Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Alert for PM Kisan farmers .. If this KYC is not done, Rs 2 thousand will not come ...!

పీఎం కిసాన్ రైతులకు అలర్ట్.. ఈ కేవైసీ చేయకపోతే రూ.2 వేలు రానట్లే...!

Alert for PM Kisan farmers .. If this KYC is not done, Rs 2 thousand will not come ...!

PM KISAN E-KYC : నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రభుత్వ పథకాన్ని తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ పీఎం కిసాన్ పథకం కింద ప్రతి ఏడాది మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున ఏడాదికి రూ.6 వేలను రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఈ ఏడాది కూడా ప్రధానమంత్రి కిసాన్ సమాధి నిధి (Pm kisan) కింద 10వ విడత నగదును అతి త్వరలో రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతో

అయితే ఈసారి రైతుల ఖాతాల్లో 10వ విడత డబ్బులు జమ చేయడానికి ముందు సరి కొత్త రూల్ అమల్లోకి తీసుకువచ్చింది. ఈ పద విడత 2000 రైతుల ఖాతాలలో జమ చేయాలంటే కచ్చితంగా ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ కేవైసీ పక్రియలో భాగంగా రైతులు తమ ఆధార్ నెంబర్ ను ప్రధానమంత్రి కిసాన్ ఖాతాతో అనుసంధానం చేయాలని, లేకపోతే ఈ విడత డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కావు అని తెలిపింది. ఈ కేవైసి అనేది రెండు రకాలుగా చేయవచ్చు.

ఆధార్ మొబైల్ నెంబర్ ద్వారా ఓటీపీ ద్వారా ఈ కేవైసీ ప్రక్రియ విధానం 

  • మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ తో లింక్ అయిన వారు మాత్రమే ఈ విధానం ద్వారా ఈ కేవైసీ చేయవచ్చు.
  • మొదట పీఎం కిసాన్ అధికార వెబ్ సైట్ ఓపెన్ చేయండి.
  •  ఇప్పుడు పీఎం కిసాన్ హోం పేజీలో కనిపించే ఈ కేవైసి ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  •  ఆ తర్వాత ఆధార్ కార్డు నెంబర్, captcha కోడ్ నమోదుచేసి  సెర్చ్ మీద క్లిక్ చేయగానే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
  • ఆ తర్వాత ఆధార్ కార్డు అనుసంధానం ఐన మొబైల్ నెంబర్ నమోదు చేసే Get OTP  క్లిక్ చేయండి.
  • ఇప్పుడు మీ మొబైల్ నెంబర్ కి వచ్చే ఓటిపి నమోదు చేసి Submit for Auth మీద నొక్కండి.
  • ఇప్పుడు మీ ఆధార్ నెంబర్ ప్రధానమంత్రి కిసాన్ ఖాతాలో లింక్ అవుతుంది.
  • మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ లింక్ కానివరు ఈ కేవైసీ పూర్తి చేయడం కోసం మీ దగ్గరలోని CSC కేంద్రాన్ని సందర్శించండి. ఆ తర్వాత వారితో పీఎం కిసాన్ ఈ కేవైసీ కోసం వచ్చినట్లు చెప్పండి. మీ బయోమెట్రిక్ తీసుకొని పీఎం-కిసాన్ ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు.

Pm kisan payment Status 

ఈ క్రింద ఇవ్వబడిన లింకును క్లిక్ చేసుకొని పీఎం కిసాన్ సమ్మాన్ నిధి మీ అకౌంట్ లో పడిందో లేదో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.

రైతు యొక్క ఆధార్ నెంబరు లేదా ఫోన్ నెంబరు మరియు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి పేమెంట్ స్టేటస్ తెలుసుకోవచ్చును.

Check Pm kisan payment Status


  Note :- కేవైసీ చేసేది తెలియకుండా ఉంటే ఈ క్రింది లింక్ ని క్లిక్ చేసుకొని వీడియో రూపంలో ఈ కేవైసీ మీరే మీ మొబైల్లో చేసుకోగలరు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Alert for PM Kisan farmers .. If this KYC is not done, Rs 2 thousand will not come ...!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0