Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP Model School jobs

 AP Model Schools: ఏపీ మోడల్‌ స్కూళ్లలో ఉద్యోగాలు. 282 టీచర్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం

AP Model School jobs
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల పలు ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది. తాజాగా రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. మొత్తం 282 పోస్టులను భర్తీ చేయనున్నట్లు జగన్ సర్కార్ వెల్లడించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ పంపిన ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

మొత్తం ఖాళీలు : 282

 ఖాళీలకు గాను 211 పోస్టు గ్రాయ్యుయేట్ టీచర్లు, 71 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 

ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ మేరకు త్వరలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

ప్రస్తుతం మోడల్‌ స్కూల్‌లలో గెస్ట్‌ ఫ్యాకల్టీగా పని చేస్తున్న పార్ట్‌టైమ్‌ టీచర్లకు ఈ నియామకాల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 165 మోడళ్ల స్కూళ్లలో ఖాళీల భర్తీకి ఈ నియామకాలను చేపట్టారు. జోన్ల వారీగా ఈ నియామకాలు చేపట్టారు.

జోన్ల వారీగా  నియామకాలు

  • జోన్‌-1,50 పోస్టులు (PGT-33,TGT-17)
  • జోన్‌-2,04 పోస్టులు (PGT-04,TGT-00)
  • జోన్‌-3,73 పోస్టులు (PGT-50,TGT- 23)
  • జోన్‌-4,155 పోస్టులు (PGT-124,TGT-31)

జులై 1 తేదీ నాటికి 18-52 ఏళ్ల వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నాను. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 5న ప్రారంభం కాగా.. దరఖాస్తుకు డిసెంబర్ 20ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అబ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP Model School jobs"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0