Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Home Loan

 గృహ రుణం లేదా హోమ్ లోన్ (Home Loan) అనేది ఒక వ్యక్తి సొంత ఇంటిని కొనుగోలు చేయడానికి పొందే సురక్షిత రుణం.


నిర్మాణంలో ఉన్న లేదా డెవలపర్ నుంచి సిద్ధంగా ఉన్న ఆస్తి కొనుగోలుకు ఈ లోన్ తీసుకోవచ్చు. రీసేల్ కోసం ప్రాపర్టీని (Home Loan for Resale Property) కొనుగోలు చేయడం, ఒక స్థలంలో హౌసింగ్ యూనిట్‌ను నిర్మించడం, ఇప్పటికే ఉన్న ఇంటిని రీమోడలింగ్ చేయడం.. వంటి వివిధ అవసరాలకు హోమ్ లోన్ తీసుకోవచ్చు. ప్రస్తుత గృహ రుణాన్ని వేరే సంస్థకు బదిలీ (Home Loan transfer) చేసే ఆప్షన్‌ను సైతం చాలా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కల్పిస్తున్నాయి. కస్టమర్లు తీసుకున్న గృహ రుణాన్ని నెలవారీ వాయిదాల (EMI) రూపంలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. రుణ మొత్తంలో కొంత భాగంతో పాటు దానిపై వర్తించే వడ్డీని ఇలా EMIల రూపంలో తిరిగి చెల్లించాలి. కరోనా తరువాత చాలామంది సొంతింటి నిర్మాణం లేదా కొనుగోలుపై దృష్టి సారించారు. ఈ క్రమంలో బ్యాంకులు సైతం తక్కువ వడ్డీకే హోమ్‌ లోన్లు అందిస్తూ కస్టమర్లకు ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు అందిస్తున్న బెస్ట్ హోమ్ లోన్ పథకాలు, ఆఫర్ల గురించి తెలుసుకుందాం.

1. కోటక్ మహీంద్రా బ్యాంక్ (Kotak Mahindra Bank Home Loans)

ఈ బ్యాంకు తక్కువ వడ్డీ రేటుతో హోమ్ లోన్లు అందిస్తోంది. కోటక్ మహీంద్రా హోమ్ లోన్ వడ్డీ రేట్లు 6.50% నుంచి ప్రారంభమవుతాయి. లోన్ మొత్తంలో 0.50% వరకు ప్రాసెసింగ్ ఫీజు విధిస్తారు. లోన్ కాలపరిమితి 30 సంవత్సరాల వరకు ఉంటుంది. జీరో ప్రీపేమెంట్ ఛార్జీలు, టాప్-అప్ లోన్‌తో బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవడం వంటి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

2. SBI బ్రిడ్జ్ హోమ్ లోన్ (SBI Bridge Home Loans)

స్వల్పకాలిక అవసరాలకు ఈ లోన్ ఉత్తమమైనది. 9.50 శాతం నుంచి ప్రారంభమయ్యే వడ్డీ రేట్లు, లోన్ మొత్తంలో 0.35% ప్రాసెసింగ్ ఫీజు, 2 సంవత్సరాల వరకు రుణ కాల వ్యవధి.. వంటి ఫీచర్లతో ఈ హోమ్ లోన్ లభిస్తుంది. హిడెన్ ఛార్జీలు, ముందస్తు చెల్లింపులపై పెనాల్టీ లేకపోవడం మరో ప్రత్యేకత.

3. ICICI బ్యాంక్ ఎక్స్‌ట్రా హోమ్ లోన్స్ (ICICI Bank Home Loans)

దీర్ఘకాలిక అవసరాలకు ఈ లోన్ బెస్ట్ ఆప్షన్. దీని వడ్డీ రేట్లు 6.90% నుంచి ప్రారంభమవుతాయి. గరిష్ట రుణ వ్యవధి 30 సంవత్సరాలుగా ఉంటుంది. లోన్ మొత్తంలో 0.5% వరకు అతి తక్కువ ప్రాసెసింగ్ ఫీజు వర్తిస్తుంది. ఈ హోమ్ లోన్ ముందస్తు చెల్లింపు ఛార్జీలు కూడా లేవు.

