Postal DepartMental Jobs
పోస్టల్ డిపార్ట్ మెంట్ లో ఉద్యోగాలు.
పోస్ట్ ఆఫీస్ జాబ్స్ కోరుకునే వారికి ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ శుభవార్త చెప్పింది. పోస్ట్ ఆఫీసులు, సేవింగ్స్ బ్యాంక్ కంట్రోల్ ఆర్గనైజేషన్, సర్కిల్ ఆఫీస్, రీజనల్ ఆఫీస్, రైల్వే మెయిల్ సర్వీస్‌లో పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా వాటి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేయనున్న ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు ఇలా ఉన్నాయి.
మొత్తం ఖాళీలు: 124
- పోస్టల్ అసిస్టెంట్ పోస్టులు 51,
- సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులు 25,
- పోస్ట్‌మ్యాన్ పోస్టులు 48
అర్హతలు:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు నుంచి ఇంటర్మీడియట్ పాస్ కావాలి.
60 రోజుల బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉండాలి.
అభ్యర్థుల వయస్సు 18 నుంచి 27 ఏళ్లు ఉండాలి.
క్రీడార్హతలు:
- రాష్ట్రం తరఫున లేదా దేశం తరఫున జాతీయ, అంతర్జాతీయ క్రీడలు, గేమ్స్‌లో పాల్గొని ఉండాలి.
- ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్‌లో పాల్గొనాలి. నేషనల్ స్పోర్ట్స్‌లో స్టేట్ స్కూల్ టీమ్స్ నుంచి పార్టిసిపేట్ చేయాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్
దరఖాస్తులకు చివర తేదీ:24.12.2021
వేతనాలు:
- పోస్టల్ అసిస్టెంట్‌కు రూ.25,000 బేసిక్ వేతనంతో మొత్తం రూ.81,100 వేతనం,
- సార్టింగ్ అసిస్టెంట్‌కు రూ.25,000 బేసిక్ వేతనంతో మొత్తం రూ.81,100 వేతనం,
- పోస్ట్‌మ్యాన్‌కు రూ.21,700 బేసిక్ వేతనంతో మొత్తం రూ.69,100 వేతనం
- అభ్యర్థులు ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్ https://www.indiapost.gov.in/ లో అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
0 Response to "Postal DepartMental Jobs"
Post a Comment