Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP Govt Talks with Employees Union

 AP Govt Talks with Employees Union : నేడు ఉద్యోగ సంఘాలతో మరోమారు ప్రభుత్వం చర్చలు.

AP Govt Talks with Employees Union

AP Govt Talks with Employees Union: ఈరోజు మరోసారి ఉద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపనుంది. ఈ మేరకు పలు ఉద్యోగ సంఘాలను చర్చలకు ఆహ్వానించింది. సీఎస్ సమీర్ శర్మ నేతృత్వంలో ఆర్ధిక శాఖ అధికారులతో ఈ సమావేశం ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది.

AP Govt Talks with Employees Union: పీఆర్సీ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం మరోమారు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపనుంది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో భాగస్వాములైన ఉద్యోగ సంఘాల నేతలంతా ఇవాళ (బుధవారం) సాయంత్రం ఐదు గంటలకు సచివాలయంలో జరిగే సమావేశానికి హాజరు కావాలని ఆర్థిక శాఖలోని మానవ వనరుల విభాగం ముఖ్యకార్యదర్శి సమాచారం పంపారు. సీఎస్ సమీర్ శర్మ నేతృత్వంలో ఆర్ధిక శాఖ అధికారులతో ఈ సమావేశం ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీ సచివాలయంలోని రెండో బ్లాక్ లో ఈ సమావేశం నిర్వహించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఆర్థిక శాఖ అధికారులతో నిర్వహించే ఈ సమావేశంలో శాఖలవారీగా అంశాలపై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చించనుంది. పీఆర్సీ పై ఇప్పటికే అధికారుల కమిటీతో సమీక్షించిన సీఎం.. మరోమారు ఉద్యోగ సంఘాలతో చర్చించి ప్రతిపాదనలు తీసుకురావాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే సీఎస్ అధ్యక్షతన రేపు సమావేశం జరుగనుంది.

ప్రభుత్వం నుంచి సమాచారం అందింది - బండి శ్రీనివాసరావు

AP NGO President Bandi Srinivasa Rao On PRC: ఉద్యోగుల డిమాండ్లపై కార్యదర్శుల సమావేశం రేపు నిర్వహిస్తామని ప్రభుత్వం సమాచారం పంపిందని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఉద్యోగుల విజ్ఞప్తులకు సంబంధించిన అంశాలపై సమాచారం ఇచ్చేందుకు సచివాలయంలో ఆర్థిక శాఖ మానవ వనరుల విభాగం ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్ ను కలిశామని వెల్లడించారు. సీఎస్ సమీర్ శర్మ నేతృత్వంలో పీఆర్సీ అంశాలపై జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో అంశాల వారీగా చర్చిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసిందని వివరించారు. సీఎం జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రకటన వస్తుందని ఉద్యోగులు ఆశించారని అయితే ఆ ప్రకటన రాదని తెలిసి నిరాశ చెందామని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇస్తున్న 27 శాతం కంటే ఎక్కువ‌ ఫిట్మెంట్ ఇవ్వాలని సీఎం ఆదేశించినట్టుగా సజ్జల తెలిపారన్నారు. తెలంగాణా కంటే మెరుగ్గానే పీఆర్సీ ప్రకటన ఉంటుందని ఆశిస్తున్నట్టు బండి స్పష్టం చేశారు.

సజ్జల వ్యాఖ్యలతో ఆందోళన.

Bopparaju On DA: సీఎస్ సమీర్ శర్మ నేతృత్వంలో జరిగే కార్యదర్శుల సమావేశంలో 71 డిమాండ్లపై చర్చించాలని కోరినట్టు ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. ఉద్యోగులకు బకాయిపడిన 1600 కోట్ల రూపాయలను విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు. నిలుపుదల చేసిన 3 డీఏ బకాయిలను కూడా తక్షణం విడుదల చేయాల్సిందిగా మరోమారు ప్రభుత్వాన్ని కోరతామని స్పష్టం చేశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల వ్యాఖ్యల వల్ల జీతాలు తగ్గుతాయన్న ఆందోళన ఉద్యోగుల్లో ఉందన్నారు. ఎలాంటి అపోహలకూ తావులేకుండా సీఎం వద్ద చర్చలకు పిలవాలని ఉద్యోగ సంఘాలుగా విజ్ఞప్తి చేస్తున్నామని స్పష్టం చేశారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP Govt Talks with Employees Union "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0