4. కెనరా బ్యాంక్ హౌసింగ్ లోన్ (Canara Bank Home Loans)

ఈ హోమ్ ద్వారా మహిళలు తక్కువ వడ్డీ రేటు ప్రయోజనాలు పొందవచ్చు. వారికి కేవలం 6.90% నుంచి వడ్డీ రేటు ప్రారంభమవుతుంది. లోన్ రీపేమెంట్ గడువు 30 సంవత్సరాల వరకు ఉంటుంది. లోన్ మొత్తంలో 0.50% వరకు ప్రాసెసింగ్ ఫీజు వర్తిస్తుంది. లోన్ ముందస్తు చెల్లింపు ఛార్జీలు సైతం లేవు.

5. యాక్సిస్ బ్యాంక్ హోమ్ లోన్ (Axis Bank Home Loan)

నెలవారీ జీతం పొందే ఉద్యోగులకు ఈ లోన్ ఉత్తమ వడ్డీ రేటును అందిస్తుంది. ఈ లోన్ వడ్డీ రేట్లు 6.90% నుంచి ప్రారంభమవుతాయి. అత్యధికంగా రూ. 5 కోట్ల వరకు రుణం పొందవచ్చు. 30 సంవత్సరాల లోన్ రీపేమెంట్ గడువుతో అందుబాటులో ఉన్న ఈ రుణాలపై 1% వరకు ప్రాసెసింగ్ ఫీజు వర్తిస్తుంది. దీనిపై ఎలాంటి ముందస్తు చెల్లింపు/ఫోర్‌క్లోజర్ ఛార్జీలు లేవు.

6. SBI హోమ్ లోన్ - జాయింట్ హోమ్ లోన్ (SBI Joint Home Loan)

గృహ రుణాలపై ఎస్బీఐ వడ్డీ రేట్లు 6.75% నుంచి ప్రారంభమవుతాయి. లోన్ రీపేమెంట్ వ్యవధి 30 సంవత్సరాల వరకు ఉంటుంది. YONO యాప్ ద్వారా దరఖాస్తు చేస్తే ప్రాసెసింగ్ ఫీజుపై 100% మినహాయింపు వర్తిస్తుంది. మహిళా రుణగ్రహీతలకు ప్రత్యేక వడ్డీ రాయితీ లభిస్తుంది.

7. పెన్షనర్లు/సీనియర్ సిటిజన్ల కోసం LIC HFL హోమ్ లోన్ (LIC HFL Home Loan)

ఈ లోన్ వడ్డీ రేట్లు 6.90% నుంచి ప్రారంభమవుతాయి. లోన్ రీపేమెంట్ గడువు 15 సంవత్సరాల వరకు లేదా కస్టమర్లకు 70 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఉంటుంది. ఈ లోన్ ప్రాసెసింగ్ ఫీజు రూ.10,000- రూ.15,000 మధ్య ఉంటుంది.

8. ప్రభుత్వ ఉద్యోగుల కోసం SBI ప్రివిలేజ్ హోమ్ లోన్ (SBI Home Loans for Govt Employees)

ప్రభుత్వ ఉద్యోగుల కోసం SBI ప్రత్యేకంగా అందిస్తున్న ఈ ప్రివిలేజ్ హోమ్ లోన్ వడ్డీ రేట్లు 6.75% నుంచి ప్రారంభమవుతాయి. లోన్ రీపేమెంట్ గడువు 30 సంవత్సరాలుగా ఉంటుంది. జీరో ప్రాసెసింగ్ ఫీజు, మహిళా రుణగ్రహీతలకు తక్కువ వడ్డీ రేట్లు వంటి ఆఫర్లు వర్తిస్తాయి.

9. యాక్సిస్ బ్యాంక్ NRI హోమ్ లోన్ (Axis Bank NRI Home Loan)

NRIలకు యాక్సిస్ బ్యాంక్ ప్రత్యేకంగా అందిస్తున్న ఈ హోమ్‌ లోన్‌పై 6.90% నుంచి వడ్డీ రేటు ప్రారంభమవుతుంది. 25 సంవత్సరాల వరకు ఫ్లెక్సిబుల్ లోన్ రీపేమెంట్ గడువు, తక్కువ ప్రాసెసింగ్ ఫీజు, జీరో ఫోర్‌క్లోజర్ ఛార్జీలు.. వంటి ఆఫర్లు ఉంటాయి.

