Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

How much of your income should be invested in health insurance?

 మన ఆదాయంలో ఆరోగ్య బీమాలో ఎంత పెట్టుబడి పెట్టాలి ?

How much of your income should be invested in health insurance?

ఆరోగ్య బీమా తీసుకోవడం భారత్‌లో ఇప్పటిదాకా ఎక్కువ మంది ప్రజానీకానికి చాలా కొత్త అలవాటుగానే చెప్పాలి. కోవిడ్ పరిస్థితులు తర్వాత జరిగిన పరిణామాలు ఆరోగ్య బీమాలో పెట్టుబడులు ఎంత అవసరమో చాలా మందికి తెలిసి వచ్చింది.

ఆరోగ్య పరిస్థితులు ఇబ్బంది పెట్టినపుడు తప్పితే ప్రజలు ఇప్పటికీ దీనిలో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడరు. మంచి ఆరోగ్య బీమాలో పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు పెట్టుబడి పెట్టకపోవడం కంటే చాలా ఎక్కువ అని చెప్పవచ్చు. ఆరోగ్య బీమాను కలిగి ఉండటం దీర్ఘకాలంలో మేలే జరుగుతుంది. ఇది ఆసుపత్రి ప్రక్రియను చాలా సులభతరం చేసి ఊహించని అనారోగ్య పరిస్థితుల్లో కుటుంబానికి ఆర్ధిక ఒత్తిడి లేకుండా చేస్తుంది.

ఎవరైనా సంపాదించడం ప్రారంభించినపుడు మనసులో మొదటి ఆలోచన పొదుపు గురించి చేస్తారు. శాశ్వత ఆదాయ వనరుని కలిగి ఉండటం ప్రారంభించినప్పటి నుండి.. పొదుపు, ఖర్చుల మధ్య సమతుల్యతను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. సాధారణంగా ఆలోచిస్తే పెట్టుబడి అనేది కూడా ఒక ఆస్తి, ఇది ఆదాయాన్ని సంపాదించడానికి చేయబడుతుంది. ఇది ప్రతి వ్యక్తి అవసరాలకు అనుగుణంగా పెట్టుబడులు ఉంటాయి. ఎంత మొత్తం అయిన పెట్టుబడి పెట్టవచ్చు. ఇది మ్యూచువల్ ఫండ్స్ లేదా స్టాక్ మార్కెట్‌లో, బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో మదుపు చేయోచ్చు. ఎప్పుడైన ప్రజలు తమ ఆదాయంలో కొంత భాగాన్ని పెట్టుబడిగా పెట్టాలని ఆలోచిస్తారు. అయితే ఒక వ్యక్తి సరిగ్గా పెట్టుబడి పెట్టని ఏకైక కేటగిరి ఉందంటే అది వారి ఆరోగ్యం. బీమా, ఆరోగ్య సంరక్షణలో పెట్టుబడి పెట్టడం అనేది తరచుగా ప్రాధాన్యతా ప్రాతిపదికన చేయబడదు. ఎందుకంటే ఇది నిజమైన ఆదాయాన్ని ఉత్పత్తి చేయదు. కానీ అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించబడుతుంది. ఆరోగ్య బీమా అనేది ఒకరి పొదుపు లేదా పెట్టుబడిలో కొన్ని ప్రధాన భాగాలుగా పరిగణించబడాలని నిపుణులు భావిస్తున్నారు. ఒక ఉద్యోగి నెలవారీ సంపాదనలో దాదాపు 30% వారి పొదుపు పెట్టుబడులకు వెళ్లాలి. అందులో తక్కువలో తక్కువగా 3-4% ఆరోగ్య బీమాకి వెళ్లాలని నిపుణులు భావిస్తున్నారు.

మీకు మీ కుటుంబానికి సరైన బీమా కవరేజ్ ఏదైనా వైద్య అత్యవసర పరిస్థితుల్లో మీకు చేతి డబ్బులు ఖర్చవ్యకుండా మిమ్మల్ని, మీ ఆర్ధిక పరిస్థితిని కాపాడుతుంది. మంచి పాలసీలో ఏవైనా ఆకస్మిక వైద్య అవసరాలతో పాటు అంబులెన్స్ ఖర్చు, ఆసుపత్రి వెళ్లె ముందు పోస్ట్ ఛార్జీలు మొదలైన ఖర్చులను బీమా సంస్థలు భరిస్తాయి. ఇవి ఆసుపత్రి ప్రక్రియను మరింత సులభతరం చేసి, మానసిక, ఆర్ధిక ఒత్తిడిని తగ్గిస్తాయి. ముందుగా బీమా తీసుకోవాలని ఆలోచన వచ్చిన వెంటనే మొదటగా ఆరోగ్య బీమా తీసుకోవడానికే మొదటి అవకాశంగా చూడాలని తర్వాతే జీవిత బీమాను (టర్మ్ ఇన్సూరెన్స్‌ను) తీసుకోవాలని నిపుణులు తెలిపారు. మీపై ఆధారపడే వారు ఎవరూ లేకుంటే జీవిత బీమాను తీసుకోవడం మానివేయవచ్చేమోగాని, ఆరోగ్య బీమా తీసుకోవడాన్ని ఎపుడూ మరవొద్దు. ఆఫీసులో మీ యజమాని నుండి గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ కలిగి ఉంటే, మీరు చిన్న వయస్సులోనే ఉండి ఉంటే వేరే సొంతంగా ఆరోగ్య బీమాను కలిగి ఉండటం కొంత కాలం ఆలస్యం చేయోచ్చు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "How much of your income should be invested in health insurance?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0