Banking: Details of what to do if the bank locker 'key' is lost.
Banking : బ్యాంక్ లాకర్ ' కీ ' పోగొట్టుకుంటే ఏం చేయాలి వివరాలు.
బంగారం, ఆస్తి పత్రాలు వంటి విలువైన వస్తువులను భద్రపరిచేందుకు బ్యాంకు లాకర్లను ఆశ్రయిస్తుంటారు చాలామంది. లాకర్ తీసుకున్న తరువాత దానికి సంబంధించిన ఒక 'కీ'ని ఖాతాదారునికి ఇస్తాయి బ్యాంకులు.
ఏం చేయాలంటే.
బ్యాంక్ లాకర్ ప్రారంభించినప్పుడు మొత్తం లాకర్‌కి 2 తాళాలు ఉంటాయి. ఒకటి ఖాతాదారుడికి, మరోటి బ్యాంకు వద్ద ఉంటాయి. 'కీ' ని జాగ్రత్తగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అయినప్పటికీ కొంత మంది అనుకోకుండా తాళాలు పొగొట్టుకుంటే ఏంటి పరిస్థితి. లాకర్ 'కీ' పోయినప్పుడు మొదట బ్యాంక్ మేనేజర్‌కి దీనికి సంబంధించిన సమాచారం తెలియజేస్తూ ఒక లేఖ రాయాలి. అప్పుడు లాకర్‌ను మరొకరు తెరవకుండా జాగ్రత్త పడతారు. లాకర్ 'కీ' పోయినట్లు బ్యాంకుకి సమాచారం ఇస్తే కొత్త లాకర్‌తో పాటు తాళాలను కేటాయిస్తారు లేదా డూప్లికేట్ 'కీ' లను తయారుచేస్తారు. కొన్ని సందర్భాలలో లాకర్ తయారు చేసిన కంపెనీని సంప్రదిస్తారు. లాకర్ తెరవడానికి శిక్షణ పొందిన వారు బ్యాంకు కార్యాలయానికి వచ్చి బ్యాంకు అధికారి, లాకర్ కలిగిన వ్యక్తి సమక్షంలో లాకర్‌ను తెరుస్తాడు. ఒకవేళ ఆ వ్యక్తి అందుబాటులో లేకపోతే బ్యాంకు అధికారులే ఈ ప్ర్రక్రియ పూర్తి చేస్తారు. ఆ తర్వాత అందులో ఉన్న నగదు లేదా బంగారం లాకర్ తీసుకున్న వ్యక్తికి చేరవేస్తారు. మొత్తం ఇది పూర్తయ్యేసరికి రూ. 3 వేల వరకు ఖర్చవుతుంది. చూసారా కేవలం 'కీ' పోగొట్టుకుంటే అదనంగా ఎంత ఖర్చు చేయాల్సి వస్తుందో అందుకే జాగ్రత్త పడాలి.
లాకర్ సైజును బట్టి ఖర్చు..
లాకర్ సైజు ఆధారంగా కూడా మీరు ఖర్చు చేయాల్సి ఉంటుంది. చిన్న లాకర్ అయితే రీప్లేస్‌మెంట్ చార్జీలు తక్కువగా ఉంటాయి. అదే పెద్ద లాకర్ అయితే ఛార్జీలు ఎక్కువగా ఉండే అవకాశముంది. అందుకే 'కీ' జాగ్రత్తగా భద్రపరుచుకోవడం ముఖ్యం.
0 Response to "Banking: Details of what to do if the bank locker 'key' is lost."
Post a Comment