10. కొనుగోళ్ల కోసం HDFC లిమిటెడ్ అందిస్తున్న హోమ్ లోన్ (HDFC Home Loan)

ఈ గృహ రుణంపై వడ్డీ రేట్లు 6.70% నుంచి ప్రారంభమవుతాయి. రీపేమెంట్ గడువు 30 సంవత్సరాల వరకు ఉంటుంది. లోన్ మొత్తంలో 0.50% వరకు ప్రాసెసింగ్ ఫీజు వర్తిస్తుంది. AGIF భాగస్వామ్యంతో భారత సైన్యంలోని ఉద్యోగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, ఆఫర్లు ఉంటాయి.

11. PNB HFL ప్లాట్ లోన్ (PNB HFL Home Loan)

ప్లాట్ కొనుగోలు, ఇంటి నిర్మాణం కోసం ఈ హోమ్ లోన్ బెస్ట్ ఆప్షన్. ఇందులో వడ్డీ రేట్లు 6.99% నుంచి ప్రారంభమవుతాయి. లోన్ రీపేమెంట్ గడువు 30 సంవత్సరాల వరకు ఉంటుంది. లోన్ మొత్తంలో 0.5% వరకు ప్రాసెసింగ్ ఫీజు వర్తిస్తుంది.

12. ప్రస్తుత కస్టమర్లకు HDFC అందించే హోమ్ లోన్ (HDFC Home Loans)

ఇప్పటికే ఉన్న HDFC కస్టమర్లు ఈ హోమ్ లోన్‌ను ఎంచుకోవచ్చు. వడ్డీ రేట్లు 6.70% నుంచి ప్రారంభమవుతాయి. లోన్ రీపేమెంట్ వ్యవధి 30 సంవత్సరాలుగా ఉంటుంది. లోన్ మొత్తంలో 0.5% ప్రాసెసింగ్ ఫీజు వర్తిస్తుంది.

13. HDFC Ltd హోమ్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ (HDFC Home Loan Transfers)

బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ పరంగా ఇది ఉత్తమ హోమ్ లోన్. ఈ గృహ రుణ వడ్డీ రేట్లు 6.70% నుంచి ప్రారంభమవుతాయి. కస్టమర్లు రూ.50 లక్షల వరకు అదనపు టాప్-అప్ లోన్‌ పొందవచ్చు. లోన్ గడువు 30 సంవత్సరాల వరకు ఉంటుంది. లోన్ మొత్తంలో 0.5% వరకు ప్రాసెసింగ్ ఫీజు వర్తిస్తుంది. కో-అప్లికెంట్ ద్వారా లోన్ మొత్తాన్ని మరింత పెంచుకోవచ్చు.

14. SBI స్మార్ట్ హోమ్ టాప్ అప్ లోన్: (SBI Smart Top up Home Loan)

ఇది ఒక బెస్ట్ టాప్ అప్ హోమ్ లోన్. ఈ లోన్ వడ్డీ రేట్లు 8.05% నుంచి ప్రారంభమవుతాయి. లోన్ మొత్తంలో 0.40% ప్రాసెసింగ్ ఫీజు వర్తిస్తుంది. రూ.20 లక్షలు పైబడిన రుణాలకు ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం సైతం ఉంటుంది. లోన్ గడువు 30 సంవత్సరాల వరకు ఉంటుంది. ఎలాంటి ముందస్తు చెల్లింపు పెనాల్టీలు వర్తించవు.

15. యూనియన్ ఆవాస్ హోమ్ లోన్: (Union Awas Home Loan)

యూనియన్ బ్యాంక్ అందించే ఈ హోమ్ లోన్.. తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి మంచి ఆప్షన్. ఈ లోన్ వడ్డీ రేట్లు 6.40% నుంచి ప్రారంభమవుతాయి. 600 కంటే తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నవారు ఇంటి నిర్మాణం లేదా కొనుగోలు కోసం 3 సంవత్సరాల మారటోరియంతో ఈ లోన్‌ పొందవచ్చు. లోన్ గడువు 30 సంవత్సరాల వరకు ఉంటుంది. వ్యవసాయదారులు, అల్ప ఆదాయ వర్గాల వారు ఈ లోన్‌ తిరిగి చెల్లించేటప్పుడు EMIలకు బదులుగా త్రైమాసిక/అర్ధ-వార్షిక/వార్షిక చెల్లింపుల ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. రూ.48,000 వరకు వార్షిక ఆదాయం ఉండే విద్యా సంస్థల శాశ్వత ఉద్యోగులు, వ్యవసాయదారులకు ఈ లోన్ అందుబాటులో ఉంటుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Home Loan"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0