AP: Education Guidelines .. Rules for the replacement of 'KGBV' posts
AP : విద్యాశాఖ మార్గదర్శకాలు .. ' కేజీబీవీ ' పోస్టుల భర్తీకి రూల్స్
- నియామకాలపై విద్యాశాఖ మార్గదర్శకాలు
- ఈ పోస్టులన్నీ మహిళలకు మాత్రమే
- రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్ల ప్రకారం పోస్టుల కేటాయింపు
- విద్యార్హతలు, మెరిట్, కేటగిరీ ప్రాతిపదికన నియామకాలు
- రెండేళ్లకు తక్కువ కాకుండా కేజీబీవీల్లో పనిచేసిన వారికి ప్రాధాన్యం
ఏడాది ఒప్పందం.. ఆపై షరతులతో పొడిగింపు
కేజీబీవీల్లో బోధనకు ఎంపికైన అభ్యర్థులకు అధికారికంగా నియామక ఉత్తర్వులు జారీ చేయరు. కౌన్సెలింగ్‌లో వారికి కేటాయించిన కేజీబీవీలో రిపోర్టు చేయాలని మాత్రమే సూచిస్తారు. అక్కడ వారు ఎంవోయూపై సంతకం చేయాల్సి ఉంటుంది. ఈ నియామక ఒప్పందం 12 నెలలకే పరిమితం. విద్యా సంవత్సరం చివరి రోజుతో అది ముగుస్తుంది. తదుపరి
విద్యాసంవత్సరాలకు తిరిగి కొనసాగింపుపై కొత్త ఒప్పందం సంతృప్తికరమైన పనితీరు, ఆంగ్ల మాధ్యమంలో బోధనా సామర్థ్యం తదితరాలపై ఆధారపడి ఉంటుంది. ఆంగ్ల మాధ్యమంలో బోధనా సామర్థ్యం లేకున్నా, పేలవమైన పనితీరు ఉన్నా, నిధుల దుర్వినియోగం లాంటి ఇతర ఆరోపణలున్నా విద్యాసంవత్సరంలో ఏ సమయంలోనైనా ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండానే ఒప్పందాన్ని రద్దు చేస్తారు.
ఈ పోస్టులలో నియమించే అభ్యర్థులకు భవిష్యత్తులో క్రమబద్ధీకరణ కోరే హక్కు గానీ, దావా వేసే వీలు కానీ ఉండదు. పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా నైట్ డ్యూటీలు నిర్వర్తించేందుకు అంగీకారం తెలపాలి. వీరికి కేంద్ర ప్రభుత్వ కమ్యూనిటీ ఎయిడ్, స్పాన్సర్‌షిప్ ప్రోగ్రాం (సీఏఎస్‌పీ) మార్గదర్శకాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వంపై ఎలాంటి అదనపు భారం పడకుండా వేతనాలను ఖరారు చేస్తారు. కేంద్ర ప్రాయోజిత పథకాల కాలవ్యవధికి లోబడే ఈ కాంట్రాక్టు, పార్ట్ టైమ్ పోస్టుల కొనసాగింపు ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు కౌన్సెలింగ్ తేదీ రోజు హాజరుకాకపోయినా, కేటాయించిన కేజీబీవీలో 15 రోజుల లోపు చేరకున్నా నియామకాన్ని రద్దు చేసి తదుపరి మెరిట్ అభ్యర్థిని ఎంపిక చేస్తారు.
0 Response to "AP: Education Guidelines .. Rules for the replacement of 'KGBV' posts"
Post a Comment