APPSC Job Notification
APPSC Recruitment: డిగ్రీ అర్హతతో 730 ప్రభుత్వ ఉద్యోగాలు.అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్.
APPSC Job Notification కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం (AP Government) గుడ్ న్యూస్ చెప్పింది. రెవెన్యూ మరియు దేవదాయశాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్‌సీ (APPSC) తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో రెవెన్యూ శాఖలో (Revenue Department) 670 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Notification) ఇచ్చింది ఏపీపీఎస్‌సీ.. అందులో ప్రధానంగా దేవదాయ శాఖలో (Endowment Department) 60 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 730 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 30.12.2021న ప్రారంభమై 19.01.2022 నుండి 29.01.2022 వరకు కొనసాగుతుంది. అప్లికేషన్ ప్రాసెస్, దరఖాస్తు విధానానికి అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in/ ను సందర్శించాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాలు రెవెన్యూ శాఖలో.
జిల్లా పోస్టుల సంఖ్య
శ్రీకాకుళం 38
విజయనగరం 34
విశాఖపట్నం 43
తూర్పు గోదావరి 64
పశ్చిమ గోదావరి 48
కృష్ణ 50
గుంటూరు 57
ప్రకాశం 56
SPS నెల్లూరు 46
చిత్తూరు 66
అనంతపురము 63
కర్నూలు 54
వైఎస్ఆర్ కడప. 51
మొత్తం 670
అర్హతలు
దరఖాస్తు చేసుకొనే అభ్యర్థి గుర్తింపు పొందన యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కంప్యూటర్ పరీజ్ఞానం ఉండాలి.
దేవదాయ శాఖలో జిల్లా వారీగా ఉద్యోగాలు
జిల్లా పోస్టుల సంఖ్య
శ్రీకాకుళం 04
విజయనగరం 04
విశాఖపట్నం 04
తూర్పు గోదావరి 08
పశ్చిమ గోదావరి 07
కృష్ణ 06
గుంటూరు 07
ప్రకాశం 06
SPS నెల్లూరు 04
చిత్తూరు 01
అనంతపురము 02
కర్నూలు 06
వైఎస్ఆర్ కడప 01
మొత్తం 60
అర్హతలు
దరఖాస్తు చేసుకొనే అభ్యర్థి గుర్తింపు పొందన యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
ఎంపిక విధానం.
- దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామ్ నిర్వహిస్తారు.
- సంబంధిత పోస్టుల ఆధారంగా కంప్యూటర్ ప్రొఫిషియన్సీని పరీక్షిస్తారు.
దరఖాస్తు విధానం.
- Step 1 : అభ్యర్థులు ముందుగా ఏపీపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in/ ఓపెన్ చేయాలి.
- Step 2 : హోమ్ పేజీలో వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కోసం One Time Profile Registration లింక్ పైన క్లిక్ చేయాలి.
- Step 3 : ఆ తర్వాత New Registration పైన క్లిక్ చేయాలి.
- Step 4 : అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతల వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
- Step 5 : యూజర్ ఐడీ జనరేట్ అవుతుంది.
- Step 6 : ఆ తర్వాత లాగిన్ అయి పాస్‌వర్డ్ సెట్ చేసుకోవాలి.
- Step 7 : ఆ తర్వాత https://psc.ap.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి Online Application Submission పైన క్లిక్ చేయాలి.
- Step 8: యూజర్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ చేయాలి.
- Step 9 : పోస్టు పేరు సెలెక్ట్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.
- Step 10 : అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని భద్రపర్చుకోవాలి.
0 Response to "APPSC Job Notification"
Post a Comment