ్‌సీ6అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి. వయస్సు 18 సంవత్సరాలు , గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు ఉండాలి.రూ.25500 నుంచి రూ.81100

ఎంపిక విధానం.

ద‌ర‌ఖాస్తు చేసుకొన్న అభ్య‌ర్థుల‌కు రాత ప‌రీక్ష నిర్వ‌హిస్తారు.

కెట‌గిరీల వారీగా అర్హ‌త మార్కులు సాధించాలి.

ఎంపికైన వారికి డాక్యుమెంట్ వెరిఫికేష‌న్ చేస్తారు.

అనంత‌రం ఫిజిక‌ల్ స్టాండ‌ర్డ్ టెస్ట్ (PHYSICAL STANDARDS TEST) నిర్వహిస్తారు.

ఇవ్వ‌న్ని ఉత్తీర్ణ‌త సాధించిన వారిని తుది ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం

  • Step 1 :  ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తిగా ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో ఉంటుంది.
  • Step 2 :  ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://rectt.bsf.gov.in/#bsf-current-openings ను సంద‌ర్శించాలి.
  • Step 3 :  అనంత‌రం నోటిఫికేష‌న్ పూర్తిగా చ‌ద‌వాలి (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)
  • Step 4 :  నోటిఫికేష‌న్ చ‌ద‌విన త‌రువాత Apply Here క్లిక్ చేయాలి.
  • Step 5 :  అనంత‌రం https://rectt.bsf.gov.in/registration/basic-details?guid=3d4da058-cf5b-12eb-bafc-fc017s9a1ba9 లింక్‌లోకి వెళ్లాలి.
  • Step 6 :  అవ‌స‌రం అయిన స‌మాచారం అందించి ద‌ర‌ఖాస్తు నింపాలి.
  • Step 7 :  ద‌ర‌ఖాస్తు పూర్తి చేసిన త‌రువాతం అప్లికేష‌న్ ప్రింట్ తీసుకొని దాచుకోవాలి.
  • Step 8 :  ద‌ర‌ఖాస్తుకు డిసెంబ‌ర్ 29, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "10th class qualification jobs"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0