Do not come to the meeting with the CM with black badges
సీఎంతో భేటీకి నల్లబ్యాడ్జీలతో రావొద్దు
- బొప్పరాజు, బండితో బుగ్గన, సజ్జల భేటీ
- నల్లబ్యాడ్జీలతోనే వస్తామన్న ఉద్యోగ నేతలు
- ఉద్యమం వాయిదా కుదరదని స్పష్టీకరణ
- సీపీఎస్ రద్దుకు ఆప్షన్లు వెతుకుతున్నాం
- నా వ్యాఖ్యలను వక్రీకరించారు: సజ్జల
అమరావతి సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో సమావేశం అనంతరం ఏపీ జేఏసీ, ఏపీజేఏసీ అమరావతి నేతలతో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రె డ్డి, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విడిగా భేటీ అయ్యారు. చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఉద్యమ కార్యాచరణ విరమించాలని కోరారు. పీఆర్సీపై సీఎం జగన్‌తో జరిగే సమావేశానికి నల్లబ్యాడ్జీలతో రావొద్దని సూచించారు. ‘‘సీఎంతో సమావేశయయ్యే సమయానికి మీరు ఉద్యమంలో ఉంటూ వస్తే మంచిది కాదు. తాత్కాలికంగా అయినా ఉద్యమాన్ని పక్కనబెట్టి రండి. పీఆర్సీ సమస్య పరిష్కారం అయిన తర్వాత మిగతా విషయాలపై అభ్యంతరాలు ఉంటే మళ్లీ ఉద్యమాన్ని కొనసాగించుకోండి’’ అంటూబుగ్గన, సజ్జల ప్రతిపాదించినట్లు తెలిసింది. అయితే సీఎంతో చర్చలకు నల్లబ్యాడ్జీలతోనే వస్తామని జేఏసీల నేతలు స్పష్టం చేసినట్లు సమాచారం.
స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఉద్యమం
మా డిమాండ్లన్నింటిపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఉద్యమం కొనసాగస్తాం. సీఎంతో జరిగే సమావేశానికి నల్లబ్యాడ్జీలతోనే హాజరవుతాం. పీఆర్సీ నివేదికను పాక్షికంగానే బయటపెట్టారు.
కొత్తగా అధికారుల కమిటీ సిఫారసులు చేయడం సంప్రదాయం కాదు. కేంద్ర వేతన సవరణ సంఘాన్ని అమలు చేయాలన్న సూచనను పూర్తిగా తిరస్కరించాం. అధికారుల కమిటీ దుర్మార్గంగా వ్యవహరించింది. ఫిట్‌మెంట్, పీఆర్సీ, మోనిటరీ బెనిఫిట్ అమలు తేదీలపై ఎలాంటి పురోగతీ లేదు.
బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్
ఫిట్‌మెంట్ విషయంలో స్పష్టత లేదు
ఫిట్‌మెంట్ విషయంలో సమావేశంలో క్లారిటీ రాలేదు. మిగిలిన అంశాలపై సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయి. 55శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని కోరాం. మా మొత్తం డిమాండ్లన్నింటికీ ఎప్పటిలోగా పరిష్కారం చూపుతారనే అంశాన్ని రాతపూర్వకంగా ఇస్తే ఉద్యమం కొనసాగింపుపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పాం. పవర్ మొత్తం బుగ్గన, సజ్జల దగ్గర లేదు. సీఎంతోనూచర్చించాలి కదా. మా ఉద్యమ ఫలితంగానే ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వంలో కదలిక వచ్చింది.
బండి శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ చైర్మన్
0 Response to "Do not come to the meeting with the CM with black badges"
Post a Comment